1 మీరు చిన్న పెద్ద పుస్తకాలు చదువుతుంటారు. అది కొత్త గెటప్ లో ఎక్కాల పుస్తకమైనా కావొచ్చు. కొత్త రకం తెలుగు నిఘంటువు కావొచ్చు. కథలో, కవితలో కూడా కావొచ్చు. అది మీకు బాగుంటుంది, కోప్పడాలనిపిస్తుంది. మీరు రెగ్యులర్ రచయిత కాకపోవచ్చు. సమగ్రమైన రివ్యూ రాసే తీరిక, ఓపిక మీకు వుండకపోవచ్చు. ఒకటి లేదా రెండు ఆలోచన తుంపులను పక్కవాళ్ళకి చెప్పాలనిపించవచ్చు. వాటిని అలాగే ‘లెటర్స్ టు ది ఎడిటర్’లాగా సంక్షిప్తంగా రాసి మాకు పంపండి, ఏమాత్రం పాయింటు వుందనుకున్నా, కాస్త సంస్కరించి అయినా, ప్రచురిస్తాం.
- బుక్ రివ్యూలే కాదు. మీరేదో వార్తా పత్రిక చదుతుంటారు. లేదా ఏదో జీవన సమస్యను ఎదుర్కొంటూ వుంటారు. ప్రింట్ పత్రికల్లో ‘లెటర్స్ టు ది ఎడిటర్’ లాగే రాసి పంపండి. ఇక్కడ ఒక అదనపు జాగ్రత్త అవసరం. మీరేం చెబుతున్నారో ఆ పత్రిక(లు) చదవని వాళ్ళకు కూడా అర్థమయ్యేలా, ఆ వార్త లేదా ఆ ఇస్యూ ను సంక్షిప్తంగా పరిచయం చేయాలి. ఎందుకంటే ఆ సమస్య లేదా వార్త దేశానికి దూరంగా వున్న మాకు తెలిసినది కాకపోవచ్చు.
- పై రెండు సందర్భాల్లోనూ, అయ్యో నా భాష బాగోదే అని సందేహించకుండా రాయండి. మా వైపు నుంచి ఓ చెయ్ వేస్తాం, వార్తా పత్రికల్లో కబ్ రిపోర్టర్ల కాగితాలకు డెస్కు వాళ్లు మెరుగులు దిద్దినట్లు. ఓకే?!
- ఈ రకం రచనలకు మీ మెయిల్ ‘సబ్జెక్ట్’ వద్ద లెటర్స్ టు ది ఎడిటర్ అని రాసి, rastha.hrk@gmail.com అనే ఐడీ కి మెయిల్ చేయండి.
తెలుగులో రాసి ఉంటే పిడిఎఫ్ ఫార్మాట్ లో పంపించాలా?.
లేదండీ యునికోడ్ లోనే టైపు చేయాలి. ఉదాహరణకు, మీ జిమెయిల్ అక్కౌంటులో తెలుగు టైపింగ్ సౌకర్యం వుంటుంది. అక్కడ మాకు తెలుగులో మెయిల్ రాసి పంపినా సరే, అది కూడా యునికోడే అవుతుంది.
రచనలు చేసేవారి వివరాలు తప్పనిసరిగా తెలియచేయాలా? రచన ప్రధానం కావలి కాని వారి వివరాలు ఎందుకు ? వారు వ్రాసిన పుస్తకాలు, వారి గతం, వర్తమానం అవసరమా ? ఈ వివరాలు తెలియచేస్తేనే రచనలు ప్రచురిస్తారా? ఇవి నా సందేహాలు కాస్తా వివరంగా తెలియచేయండి.
లేదండీ, లేఖలకు లేఖా రచయితల వివరాలు ఏమీ అవసరం లేదు. వారి ఇ మెయిల్ ఐడి చాలు.
లేఖలకే కాదు, ‘రస్తా’ లో ఏ రచనకైనా ఇది వర్తిస్తుంది. లేఖలు కాని ఇతర రచనలకు రచయితల ఫోటో, వివరాలు ఆ రచన్లకు ఒక రకమైన ఆత్మీయతను చేర్చుతాయి. అవన్నీ వొద్దు అనుకుంటే, వొద్దు అనే విషయం తెలియజేస్తూ, రచయిత సరైన మెయిల్ ఐడీ ఇస్తే చాలు.
సర్, మీ ప్రశ్నలు ఒక అవసర వివరం ఇవ్వడానికి తోడ్పడ్డాయి. కృతజ్ఞతలు.
నా అనుమానం తీరింది. మీ సమాధానానికి ధన్యవాదాలు.