
మా పాపని రాత్రి పూట త్వరగా నిద్రపుచ్చేందుకు,నేను ఏవేవో
కథలు చెప్పేవాణ్ణి, ప్రతి రాత్రి మా చుట్టూ మాంత్రికుడో, రెక్కల గుర్రమో, ఎగురుతున్న చాప, నది మీద ఎగిరే నావ,మాట్లాడే పక్షులు,జంతువులు తిరుగుతూ ఉండేవి.ఒక రోజు కథ చెప్పే సమయంలో కథ అంతా నువ్వే చెప్పేస్తే ఎలా నన్ను కూడా ఊహించని అని గబుక్కున అన్నది.నిజమే కదా.గొప్ప కథ గా మిగలదానికి ఇది కూడా ఓ లక్షణమే కదా అనిపించింది.
కథకుడు,పాఠకుడికి ఏమి తెలియదు,ఉత్త అమాయకుడు ,అయ్యో పాపం
అంతా నేనే చెప్పాలి, అరటి పండు వలిచి నోట్లో పెట్టాలి అని అనుకోని రాయడం మూలంగా ఎన్నో కథలు చిరునామా లేకుండా పోయాయి. పాఠకుడిని పడేయడం మాములు సంగతి కాదు. ఆ రహస్యం నేర్పడానికి కోచింగ్ సెంటర్లు ఉండవు.అదో జీవిత కాలపు అభ్యసనం.కానీ కొంత మంది కథకులు ఆ రహస్యాన్ని మాలిమి చేసుకున్నారు.సహజం గా వచ్చే ఉంటుంది. వీళ్ళు కాస్త పదును పెట్టుకున్నారు.
అలాంటి రహస్యం తెలిసిన కవి,కథకుడు రాసిన కథ గురించి మాట్లాడుకుందాం.
ఈ భూమ్మీద పుట్టిన ప్రతి మనిషి ఎదో సాధించడానికి పుట్టి ఉంటాడు. కొందరు అది త్వరగా గ్రహించి చరిత్రలో నిలబడతారు.మార్గదర్శనం చేస్తారు.చాలా మంది ఏదో ఒకటి వెలగ బెట్టి ,మూడపూట్ల తిని
నిద్రపోయి, కొంత కాలానికి చనిపోతారు.
ఈ కథలో అజ్మత్ కి ఓ బలమైన లక్ష్యం ఉంది. తీవ్రమైన ఆశ ఉంది. భలే ఆశ. మజా ఐన ఆశ. అతని చిన్నప్పటి నుండి అతనితో పాటూ ఏపుగా ఎదిగిన ఆశ. చిత్ర విచిత్ర మైన ఆశ.
పెళ్లి ఐన కొత్తలో భార్యకు ఆ సంగతి చెప్పాడు. నాలుగో రోజే తన ఇంటి వెనకాల గదిలో దాచిన సామాన్లు,కట్టలు కట్టలు గా ఉంచిన కాగితాలు, తన ఆశను నిర్మించడానికి వ్రాసుకున్న సమాచారం, పనిముట్లు చూసి ఆమె ఆశ్చర్యం తో కూడిన భయానికి లోనైంది.
కొంపదీసి పిచ్చి కాదు కదా అనుకుంది.జీవితమంతా ఎలా అని అనుకుంది.
ఐతే ఆమె త్వరగా గ్రహించింది,అతనిలో ఆ ఒక్క కోరిక తప్ప మిగతా అంత భేషుగ్గా ఉందని, మితభాషి,నెమ్మదస్తుడు,తన పై అపారమైన ప్రేమ చూపుతున్నాడు,కేవలం ఆ ఒక్క వాంఛ
ఎటువంటి ఆరోపణలు లేవు.
ప్రతీ ఆదివారం లేదా సెలవురోజు అజ్మత్ తన కోరికను
నిర్మించుకోవడానికి,నిజం చేసుకోవడానికి పనిముట్లు ముందు వేసుకుంటాడు. చుట్టుపక్కల వాళ్ళు
అతన్ని చూసి ఆట పట్టిస్తుంటారు.
,,”ప్రపంచంలో వింత హైదరాబాద్ లో మీ రూపంలో ఉంది”అని నవ్వుతుంటారు.
తన ఇద్దరు పిల్లలు అజ్మత్ చేసే పని పట్ల ఉత్సాహంగా ఉంటారు.రెండు వారాల క్రితం అంతా సిద్ధం అనుకునే లోపు కొడుకు దాన్ని చూడకుండా తొక్కేశాడు.
పిల్లలు సెలవు వచ్చినప్పుడల్లా
“నాన్నా ఈ వేళ పూర్తి అవుతుందా”అని అడుగుతుంటారు.
అజ్మత్ చిరునవ్వుతో జవాబు ఇస్తాడు.
ఈ కథలో కథకుడు వర్ణననల జోలికి వెళ్ళడు.నిరాలంకారంగా మాటలు వెళ్లిపోతుంటాయ్.కానీ
ఆ మాటల్లోనే మనకు చూపు నిలబడుతుంది. అన్నీ కనిపిస్తుంటాయి.అజ్మత్,అతని భార్య ఇద్దరు పిల్లలు
కనిపిస్తూ,వినిపిస్తుంటారు.
ఇంతకీ అజ్మత్ కోరిక ఏంటి? మనిషి పట్టేంత కాగితపు పడవను తయారు చేసి,వర్షపు నీటిలో ప్రయాణించడం. అంతే కాదు రాత్రిళ్ళు తన భార్యకు గంటల కొద్దీ కాగితపు పడవ తయారు చేసి,దానిలో
సముద్రాల పై ప్రపంచాన్ని చుట్టి రావాలనుకోవడం గురించి చెప్పేవాడు.
అజ్మత్ కోరిక అందరికి గొప్ప వింత గా అనిపించినా తన పిల్లలు మాత్రం
గట్టిగా నమ్మేవారు.
ఆ రోజు సెలవు దినం కావడంతో అజ్మత్ పనిలో దిగాడు.
ఈ వేళ తప్పకుండా అవుతుంది అని ఆరేళ్ళ కూతురు ప్రకటించింది.
ఆ అమ్మాయ్ నాకు నేర్పవా నాన్నా అంటే అజ్మత్ ఒక మాట చెబుతాడు.
“ఎలా పనిచేస్తున్నానో చూడు.దానంతట అదే నీకు వస్తుంది” అని
ఏ వృత్తి ఐనా సహజంగా పరిశీలన ద్వారా వస్తుంది. అజ్మత్ తండ్రి కూడా కాగితపు పడవ తయారు చేసి
ఓ వర్షపు పండగ నాడు పందెం లో గెల్చినట్టు ,తన ఊర్లో ఇలాంటి పడవలు తయారు చేసే వాళ్ళు ఉండే వాళ్ళని, వాళ్ళు అంతా వృద్దులు ఐపోయారని, ఇప్పుడు అటువంటి వాళ్ళు ఉన్నారో లేదో తెలియదని
అజ్మత్ చెప్పేవాడు.
ఇంకా అతను చెప్పిన గొప్ప రహస్యం ఏంటి అంటే ఈ పడవల తయారీ భార్యలే నేర్పాలి. మా నాన్నకు అమ్మ నేర్పింది.అది ఆచారం.భార్యలు ,భర్తలకు నేర్పుతారు. ఆ కుటుంబం లో అమ్మాయి పుడితే తన భర్తకు నేర్పాలి . అని చెప్పేవాడు.
ఆ సెలవు దినం ఉదయం నుండి అతను నిమగ్నమయ్యాడు. పిల్లలు ఎదురుచూస్తు ఉన్నారు.అనేక విఫల యత్నాల తర్వాత, చాలా లోపాలు సరి చేసుకున్నాడు.
ఆకాశంలో మేఘాలు నల్లగా అలుముకున్నాయి.ఇదే సరైన దినం అనుకున్నాడు.విడికాగితపు భాగాలను ,బిగించాడు.మేకులు కొట్టాడు. నలభై ఐదు నిమిషాల్లో పడవ అమర్చాడు. తప్పులు ఉన్నాయేమో చూసుకున్నాడు. సన్నగా వాన.అజ్మత్ భార్య,పిల్లలు ముఖాలు వికసించాయ్.
“నాన్నా ఇప్పుడు వెళ్ల వచ్చా”అజ్మత్ కూతురి ప్రశ్న
వర్షం పెద్దది కావాలన్నాడు.
వర్షం కురుస్తూ ఉంది. వీధుల్లోకి నీళ్లు చేరుతుకున్నాయి.
ఇంకా రావాలి అన్నాడు.మళ్ళీ చూసుకున్నాడు.
ఎదురింట్లో చంద్రం అడిగాడు.ఈ వేళ నీ ప్రయాణం చూడగలమా అని
మా పడవ పూర్తి అయందని అజ్మత్ కూతురు పెద్ద కేక వేసింది.చుట్టుపక్కల వాళ్ళు ఆసక్తి గా చూస్తున్నారు.
అజ్మత్ సిద్ధమయ్యాడు. పడవ తీశాడు. పడవలో కూర్చున్నాడు.
భార్య పిల్లలు పడవను ముందుకు తోసారు. నీటిలో పడవ కదులుతోంది. వెనకా ముందు పిల్లలు కేరింతలు కొడుతున్నారు. వీధిలో వర్షపు పండగ. అజ్మత్ చేయి ఊపుతూ ఉన్నాడు. ఉన్నట్టుండి పడవ ఓరిగిపోయింది. అజ్మత్ నీళ్ళలో పడ్డాడు. వీధి నిశ్శబ్దం అయింది.
ఏమైంది నాన్న అని పిల్లలు అడిగినా నవ్వుతూ తల అడ్డంగా ఊపాడు.
ఆ రాత్రి అతనికి తీవ్రమైన జ్వరం.పొద్దుటికీ కాస్త కుదుట పడ్డాడు.
కానీ అతను మళ్ళీ మొదలు పెట్టాడు. గదిలో ఉన్న పుస్తకాలు తెమ్మన్నాడు.
పనిముట్లు చెట్టుకింద చేర్చమన్నాడు.
చెట్టుకిందకు చేరాడు.
“ఆ వీధి వెంట వెళ్లే ప్రజలు అలవాటైన కళ్ళతో చూస్తూండగా,సన్నగా,తనలో తాను వేసుకున్న లెక్కలను గోనుకుంటూ, నిశ్శబ్దపు పాటను,నిశ్శబ్దంలో పాడుతున్న వాడి లాగా కనిపించాడు.
ఏంటి ఈ నిశ్శబ్దపు పాట.
కథకుడు ఈ కథలో గోడలు కట్టుకుని,తాళం వేసుకుని కూర్చోడు.
కొన్ని తాళాలు, తలుపులు తెరిచేవి మనకు ఈ కథలో కొన్ని చోట్ల ఇచ్చాడు.
ఆ కీస్ మనం పట్టుకోవాలి.
కాగితపు పడవ దేనికి ప్రతీక.
వాన నీటిలో కాగితపు పడవ ప్రయాణం ఏంటి.
అని మనకు అనిపిస్తుంది. జీవితంలో ఇక్కట్లు ఉంటాయి. అటువంటి ఇక్కట్లను దాటడానికి
ఈ కాగితపు పడవలు లాంటి భరోసా కావాలి . ఈ పడవ నిన్ను తీరానికి చేర్చక పోవచ్చు.
కానీ ఆ ఊహ ఎంత బతికిస్తుంది.
కథకుడు ఉద్దేశ్యం ఏంటో మనం అంచనా వేయలేకపోవొచ్చు. నిజమైన రచయత మనల్ని ఆనందింపచేసే
పని పెట్టుకోడు. ఆలోచింప చేస్తాడు.
ఈ కథలో పడవలు తయారీ తల్లులు నేర్పడం మాతృస్వామ్య వ్యవస్తకు మూలం కావొచ్చు.
ఇంకా కాగితపు పడవ సాహిత్యానికి ప్రతీక కూడా కావొచ్చు.
ఈ కాగితపు పడవ తయారీ ఓ వృత్తి కార్మికుడి కొనసాగింపు కావొచ్చు.
ఏది ఏమైనా కథ చదువుతున్నంత సేపు ఒక మహిమ వెంటాడుతుంది.
ఈ నిశ్శబ్దపుపాట అజ్మత్ వింటున్నాడు. మిగిలిన వారికి అది వినిపించదు.
అలాంటి కొనసాగింపు,కోరిక ఉన్నవారికి వినిపిస్తుంది.
అతని పిల్లలు విన్నారు.
ఇది 2002 నవంబర్ 17
ఆంద్రజ్యోతిలో వచ్చిన కథ
కె.శ్రీకాంత్ రాశారు. ఇతర ఏ భాషల్లోనూ ఇలాంటి కథ రాకపోయి ఉండవచ్చు.
అదిగో వాన ప్రారంభం అయింది.
అజ్మత్ పడవ తీశాడు.
Chala Baga raseru ma duradustam ameti antte appudo 2002 lo rasena 2019 lo vinnamu danike maku antho sothosham edi pampina ma kalasala Telugu guruvu garu ki thanks
Ajmat aasani meeru marinta majaaga chepparu Saar
Dhanyavadamulu
మంచి కథను పరిచయం చేసిన మీకు ధన్యవాదాలు
తమాషాగా మొదలై తాత్వికంగా ఆగింది….వెంటాడుతూ ఉంటుంది అండీ…
Super sir
నేను కథ చదవలేదు. కథ చదివితే ఎలా alochinchalo నేర్పాడు. కథ ఎలా అర్థం చేసుకో వాలో, కథకుడి ని ఎలా అనుసరించాలి. అని నేర్పాడు.. నేను చదివే ప్రతి కథ ను నీవు నేర్పిన విధం లో చదువుతాను గురువుగారు