Name: బాలాజి (కోల్ కతా)

Alternative Text

ఐకా బాలాజీ: చేరాత పత్రికగా మొదలై ఇప్పుడు త్రైమాసికగా నడుస్తున్న ‘ముందడుగు’ పత్రిక సంస్థాపక సంపాదకులు. సాహిత్యం సినిమా విమర్శలు రాస్తుంటారు. ‘ముందడుగు' తరుఫున టెలిస్కోపు ప్రదర్శనలు, సైన్సు ప్రదర్శనలు, సినిమా పాఠాలు, లఘు సినిమాలు, డాక్యుమెంటరీలు, ఉత్తమ చలన చిత్రాల ప్రదర్శనలు నిర్వహిస్తుంటారు. ప్రపంచ సినిమా మీద అధికారం కలిగిన ప్రగతి శీల విమర్శకులు. ప్రస్తుతం కోల్ కతాలో నివసిస్తున్నారు. పంజాబ్ నేషనల్ బ్యాంక్ సింగిల్ విండో ఆపరేటర్ గా పని చేస్తున్నారు. మొబైల్: 9007755403

‘ఇంటా – బయటా’ నాడూ, నేడూ!

రవీంద్రనాథ్ టాగోర్ నవల “ఘోరే బాయిరే’’ (ఇంటా, బయటా) 1916 లో ప్రచురితమైంది. ఈ నవల ప్రచురణకు కొన్ని సంవత్సరాల ముందు నుండే జాతీయత, దేశభక్తి గురించి ఆయన మనోభావాలు, ఆదర్శాలు సంఘర్షణ పడుతున్నాయి. దానికి ప్రత్యక్ష నిదర్శనం 1908 లో ఆయన ఒక స్నేహితుడికి...

ఒక తమిళ ‘జోకర్’ కథ

కొన్నిరోజుల క్రితం ఒక మిట్ట మధ్యాహ్నం కోల్ కతా బ్యారక్ పూర్ స్టేషన్ బయట ఒక ముసలాయన తనొక్కడే ఒక చేత కొన్ని కరపత్రాలు, మరో చేత హ్యాండ్ మైక్ పట్టుకుని కాశ్మీర్ సమస్య గురించి ఎదో వివరిస్తున్నాడు. జనాలెవరూ పట్టించుకోవడం లేదు. ఉండుండి ఇద్దరో ముగ్గురో...

అణుదౌష్ట్యానికి సజీవ ఖండన
‘సిల్క్‌వుడ్’ బయోపిక్ (1983)

సినిమాల్లో బయోపిక్కుల హోరు సాగుతోందిప్పుడు. ఆయన చాయ్ అమ్మాడనీ, గుజరాత్ అల్లర్లు చూసి నిజంగానే తల్లడిల్లాడనీ సినిమా వచ్చింది. సినిమా అయితే హిట్టు కాలేదు గానీ రెండోసారి కూడా అయన సిక్సర్ కొట్టాడు. సిక్సర్ అంటే గుర్తొచ్చింది. మన దర్శకులు సచిన్, ధోనీల...

రానున్న ఫాసిజం ముందస్తు
హెచ్చరిక: ‘రామ్ కే నామ్’

ఆగస్ట్ 20, 2019. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ సోషియాలజీ విభాగంలో ‘రామ్ కే నామ్’ (రాముని పేర) డాక్యుమెంటరీ ప్రదర్శన జరుగుతోంది. పోలీసులు దూసుకొచ్చారు. పర్మిషన్ లేకుండా వేస్తున్నారంటూ ఆరుగురిని అదుపులోకి(!) తీసుకున్నారు. పర్మిషన్ తీసుకున్నామని...

వెలుగు కోసం ఆరాటం!

ప్రజల అభిమతం మేరకు ఎంపికైన చిలీ దేశపు మొట్టమొదటి మార్క్సిస్ట్ అధ్యక్షుడు సాల్వడోర్ అల్లెండే. 1970 లో పాపులర్ యూనిటీ అనే ప్రజాస్వామ్య కూటమి తరుపు అధినేత అయ్యాడు. కానీ, అపారమైన సహజ వనరులున్న చిలీలో అమెరికా కార్పొరేట్లకు  స్వప్రయోజనాలున్నాయి. అల్లెండే...

బ్రాహ్మణవాద ద్వంద్వనీతిని ఎండగట్టిన “సంస్కార”(1970)

(గిరీష్ కర్నాడ్ స్మృతిలో….) పరిచయం అక్కర్లేని పేరు గిరీష్ కర్నాడ్. దీర్ఘ అనారోగ్యం తర్వాత గత నెల 10 వ తేదిన నిద్రలోనే నిష్క్రమించాడాయన. నాటకసినీరంగాల్లో రచయితగా, నటుడిగా, దర్శకుడిగా సుపరిచితుడు. యయాతి, తుగ్లక్, హయవాదన వంటి అతని నాటకాలు...

అమర ప్రేమకు చివరి పరీక్ష ‘అమోర్’

అది పారిస్ లోని ఒక ఎగువ మధ్యతరగతి అపార్ట్మెంట్ భవనం. ఒక అపార్ట్మెంట్ నుండి అసహజ దుర్వాసన వస్తోందన్న ఫిర్యాదు మేరకు అగ్నిమాపక సిబ్బందితో పోలీసులు కలిసి వచ్చి తలుపులు విరగ్గొట్టి సోదా చేస్తారు. పడక గది మంచం మీద  పువ్వులతో అందంగా అలంకరించిన ముసలావిడ...

తండ్రుల జాడకై పిల్లల అన్వేషణ: కాశ్మీర్

కాశ్మీరీ సామాన్యుడి జీవితాన్ని కన్నెత్తైనా చూడకుండా, కాశ్మీర్‌ సమస్యపై జాతీయ అవార్డు స్థాయి సినిమా ఎలా తీయవచ్చో నిరూపించాడొక దర్శకరత్నం. అందులో అగ్నిగుండం లాంటి సమస్యను ‘రోజా’ పువ్వంత సుకుమారంగా హ్యాండిల్‌ చేశాడు. సినిమాలోని ఆ రోజాకు టీ ఆఫర్‌ చేసే...

భిన్నమైన అత్తా కోడళ్ళ కథ
‘ముఖర్జీ గారి భార్య’

కొద్ది రోజుల క్రితం సోషల్ మీడియాలో ఒక వీడియో కన్పించింది. ‘పెద్దయాక నువ్వేం చేస్తావ్?’ అని నాలుగేళ్ళ పాపను అడిగితే ‘పెద్దయితే పెళ్లి చేసుకుని అత్తను చంపేస్తా’ అని తడుముకోకుండా సమాధానమిస్తుంది ఆ పాప ఆ విడియోలో. చిన్న పిల్లలపై కూడా టీవీ సీరియళ్ళ...

ఎన్నికల ‘యుద్ధం’ ‘వ్యాగ్ ది డాగ్’ (1997)

దేశాధినేత ఐదేళ్ళు ఏలాడు. మళ్ళీ ఎన్నికలొచ్చాయి. రెండోసారి కూడా పోటీచేస్తున్నాడు. గెలవాలని ఉబలాట పడుతున్నాడు. టీవీలో ప్రచారాల జోరు ఇలా సాగుతోంది. గుర్రప్పందెంలో గెలిచిన అతడితో ఆమె: ఈ రోజు రేసు చాలా బాగా గెలిచావు. ఫైనల్స్‌లో కూడా ఈ గుర్రమేగా...

మధ్య తరగతి శల్యపరీక్ష ‘ఏక్‌ దిన్‌ ప్రతిదిన్‌’

‘ఏక్‌ దిన్‌’ అంటే ‘ఒకరోజు’, ‘ప్రతిదిన్‌’ అంటే ‘ప్రతిరోజు’. మొన్న, నిన్న, నేడు, రేపు, ఎల్లుండి విడివిడిగా అన్నీ ‘ఒకరోజు’లే. కలిపి చెబితే ‘ప్రతిరోజు’. ‘ప్రతిరోజు’లోని ‘ఒకానొక రోజు’కి ప్రత్యేకత వుంటే ఉండొచ్చు గాక, అయితే ఆ ‘ఒకరోజు’కి రోజుల ప్రవాహాన్ని...

కుల వివక్ష మీద బలమైన బాణం

2018 మార్చి. గుజరాత్ లోని తింబి గ్రామంలో ప్రదీప్ రాథోడ్ అనే ఇరవై ఒక్క ఏళ్ల దళిత యువకుడ్ని అగ్రకులస్తులు ఘోరంగా హత్య చేశారు. గుర్రాన్ని పెంచుకోవడం అతడు చేసిన నేరం. 2018 ఏప్రిల్. రాజస్థాన్ భిల్వారా జిల్లాలో దళితుల పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు గుర్రం...

వెండి తెర మీద “స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్”

పదేళ్ళ క్రితం 14 వ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ కిమ్ కి దుక్ అనే అసామాన్య దక్షిణ కొరియా దర్శకుడిని పరిచయం చేసింది. ‘ఆవిష్కరణ’ విభాగంలో చూపిన ఆయన తాజా సినిమాలను సినీ వీక్షకులు పసందైన విందులా ఆస్వాదించారు. స్లోగా సాగుతూనే మనసులో నిలిచేలా, సైలెంటుగా...

గుండెను పిండేసే చిత్రం ‘హార్ట్ అఫ్ ది సన్’

  మాతృత్వం ఒక తియ్యటి కల. తన శరీరం లోంచి మరో చిన్ని శరీరానికి జన్మనిచ్చి, ఆ నవజాత కళ్ళల్లో మెరుపు చూసి కళ్ళు చెమ్మగిల్లే మాతృమూర్తి అనుభూతి వర్ణనాతీతం. అటువంటిది తనకిక సంతాన యోగమే లేదనీ, అది కూడా తన శారీరక లోపం వల్ల కాదనీ, తనకు తెలీకుండా తన...

రెక్కలు తెగిన హృదయ ఘోషకు సినీసాక్ష్యం ‘మంటో

“నేను నా దేశంతో పాటే తెగ్గొట్టబడినాక స్వతంత్రుడనయ్యాను…. (అటువంటి స్వాతంత్ర్యానికి అర్థం ఏముందీ?) … రెక్కలు తెగిన పక్షి స్వేచ్చను మీరర్థం చేసుకోగలరా?” సినిమాలో సాదత్ హసన్ మంటో అన్న ఈ ఒక్క మాట ఆ భగ్న హృదయుడి హృదయక్షోభను, గుండె ఘోషను మన...

నేటి భారతంలో ముస్లింల కష్టం: ‘ముల్క్’

ముల్క్ అంటే దేశం, ముల్క్ కీ మజహబ్ (మతం) కీ మధ్య ఎంచుకోవాల్సి వచ్చినపుడు ముల్క్ నే ఎంచుకున్నారు భారతదేశపు అసంఖ్యాక ముస్లింలు దేశవిభజన సమయంలో. అదే వారు చేసిన తప్పిదమా అన్నట్టు పరిస్థితులు కన్పిస్తుంటాయి గొడవలు జరిగే ప్రతిసారీ. నేటి పరిస్థితిలోనైతే...

బానిస బ్రతుకుల వ్యధార్థ చిత్రం “అమిస్టాడ్”

“స్వేచ్ఛ ఒకరిచ్చేది కాదు, వేరొకరు తీసుకునేది కాదు, కానీ కొన్ని సందర్భాల్లో దాన్ని బలవంతంగా గుంజుకోవలసివస్తుంది.”“అమిస్టాడ్” చిత్రం పోస్టర్లోని కాప్షనది. ఈ చిత్రానికి దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్. స్పిల్ బర్గ్ పేరెత్తగానే...

ఫుట్ బాల్ సీజన్లో గుర్తొచ్చే సినిమాలు

  “ఫుట్ బాల్ ఆట తుపాకుల మోతలేని యుద్ధం” అన్నాడు జార్జి ఆర్వెల్. ఎరిక్ ఆర్థర్ బ్లెయిర్ ప్రకారం “అంతర్జాతీయ ఫుట్ బాల్ అన్నది యుద్ధాన్ని మరో పద్ధతిలో కొనసాగించడమే.” నేడు ఫిఫా ప్రపంచ కప్ పోటీలు జరుగుతున్నాయి. వేసవి వేడికి తోడు సాకర్ తాపంతో భూమి...

మార్క్సిస్ట్ సినిమా: ఐజెన్ స్టీన్ ప్రయోగాలు

రష్యా విప్లవ శతజయంతి ఉత్సవాలు ఏడాది క్రితమే ముగిశాయి. ఈ సంవత్సరం కార్ల్ మార్క్సు ద్విశత జయంతి. ఈ రెండు సందర్భాలను సినిమాకు అన్వయించుకుంటే, వెంటనే గుర్తొచ్చే పేరు ఐజెన్ స్టీన్. సినీ నిర్మాణంలో మార్క్సు పద్ధతిని ప్రయోగించిన దిట్ట ఆయన. మార్క్సు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.