విప్లవ నిబద్ధతకు
ఎత్తిన కేతనం: వరవర రావు

పెండ్యాల వరవరరావు.. ఆ పేరు వినగానే విప్లవం, విప్లవ కవిత్వం ఒకేసారి గుర్తుకొస్తాయి. విప్లవ రచయితల సంఘం (విరసం) వ్యవస్థాపకుల్లో ఒకరైన వరవరరావు, 1957 లో ‘సోషలిస్టు చంద్రులు’ అనే కవితతో తన కవనప్రస్థానాన్ని ప్రారంభించారు. ‘చలినెగళ్లు’, ‘జీవనాడి’, ‘స్వేచ్ఛ’, ‘సముద్రం’ మొదలైనవి ఆయన కవిత్వంలో ముఖ్య మలుపులు.  కాలేజీ లెక్చరర్ గా, ప్రిన్సిపల్ గా ఉద్యోగబాధ్యతల్ని నిర్వర్తించిన ఈ ప్రజాకవి .. కారాగారంలో ఉన్నప్పుడు కూడా కవిత్వం రాయడం ఆపలేదు. విప్లవోద్యమ నిబద్ధతకు నిలువుటద్దంగా నిలిచే వరవరరావు, 78 ఏళ్ల వయసులో ఇప్పటికీ, పూనే జైలు లోని అండాకార సెల్ లో, పదుకోడానికి మంచం, కూర్చుని రాసుకోడానికి టేబుల్ కూడా లేని అసౌక్రర్యాల మధ్యనుంచి .. తన వాణినీ బాణినీ వినిపిస్తూనే ఉన్నారు. అందుకే ఆయన కవిత్వానికి వెయ్యక తప్పదు.. ‘రెడ్’ కార్పెట్!

 

https://www.youtube.com/watch?v=2r8ajDrE1u0&feature=youtu.be

మురళీధర్ కేసరి

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.