శరత్ గానం

  • సరోజినీ నాయుడు

దుఃఖపడుతున్న హృదయం మీద ఆనంద తరంగంలా
మేఘానికి వేలాడుతున్నాడు ఆ పడమర సూర్యుడు
నిగనిగలాడుతున్న పనస తొనల బంగారు తుపాను,
సొగసుగా, సున్నితంగా అలల్లా పడిపోతున్న ఆకులు
గాలి మేఘాన్ని ఇటు వైపుగా తోస్తున్నది

గాలి గొంతుకతో నా హృదయాన్ని
పిలుస్తున్న ఆ స్వరాన్ని శ్రద్దగా ఆలకించు
విచారంగా, ఒంటరిగా, అలసటగా నా గుండె
ఆకుల్లాగే దాని కలలు కూడా పడిపోయాయి
నేను మాత్రం వెనకాల ఎందుకు వుండిపోవాలి?

                                                  
Autumn Song

  • Sarojini Naidu

Like a joy on the heart of a sorrow,
The sunset hangs on a cloud;
A golden storm of glittering sheaves,
Of fair and frail and fluttering leaves,
The wild wind blows in a cloud.

Hark to voice that is calling
To my heart in the voice  of the wind:
My heart is weary and sad and alone,
For its dreams like the fluttering leaves have gone,
And why should I stay behind?

దాసరాజు రామారావు

దాసరాజు రామారావు: 1955 లో జననం, సిద్ధిపేట ప్రాంతంలో.టీచరుగా పని చేసి 2013 లో రిటైర్ అయ్యారు. శ్రీశ్రీ మహాప్రస్థానం, ఉన్నవ మాలపల్లి తమకు సాహిత్య అవసరాన్ని ,అక్షరం విలువను నేర్పినాయని చెబుతారు. .45 ఏళ్ల సాహిత్య ప్రయాణంలో గోరుకొయ్యలు, పట్టుకుచ్చుల పువ్వు, విరమించని వాక్యం కవిత్వ సంపుటాలు ప్రచ్ఉఉరించారు. ప్రోత్సాహకాలుగా ఉమ్మిడిశెట్టి, సమైక్య సాహితి, పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం అవార్డులు పొందారు.
మంజీరా రచయితల సంఘం (మెదక్ జిల్లా) లో శాశ్వత సభ్యున్ని.
ప్రధానంగా సాహిత్య సృజన ,జీవన గమనంలో ప్రేరణాత్మక ఆచరణ గ ఉండాలని నమ్ముతాను.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.