నాకో కల వచ్చింది ఒక తెల్ల పావురం నారింజ రంగులో మునకేసింది నల్లమలలో వానరం అడ్డం బొట్లు పెట్టుకుంది శేషాచలం కొండల్లో భల్లూకం నిలువు బొట్లు పెట్టుకుంది గేదెలన్నీ జన్యుమార్పిడితో ఆవులౌతున్నాయి ఇళ్లకింద ఏముందేమోనని తవ్వకాలు ప్రారంభించిన పురావస్తు శాఖ సుప్రీమ్ కోర్టులో పిటిషన్ ఇళ్లెవరివి అని వలస వచ్చిన కొంగలు రంగు మార్చుకునేందుకు తహతహ మూలవాసీలే పరాయోళ్ల చేత పాలించబడుతూ బతుకులీడుస్తున్న దేశంలో ఈ కల ఈడేరక పోతే బావుణ్ణు ఏదో అలికిడి లేచా పగటి కలేలే తెల్లవారుఝాము కల కాదుగా ఉరిమితే మూలవాసిదే జయం

Super