తనలో ఆకలి ఆవురావురు మంటూంటే, ఆబగా ఎసరు కాగుతూంటే, గడబిడగా నీళ్లలోని బియ్యం గింజలను, తన కుడి అర చేతితో పిసుకుతూంటే, ఛటుక్కున ఆ చెయ్యి జివ్వుమనగా, గబగబా ఆ కడుగు నీళ్లు ఎరుపెక్కగా, గమ్మున లాగి ఆ చేతిని చూడగా, అక్కడ గాయం, ఆ చెంతనే కొనతేరిన బొడిగె రాయి...
Name: బివిడి ప్రసాద రావు

బి వి డి ప్రసాద రావు: పూర్తి పేరు బత్తుల వెంకట దుర్గా ప్రసాదరావు. నివాసం తొలుత - పార్వతీపురం, విజయనగరం జిల్లా. ప్రస్తుతం - హైదరాబాద్. వివిధ ప్రక్రియల్లో రాస్తుంటారు. మొత్తం రచనలు 538, వివిధ ప్రింట్, ఎలక్ట్రానిక్ మీడియాల్లో ప్రచురణ అయ్యాయి. రచయిత తెలుగు బ్లాగు: https://bvdprasadarao-pvp.blogspot.in