కొన్ని ఊహలకు దేహాలుండవు గొలుసు తెగిన ఆకారాలుండొచ్చు; నీటి గ్లాస్ లో వేసిన రంగు బిందువు ఒళ్ళు విరుచుకుంటూ వలయాలు వలయాలుగా విచ్చుకుంటూ కిందికి దిగుతున్నట్టు, కరుగుతున్న ఇంద్రచాప జ్యావల్లీ నాదాలు విహ్వల స్వరసమూహ అస్పష్టరాగాల మనోధర్మ ఆలాపనలై అల్లుకుంటున్నట్టు. అవి ఒక క్షణం నీ చీకటి దారుల తటిల్లతలై కరచాలనం చేసి మాయమౌతుంటవి; వాటి అడుగుజాడల నీడలను అనుసరిస్తూ పొతే రంగు రంగుల నీటిరంగుల చిత్రం నిన్ను మళ్ళీ పలకరించవచ్చు . నీవూ నీకే తెలియని ముద్ద రంగువై నీళ్లలోకి దుకావా ఆ కరుగుతున్న రూపాలతో కలిసి సహాయాణం చేయొచ్చు. పద్యంలోని పాదరసమై ప్రవహించొచ్చు.

Add comment