క్రీడాభిరామ కర్తృత్వ విషయంలో పలువురు పలు అభిప్రాయాలను వ్యక్తం చేశారు. క్రీడాభిరామ కావ్యాన్ని శ్రీనాథుని ప్రభావానికి లోనైన వల్లభాయుడే రచించాడని, అందుచేతనే క్రీడాభిరామంలోని శైలి అక్కడక్కడ శ్రీనాథుని కవితా శైలిని పోలి ఉందని సహేతుకంగా ఉంటుంది. ఆనాటి...
Name: డాక్టర్ పళని

డాక్టర్ పళని ద్రావిడ భాషల సాహిత్యం తులనాత్మక పరిశీలనపై ఆసక్తిగల పరిశోధకుడు. నాల్గవ ప్రపంచ తెలుగు మహాసభల్లో సమర్పించిన ' ద్రావిడ భాషల్లో భారతేతిహాసం ', అలాగే సి.ఐ.ఐ.ఎల్, మైసూరు వారి కోసం రాసిన ' తెలుగు కన్నడ భారతాలు - కవిత్వ దృక్పథం' వంటి వ్యాసాలు ఇందుకు నిదర్శనాలు. ఈయన రాసిన " సంగీత రారాజు - త్యాగరాజు" పుస్తకాన్ని తెలుగు అకాడమీ, హైదరాబాద్ వారు, " తేటల మాటలు, అన్నమయ్య అమృతధారలు పుస్తకాలను ద్రావిడ విశ్వవిద్యాలయం, కుప్పం వారు ప్రచురించారు. యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ వారి ఆర్థిక సాయంతో "మాండలిక కథల్లో - సామాజికాంశాలు (తెలంగాణ, రాయలసీమ కథలు) అనే అంశంపై మేజర్ రిసెర్చ్ ప్రాజెక్టును పూర్తి చేశారు. ద్రావిడ విశ్వవిద్యాలయం తెలుగు శాఖలో సహాయ ఆచార్యులు సేవలందిస్తున్న డాక్టర్ పళని, 2015 నుండి మూడు సంవత్సరాలకు పైగా మునిసిపల్, పట్టణాభివృద్ధి శాఖా మంత్రికి ఓ.ఎస్.డి (ప్రత్యేక విధుల అధికారి) గా ప్రభుత్వ ఉత్తర్వుల మేరకు పని చేశారు. ప్రాచీన సాహిత్యం పై ఆసక్తి కలిగిన ఈయన యాబైకి పైగా వ్యాసాలను రాశారు. చరవాణి 9912343804