ఎగసిపడి ముంచేసిన అల
ఇప్పుడు వెళ్ళిపోయింది..
ఇందాకటిదాకా
కన్నుల్లో నిండలేని ఉప్పెన
ఇప్పుడు ఏ అంచునా లేదు..
అత్యంత భీకరమైన హోరు
గాలితో వెనక్కి పయనమైంది..
ఊపిరి బిగబట్టిన క్షణం
గతమై మరుగయ్యింది..
రెక్కలొచ్చిన తీరంలోంచి
జ్ఞాపకం విసిరేయబడింది..
ఒంటరి నేల ఒకటి
గుండెను తడుముకుంటుంది..
పీల్చి వదిలిన శ్వాస దేహం
నీటిపొరల కిందకు చేరుకుంటుంది..
నిలవలేకపోయిన జీవితంలో
నీ నిశ్శబ్దం సాక్షిగా
నాలోని నువ్విప్పుడు ఓ ఖాళీ..

బరువు దింపేసుకున్న హృదయం తీసుకున్న ఊపిరిలా ఉందీ కవిత.. నీ నిశ్శబ్దం సాక్షిగా నా లోన నువ్విపుడు ఓ ఖాళీ.. చాల బావుంది స్వేచ్ఛ
చాలా బాగుంది మేడం
Bavundi.