అభివ్యక్తి ఆధ్యాత్మికశక్తి

You have to grow from the inside out. None can teach you, none can make you spiritual. There is no other teacher but your own soul. 

  • Swami Vivekananda

            Expression i.e. Communication and Spiritual Quotient are two key factors which help develop a holistic personality. That is real personality development.  

అభివ్యక్తి, ఆధ్యాత్మిక శక్తి (ఆ.శ.) (Spiritual Quotient – SQ) వ్యక్తిత్వ వికాసంలో రెండు కీలకమైన అంశాలు. ఇవి రెండూ  సమగ్ర వ్యక్తిత్వ వికాసానికి దోహదం చేస్తాయి. ఒక వ్యక్తి వ్యక్తిత్వం సమగ్రంగా వికసించిందని గుర్తించడానికి ఈ లక్షణాలే ప్రాతిపదికగా నిలుస్తాయి. ఇటువంటి లక్షణాలు కలిగిన వారిలో ఒకరు స్వామి వివేకానంద.  జనాకర్షణ కలిగిన అభివ్యక్తి, గురువు రామకృష్ణ పరమహంస అనుగ్రహంతో సాధించిన ఆధ్యాత్మిక శక్తి (Spiritual Quotient) స్వామి వివేకానంద జీవితాన్ని సంపూర్ణం  చేశాయి.  అభివ్యక్తి అంటే ‘Communication skill’ అని చెప్పుకోవాలి. ‘If you use communication as a skill it will thrill; otherwise it will kill’. Communication skills అందరికి ఉంటాయి. కానీ నైపుణ్యంతో communicate చేసే శక్తి అందరికి ఉండదు. అలా నైపుణ్యంతో communicate చేయగల శక్తినే అభివ్యక్తి (Expression) అనచ్చు. ఇటువంటి నైపుణ్యభరిత అభివ్యక్తి జనాన్ని అమితంగా ఆకర్షిస్తుంది. ఇటువంటి అభివ్యక్తికి ఆధ్యాత్మిక శక్తి (Spiritual Quotient) తోడైతే,    ఆ మానవ శక్తి ప్రపంచానికి మార్గదర్శనం చేస్తుంది. నేటి వ్యక్తిత్వ వికాస ప్రవచనకారులందరూ కేవలం అభివ్యక్తితో విద్యార్ధులను, నిరుద్యోగులను, ప్రజలను ఆకర్షిస్తూ సమాజంలో వివిధ ప్రసార మాధ్యమాల ద్వారా ప్రముఖులుగా చలామణీ అవడం మనం చూస్తున్నాం. వారు కేవలం ప్రేరణనివ్వగలరు. ప్రేరణ తాత్కాలికం. స్ఫూర్తి జీవనది. నిరంతరం ప్రవహిస్తుంటుంది. అటువంటి స్ఫూర్తిదాయక వ్యక్తిత్వ వికాస మూర్తిగా తరతరాలు నిలబడాలంటే ఆధ్యాత్మిక శక్తిని ఆశ్రయించడమే, జీవితాన్ని జీవించే సాధన చేయడమే అత్యుత్తమ మార్గం. అందుకే విశ్వ విఖ్యాత ఫుట్ బాల్ క్రీడాకారుడు పీలే ‘Everything is Practice’ అంటాడు.   అంతటి విజయోన్ముఖమైన సాధనకు బలాన్నిచ్చేది, ఊపునిచ్చేది, ఊతాన్నిచ్చేది, విత్తనం వేసేది ఆధ్యాత్మికత. దాన్ని అన్వేషించడమే జీవన పరమార్ధమైనపుడు వ్యక్తిత్వ వికాసం మన జీవన నదీ గమనంలో అంతర్లీన ప్రవాహమై విలసిల్లుతుంది. నిత్య స్ఫూర్తిదాయకమవుతుంది. That is what true Personality Development enshrined with Spiritual Quotient.   

గురుచింతనలో అనుక్షణం లీనమైనపుడు శిష్యుడే గురువైపోతాడని పెద్దలంటారు. నిజమైన శిష్యుడిని గురువే వెతుక్కుంటూ వస్తాడని కూడా ఆధ్యాత్మిక సాధనా నిమగ్నులంటారు. అంతటి చిత్తశుద్ధి కలిగిన శిష్యులు, అంతటి వాత్సల్యభరిత గురువులు నేడు మృగ్యమైపోయారు. మృగ్యమైపోతున్నారు. అందుకే మనం ఇంకా  IQ (Intelligence Quotient), EQ (Emotional Quotient) ల స్థాయిలోనే పడి కొట్టుకుంటున్నాం. ఈ రోజుల్లో ఉదర నిమిత్తం చేసే ఉద్యోగాలకు IQ  ఎంత మాత్రం అవసరం లేదు.  

ఇక ఉద్యోగం సంపాదించడానికి EQ అవసరం కూడా పెద్దగా లేదు. ఉద్యోగం సంపాదించాక పని చేసే ప్రదేశంలో భావోద్వేగ నియంత్రణ శక్తి (EQ) ఎంతైనా అవసరం. ఇది లేకపోవడం వల్లనే  చాలా పరిశ్రమల్లో  ఉద్యోగులు, యజమానుల మధ్య ఘర్షణలు సాధారణమైపోయాయి. దీనికి ప్రధాన కారణం సామరస్యం, సమరస భావన, సేవా భావం, సర్దుకుపోయే తత్వం లేకపోవడమే. భావోద్వేగ నియంత్రణ శక్తి (EQ) లేకపోవడం వల్లనే ఇటువంటి అనర్ధాలన్నీ పని చేసే ప్రదేశంలో తలెత్తి, ఎన్నో పరిశ్రమల మూసివేతకు కూడా దారి తీశాయి. సమగ్ర వ్యక్తిత్వ వికాసం లేనివారు పరిశ్రమలు నడపడంవల్లనే ఇటువంటి దుష్పరిణామాలు తలెత్తుతున్నాయి. మన దేశంలో స్థాపించిన పరిశ్రమల కంటె మూసేసిన పరిశ్రమలే ఎక్కువ. 2016లో రెండు వందలకు పైగా అంకుర పరిశ్రమలు మూతపడ్డాయి. భారతీయుల ఆరంభ శూరత్వం కంపెనీల స్థాపనలో కూడా కనిపిస్తుంది. ప్రభుత్వాల నిర్లక్ష్యానికి, యాజమాన్య స్థాయిలో ఉన్న పెద్దల అలసత్వానికి బలైపోయిన పరిశ్రమలెన్నో మూతపడి వేలాది కార్మికుల్ని వీధిన పడేశాయి. ఎన్నో జీవితాలు, కుటుంబాలు ఛిద్రమైపోయాయి. ఐ.డి.పి.ఎల్, హెచ్.సి.ఎల్, ఇ.సి.ఐ.ఎల్. టి.విల తయారీ విభాగం, హెచ్.ఎం.టి, సత్యం కంప్యూటర్స్. ఎన్నో ఫార్మా కంపెనీలు,  మరెన్నో పరిశ్రమలు మూతపడటానికి ప్రధాన కారణం అసమగ్ర, అసంపూర్ణ వ్యక్తిత్వ వికాసంతో నాయకులైనవారు యాజమాన్య స్థానాలను ఆక్రమించడమే. స్వార్ధం బలిసి మన చేత్తో మన కన్నే పొడుచుకుని, మన వాళ్ళకే అన్యాయం చేశారనడానికి పూర్తిగా, పాక్షికంగా మూతబడ్డ ఈ కంపెనీలే నిదర్శనం. రాజకీయ నాయకులు ప్రజోపయోగమైన సంస్థలు స్థాపించలేరు. ఎంతో అనుభవమున్న టాటా, ఇన్ఫోసిస్ వంటి ప్రయివేటు కంపెనీలు కూడా ఇటీవలి కాలంలో నాయకుల్లో ఆలోచన, భావోద్వేగ నియంత్రణ లేమి వలన ఎంతో నష్టాన్నిమూటకట్టుకోవలసి వచ్చింది.  ఆధ్యాత్మిక శక్తితో కూడిన భావోద్వేగ నియంత్రణ, నిర్ణయాత్మకమైన అభివ్యక్తి లేకపోవడం వల్లనే కంపెనీలు సైతం ఇటువంటి తప్పుటడుగులు వేస్తున్నాయి. అభివ్యక్తిలో సమతుల్యత, ఆధ్యాత్మిక శక్తిలో చిత్తశుద్ధి వ్యక్తిగత జీవితంలో గానీ, వృత్తిగత జీవితంలో గానీ విజయానికి తిరుగులేని విత్తనాలు. ఆధ్యాత్మిక శక్తికి దేవుడికి ఏ మాత్రం సంబంధం లేదు. ఒకసారి మనిషిగా జన్మించాక ఏదైనా సాధించగలమనే మన అంతరంగ శక్తికి అద్దం పట్టేదే ఆధ్యాత్మిక శక్తి. అదే Spiritual Intelligence.  బంగారు పళ్ళేనికైనా గోడ చేర్పు కావాలి; ఎంతటి విజయం సాధించాలన్నా   సమతుల్యతతో కూడిన అభివ్యక్తి, చిత్తశుద్ధితో కూడిన ఆధ్యాత్మిక శక్తి ఎంతైనా అవసరం. చక్కని అభివ్యక్తిని, ఆధ్యాత్మిక శక్తిని సాధించి మీరు కలలుగనే విజయాలన్నీ మీ సొంతం చేసుకోవాలని నా ఆకాంక్ష.   

చల్లా రామ ఫణి

చల్లా రామ ఫణి - వృత్తిరీత్యా కార్పొరేట్ ట్రైనర్. ప్రవృత్తి రీత్యా కవి, రచయిత. కొన్నాళ్ళు గుమస్తాగా, కొన్నాళ్ళు పాత్రికేయుడుగా, ఓ సంవత్సరం పైగా మారిషస్ లో తెలుగు వారికి తెలుగు బోధన, ఫార్మా రంగంలో మానవ వనరుల శాఖలోనే గత రెండు దశాబ్దాలుగా ఉద్యోగం. ప్రస్తుతం కార్పొరేట్ ట్రైనర్ గా స్థిరపడ్డట్టే అనిపిస్తోంది. తొలి కవితల సంకలనం 'త్రిశంకు నరకం' కు ఆంధ్ర మహిళా సభ వారి 'దేవులపల్లి కృష్ణశాస్త్రి పురస్కారం' అందింది. డెలాయిట్ మానవ వనరుల శాఖ డైరెక్టర్ ఎస్.వి.నాథన్ ముందుమాటతో అంగ్లంలో ‘Access Success… Infinite’ అనే వ్యాసాల సంకలనం 2017లో వెలువడింది. అమెజాన్ లో ఈ పుస్తకం అందరికీ అందుబాటులో ఉంది.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.