పాబ్లో సబోరియో పద్యాలు నాలుగు

పాబ్లో సబోరియో కోస్ట రికా లో పుట్టి పెరిగారు. అమెరికా, స్వీడన్, జర్మనీ దేశాల్లో జీవించారు. ప్రస్తుతం డెన్మార్క్ లో నివాసం. తాను ఏ కెరీర్ లో ఇమడగూడని ఈయన పట్టుదల. “Beyond Language” అనే ఆయన కవితా సంపు నుంచి సేకరించి అనువదించిన పద్యాలివి.

Beyond Language Home page

1. అనంత అవ్యక్తం

ఆకాశాన
కనిపించీ కనియించని ముత్యంలా
ఓ నగ్న మేఘం;
దాని మీంచి జారుతుంటుంది
అనంత అవ్యక్తం.

నేను
చలి సమీరాలను చీల్చి తెచ్చి
నా భుజాలకు
కనిపించని మెత్తలను కట్టుకుంటాను.

కారు పరుగెత్తిస్తున్న
హెడ్ లైట్ కాంతులను
పీల్చుతుంటుంది దిగ్వలయం.

నా అర్థాలన్నిటికి
ఆధారం వాతావరణం;
మంచు బరువుల ఆలోచనలు
కింది స్థాయికి చేరుకుంటవి,
అద్దంలాంటి నిశ్శబ్ద తెలివిడులు
పిట్ట మాటలను రాయి చూపులను
కలుపుతుంటవి.

ఎంత నిశితంగా ఉండాలి
బాణంలా దూసుకుపోయే
ఈ అడవి బాతుల బారు.

ఆఖరు సూర్యుని కత్తి గాటుకు
పేరిన నా కన్నీటి తడిపొర
కనుమరుగు చేస్తున్నది
నా అశ్రువులో దాగిన ప్రపంచాన్ని.

నా అసంపూర్ణ కథ
తిరిగి బుద్ధునిలో కరుగుతుంది.
రాత్రి; నక్షత్రం లాంటి ఈ రాత్రి
దీర్ఘ కాంతి ధారై పారిపోతుంది.

AMOUNT OF UNKNOWN

A colossal amount
of unknown
slides down
the pearl
barely visible
of the sky.
A naked
cloud
I shivered
the cold wind
arranged as moss
invisibly padding
my arms
the car races
its lights inhaled
by the horizon.
My meaning
depends
on the weather
low lying thoughts
heavy with mist
or diaphanous silence
for intelligence
to connect the bird’s speech
with the stone’s stare.
How sharp
must the world
the geese in arrow
become
the last sun
cutting deep my eye
blinding with wetness
the world
inside my tear.
My story
insufficient
melts back
into buddha
tonight it’s night
more like star
fleeing
as long stream
of light.

2. బంగారు  :

దేహరహిత సందేశం
గదిలోకి చేరుకుంది;
వట్టి వర్తమాన సంకేతం.

శుభ్రమైన గుహ
గుండ్రంగా;
ప్రతిధ్వనిలా
వణుకుతున్నది
పారదర్శకంగా.

గాలి
గోడలకు వేలాడుతున్నది
మట్టి బెడ్డలా;
ఆ బరువైన పక్వ ఫలం
ఎప్పుడైనా రాలొచ్చు,

వెలుతురు
అంచుల చుట్టు
గోతులు తవ్వుతున్నది;
నట్టనడుమ
ఓ నీడల ద్వీపాన్ని నాటాలని.

మాట కన్నా చిక్కనైన వార్త
దుర్మార్గపు అనుభవాలను
పారిస్తున్నది;
తుప్పుపట్టిన
మసక వెలుగుల
చీకటి కిటికీలోంచి
పోతూ పోతూ.

ఆ పసిడి సంకేతం
ధి దీపస్తంభాల మిసిమికి తాకి
నేల రాలుతున్నది;
ముడుచుకున్న కొన్ని ఆకులు
పడిఉన్నవి ఇంకా
రోడ్డు పక్కన;
నిండు రాత్రి నిశ్శబ్దంగా
ప్రేవేశించే దాకా.

చేయిని అందిస్తున్నది
తొందరిస్తున్న చెవి
సందేశ సారాంశం కోసం.

శ్రోత
శబ్దాన్ని మాత్రమే చూస్తున్నాడు;
కారుతున్న ప్రపంచ పదార్ధం
సంగీతంలోకి స్రవిస్తున్నది.

వింటున్న వాడి దేహం
మొదట జ్వాలై నర్తించి,
పిదప గాలిలా కదలి,
తుదకు మర్మర ధ్వనిగా
మిగిలి పోయింది.

చివరకు కలుస్తవి
సంకేత సందేశాలు,
దేహ౦ శబ్దం,
సంగీతం రక్త నాళాలు.

ఇప్పుడు
గదిలో నిండిన నీరు
సందేశాన్ని ముంచేస్తుంది.

దేహం – కేవలం ఓ పాట;
పాట ప్రపంచంగా మిగిలి పోతుంది .

GOLDEN

The message
enters the room
without a body.
Pure cave
round as
echo
undulating with
transparency.
The air is crust
hanging from the walls
see that fruit ripe
tremendously heavy
about to fall,
the light
makes a moat
just around the edges
to leave an island
of shadow
in its center.
The message
thicker than voice
makes viscous flow
of experience
as it leaves
through amaranthine twilight-pregnant
window.
The message
golden collide with the gold
of the streetlamp.
Some leaves are
curved still
by the curb
as night enters
as a sort of sound
muffled but total.
The ear eager
lends its arm
like a root
to the column
of the message.
The hearer
sees only sound
the world’s substance
seeping like syrup
into this music.
The listener’s body
dances first as fire
then as air
finally as
hum.
The message
and the body
meet.
The body
and the sound.
The music
and the veins.
The room
now filled with water
drowns the message.
The body
nothing but song
remains as
world.

3. కవిత రాయడం ఎలా :

గారడి ఏంటంటే కళ్ళు మూసుకోవడం.
కనురెప్పల కింది చీకటి దుప్పట్లోకి దూరి వెదకడం.
ఉండు నిశ్చల వేటకానిలా. తొణకొద్దు
శూన్యంలో వెండి వెలుగులు మార్మోగినా.
నీవు వేచి చూచేది ఓ గర్జన కోసం.
అది
ఒక సంకేతాల సుడిగాలితో మొదలౌతుంది;
ప్రతీకల చుట్టు ప్రతీకలు పరిభ్రమిస్తున్న
రూపమార్పిడుల వింత ప్రయోగాలతో.
నీవు
ఒక మెరుపు రేఖను  ఆశిస్తుంటావు,
అవగాహనా కంచెను దాటి
ఆలోచనా తోటలను ఆసాంతం మింగేసే
ఓ విపత్కర ఒంటరి పదం కోసం చూస్తుంటావు.
ఆకస్మిక ప్రమాదాలలోకి సాహసిస్తుంటావు,
బూది కుప్పలపై తుఫానులా చెలరేగుతుంటావు.
త్వరలోనే,
చీకటి కాలిన మంటలు మొదలౌతాయి;
అప్పుడు
నీవు ఓ అణువు లోకి దూకిన సూర్యునివై దర్శిస్తుంటావు
నగ్న నయనానికి కనిపించే ఒక జన్మ ప్రసవించడం .

:HOW TO WRITE A POEM:

The trick is to close the eyes.
To look for the thing
crawling below the carpet of darkness of the lids.
Remain still like a hunter. Do not stir
even if a sliver of light echoes through the emptiness.
You’re looking for a boom.
It starts with a swirl of symbols
curling around each other
in wild experiments of mutation.
You’re looking for a spark, an isolated
hazardous word that will scale
up the fence of perception, to consume
the whole plantation of thoughts.
Venture into this plague of accidents,
advance as a whirlwind upon the dunes of ash.
Soon the darkness begins to burn bright,
you are a sun leaping into a single atom
witnessing a birth to the naked eye.

4. గతంలోకి  :

నేను
మేఘాన్ని నరకాలని
కాంతిని ఖడ్గంలా సాచాను;
చిక్కింది
చిక్కని అనంతత్వపు ద్రవబిందువు.

వెలుతురును
ముక్కలు ముక్కలు చేసి
కాలాన్ని తిరిగి అమర్చేందుకు
సూర్యుణ్ణి మించిన
సాధనం ఇంకేం ఉంటుంది.

తల దిండులను పేల్చి
ఈకల లాంటి జవాబులను
ఆ కలలో వేలాడదీసాక
నిశ్శబ్దం ఎంత సమ్మోహనం;
అది కంపిస్తుంటుంది
నీ కళ్లూ ఆ ఈకలూ కలిసిన
సింఫొనీ లా.

మళ్ళీ  కొన్ని క్షణాలకు
చెట్టుకన్నా ముందు
నల్ల రక్తనాళాల ఆకాశం
నిశ్శబ్దపు రేతిరి దేహం లోకి
వేశిస్తుంది.

అది మనసు సూచన;
దాని కథ తుంచబడుతుంది
కాలం పన్నిన
భ్రాంతి పరిమళంలోంచి.

నా నిన్నటిలో తిష్టవేసిన
ప్రపంచం
నా కథలను నేస్తుంటుంది
పోగు పోగుగా పై పై భాషలోకి;
సముద్రం, శిఖరం, కాంతీ, కంటకాల
వస్తుసంగతుల  ప్రోగును
తునకలు తునకలుగా
ఉపరితల భాషలోకి.

ఒక్క సారి
మూలం లోకి వెనుతిరిగిన
నిశ్శబ్దపు అగాధ గాధ
కన్నుల, కాలివేళ్ళ, సంద్ర తీరాల
శిలలను కప్పేస్తుంది.

OVER DAYS

I stretched light
into knife
to cut the cloud
one strong drop
of eternity
ensued.
What hand
faster than sun
to slice illumination
into tool
and then apparently
disassemble time.
nswers
like feather suspended in that dream
after pillows exploded
and silence so hypnotic
it resembles symphony,
the feathers and your eyes
vibrating like strings.
Then back just minutes
before the tree
enters the sky
with dark veins
into the night’s
quiet body.
That was suggested
by mind
whose story is pinched
from the perfume
illusion prepares
from time.
Was the world
a seat
old me
weaving yarn
after yarn
light, sea, dome, thorn
bit by bit
thing after thing
into a language
of surface
once
spoken
the saga of silence
returns
deepening as strata
to cover
the hills of the toes
and the eyes
those shores
curling back
to their source.

నాగరాజు రామస్వామి

నాగరాజు రామస్వామి. స్వగ్రామం : ఎలగందుల, కరీంనగరం జిల్లా, తెలంగాణ. పుట్టిన తేది : 9- 9 -1939 విద్య : B .Sc , B .E ., శాంతినికేతన్ లో 6 నెలల సాంఘిక విద్యా ట్రైనింగ్ . ఉద్యోగ పర్వం : పదేళ్లు ఎలక్ట్రిక్ ఇంజనీరుగా ఇండియాలో, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘాన, ఓమన్, సౌదీఅరేబియా లో టెక్సటైల్ కంపెనీలలో, చీఫ్ఇంజినీరుగా, ప్రాజెక్ట్ మానేజర్ గా. నివాసం : హైద్రాబాద్ . ప్రచురణలు : ఆంగ్ల కవితా సంపుటాలు -2 , స్వీయ కవితా సంపుటాలు - 3 , వచనం -1 , అనువాద కవితా సంపుటాలు - 7 ( జాన్ కీట్స్ కవితా వైభవం, గీతాంజలి, ఆక్టేవియో పాజ్ సూర్యశిల / Sunstone , అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, కల్యాణ గోద ) - మొత్తం 13 . అముద్రిత కవితా సంపుటాలు - 2 . మొదట్లో కొన్నాళ్ళు "ఎలనార" కలం పేరుతో కవితలు రాశారు. ప్రస్తతం: సిటిజన్ షిప్ కోసం వేచిఉన్న గ్రీన్ కార్డు హోల్డెర్ని. ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు - సన్నీవేల్, ఆస్టిన్, డాలస్ లలో.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.