రాత్రయ్యిందని.. మనందరం హాయిగా నిదురించే వేళ వాళ్లకీ రాత్రే అయినా.. నిద్ర మాత్రం కనుచూపు మేరలో కానరాదు తెల్లారిందని.. మన పనుల్లో హడావిడి పడేవేళ తెల్లారిపోతున్న వారి బతుకుల్లో.. ఏ వెలుగూ ప్రసరించదు నిశ్శబ్దం అలవాటైన మనకు అలికిడో, ఆర్తనాదమో ఉలికిపాటు కలిగిస్తుంది నిరంతర రోదనాశ్రువుల మధ్య నిశ్శబ్దం వారిని భయపెడుతుంది బిడ్డలను కన్నందుకు తల్లులు దుఃఖిస్తారు -భయానక భవిష్యత్‌ను తలచుకుని మర్యాద తెలిసిన చెల్లెళ్ల మానాలు కాపాడే అన్నయ్యలు అప్పుడెప్పుడో అదృశ్యమైపోతారు వయసు మళ్లిన తండ్రులు దుఃఖం పూడుకుపోయిన గొంతులతో నిర్లిప్త ప్రేక్షకులుగా మిగిలిపోతారు భయం చేతనో, భద్రత కోసమో మనం వారిని విస్మరించామన్న ఊహ ఇప్పుడు వారినీ, నిరంతరం మననీ మానని గాయంలా సలపరిస్తూనే ఉంటుంది

Add comment