కరోనా ఓ కరోనా చైనాలో పుట్టి దేశదేశాలకు విస్తరించినా వ్యత్యాసం కానరాలేదు ఎచ్చోటనైనా ఒకే క్షృష్టి నీది ఎవరూ చూడలేని కోణమది రాజైనా మంత్రైనా బంటైనా అందరికీ సమన్యాయం చేస్తున్నావే కరోనా ! అభివృద్ది చెందినా చెందుతున్న ఏ దేశానికైనా నీవొక ఖండాంతర క్షిపణివి నిన్నో తురుపు ముక్కనుకుంటే ముక్కోపాన్నే ప్రదర్శిస్తున్నావ్ ! దేశాన్ని దాటినోడి చేతులు మెలిపెట్టి వెనక్కొచ్చే దాకా వదలని కరోనా చివరికి అక్కున చేర్చుకునేది నీ నేలేనని నిగ్గు తేల్చిన కరోనా చాతుర్వర్ణ వ్యవస్థ తలకిందులై పప్పులుడకని తలకెక్కిన పొగరుని దించుతున్న కరోనా ! ఖడ్గం అక్షరం తరాజు దేన్నీ వదలక ఉరికిస్తున్నావే తరాలుగా వెలికి గురయ్ నడుముకి చీపురు మూతికి ముంత లే ఎరిగిన వాడలు ఇలాగే ఎవరూ మా దరికి రావొద్దంటున్నాయి రెక్కాడితే గాని డొక్కాడని మా బతుకుల్లోకి నిన్ను తెచ్చే ఎవడినైనా వాడిని పాతరేస్తామని అంబేద్కరిజం గుత్పనందుకుంటున్నై కరోనా ఇందుకు నీకు రుణపడి ఉంటాం ఇక శాంతించి వెళ్ళిపో మా మధ్య సామాజిక దూరంఎన్నాళ్ళనుండో తెలియక వచ్చావనుకుంటా! వెళ్ళిపో !!!

Add comment