Name: అడోనిస్‍

Alternative Text

(లెబనాన్ (జననం 1930) అసలు పేరు అలీ అహ్మద్ సయీద్. సిరియాలో పుట్టారు. అక్కడే చదువు. యువ రచయితగానే ‘అడోనిస్’ అనే కలం పేరుతో రాశారు. తన రాజకీయ అభిప్రాయాలకు గాను 1956 లో వేధింపులకు గురయ్యారు, చెర వాసం రుచి చూశారు. తరువాత బీరూట్ కు మారి నాలుగేళ్లయ్యాక లెబనీస్ పౌరసత్వం తీసుకున్నారు. 1958 లో ‘మవాఖిఫ్’ అనే పత్రికను స్థాపించి అరబిక్ సాహిత్య సంప్రదాయాన్ని పునరుద్ధరించాలని వుద్యమించారు. అరబిక్ ప్రపంచలో ‘అడోనిస్’ చాల ప్రభావం నెరపుతున్న కవీ, విమర్శకుడు....) (అడోనిస్ దీర్ఘ కవిత ‘ఎలిజీ ఫార్ ది టైమ్‍ అట్ హ్యాండ్’ ను ‘వర్తమానం కోసం ఒక స్మృతి గీతం’ పేరుతో అనువదించి, చాల కాలం క్రితం ‘ప్రాణ హిత’ అనే వెబ్ పత్రికలో, తరువాత నా ఇటీవలి కవితా సంపుటి ‘ఆకుపచ్చ వెన్నెల’లో ప్రచురించాను- హెచ్చార్కె).

‘అడోనిస్’ పద్యాలు మూడు

దారి   మంచుతో, అగ్నితో జీవితం పంచుకోవాలనుకున్నాన్నేను. మంచు అగ్ని రెండూ తమ లోనికి తీసుకోలేదు నన్ను. అందుకే ఇలా వుండిపోయాను, పువ్వుల్లాగ ఎదురు చూస్తూ, శిలల వలె పడి వుంటూ. ప్రేమలో నన్ను నే పోగొట్టుకున్నాను. నేను విడిపోయి నేను కల గన్న జీవితానికీ...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.