‘రస్తా’ రెండేండ్ల క్రితం (2017, మే లో) మాస పత్రికగా మొదలైంది, ఓ నెల తరువాత (జూన్ నుంచి) పక్ష పత్రికయ్యింది. అప్పట్నించి ఇప్పటి వరకు (నవంబర్ 1 వరకు) ప్రరి 15 రోజులకో సారి క్రమం తప్పకుండా నడిచింది. నిజం చెప్పొద్దూ, ఎమర్జెన్సీ తరువాత విమోచన పత్రిక సంపాదకత్వం మాదిరిగా ఈ పనిని ఎంజాయ్ చేశాను. థాంక్స్ టు అల్.
ఇంతవరకు బాగుంది గాని, ఇక నాకు పని ఎక్కువైంది. 🙂
ఇప్పుడు నేను కొత్తకొత్త పనులు పెట్టుకుంటున్నాను.
కొత్తకొత్త పనులు నేర్చుకుంటున్నాను.
మరింత తీరిక ఆవసరం అవుతున్నది.
అందుకని ఇప్పటికి ఒక నిర్ణయం తీసుకుంటున్నాం.
ఇక నుంచి ‘రస్తా’ మళ్లీ. మొదటి నెల లాగే, మాస పత్రిక అవుతుంది. నవంబర్ 16 సంచిక వుండదు.
నెల రోజుల లోగా ఏవేనా ‘స్టాప్ ప్రెస్’ సంగతులు వొస్తే మధ్యలో కూడా అప్లోడ్ చేస్తాం.
ఇక ‘రస్తా’ పక్ష పత్రిక కాదు. మాస పత్రిక.
ఇది తెర వెనక్కి పయనంలో మొదటి అడుగు కావొచ్చు.
లేదా రెట్టించిన వుద్దేశాలతో మరింత వేడిగా వీధుల్లోకి అడుగేయవచ్చ్ఉ. ముందస్తు రాజకీయ ప్రణాలికలతో పని చేయను. దాదాపు ప్రతి అదుగులో… స్పాంటేనిటీకి, తెరిచిన మనస్సుకు, ఆత్మవిమర్శకే మా వోటు.
ఓకే నా?! 🙂
Add comment