పొద్దున్నే ఇంటి కోడి కూసింది దుప్పటి తన్ని లేచా దూడ అంబా అని అరచింది ఆ అరుపులో ఆకలి వినబడింది చెంబు పట్టుకుని పాలు పితికి దూడ ని వదిలా కోళ్ళగూటిలో పెట్ట పొదుగుతుంది తన గుడ్లని తన సంతతి కోసం ఇందులో ఖర్చేమీ లేదు దినచర్యలో భాగం మా ఇంటిపై ఒకడి కన్ను పడింది వాడు తినని కోళ్ళ కాళ్ళు మా ఇంటిపై వెదజల్ల ఆకాశయానం వాడింట ఎక్కువైన పాలు మాయింట జబర్దస్త్ గా పోసే దుస్సాహసం వాడు దేన్నైనా అమ్ముతాడు వద్దంటే ఆంక్షలూ యుద్దాలూ వాడికి ఎర్రతివాచి పరుస్తూ మా బతుకుల చుట్టూ ఎతైన గోడలు మాకూ చేతనౌను ఆకాశయానం సంఘటితమయ్యే కాకులే ఆదర్శం మా అరుపులు మా సంపద కోసం మా రాజ్యం కోసం

Add comment