1. అదరూ దయచేసి యునికోడ్ లో టైప్ చేసిన రచనలనే పంపించండి. మీ రచన అచ్చుతప్పులు మీరే మరో సారి చూసుకోండి. మీ రచనకు బాగుంటాయని మీకనిపించే పిక్చర్లు, ఫోటోలు ఏవైనా వుంటే పంపండి.
2. ఫేస్ బుక్ తో సహా ఎక్కడా ప్రచురితం కాని రచనలనే ‘రస్తా’కు పంపించండి. ప్రత్యేక పరిస్టితులలో ఎక్కడో అచ్చయినవి పంపిస్తున్నట్లయితే, ఆ సంగతి రచన పంపిసున్నప్పుడే తెలియజేయండి.
3. ‘రస్తా’లో ప్రచురితమయిన రచనలను 15 రోజుల లోపల ఎక్కడా తిరిగి ప్రచురించవద్దు. రచయితలు తమ ఫేస్ బుక్ పేజీ లో కూడా ప్రచురించవద్దు. రస్తా లోని రచనను, దాని లింక్ ఇస్తూ రచయితలు, ఇతర్లు ఎవరైనా షేర్ చెయ్యొచ్చు. అలా చేసే వారికి ప్రత్యేక కృతజ్ఞతలు కూడా.
2. మొదటి సారి మీ రచన పంపిస్తున్నట్లయితే, లేదా అంతకు ముందు పంపకపోయి వుంటే రచనతో పాటు మీ బయోడేటా, మీ చిన్న ఫోటో పంపండి. బయో అనగా మీరు ఏ పుస్తకాలు చదివారు ఎలాంటి ఆశయాలు, అభిరుచులు కలిగి వున్నారని కాదు. ఎక్కడ పుట్టి పెరిగారు, ఎక్కడ వుంటున్నారు, ఏమేమి చేస్తున్నారు, ఏమేమి ప్రచురించారు అనే వివరాలు.
3. ’15 తారీఖు సంచిక కోసం ఆ నెల 10 తేదీ లోగా, ఒకటో తారీఖు సంచిక కోసం అంతకు ముందు నెల 25 లోగా మీ రచనలు పంపండి.
4. రచనల్లో గాని, కామెంట్లలో గాని… అబ్యూజివ్ పదాలు వొద్దు. వాటికి సాహిత్య ఔచిత్యం వుందనిపిస్తే తప్ప. అలాంటి ఔచిత్యం వున్నదీ లేనిదీ.. అంతిమ నిర్ణయం ‘రస్తా’ సంపాదకులదే. వాదోపవాదాలకు తావూ లేదు, టైమూ లేదు.
5. ‘రస్తా’ మెరుగుదల కోసం మీరు చేసే ప్రతి సూచనకూ వినమ్రమైన ఆహ్వానాలు.
6. మీ రచనలు పంపడానికి మా ఐడి: <rastha.hrk@gmail.com>
హెచ్చార్కె తో మాట్లాడాలంటే… అమెరికా నంబరు 6096472863.
Add comment