ప్రపంచంలో ఏ సాహిత్యానికి కైనా మనిషి మనుగడ మూలం. మనిషి శతాబ్దాలుగా తన ఉనికి గురించి వివిధ రకాలుగా వ్యాఖ్యానిస్తూనే ఉన్నాడు. తన ఉనికిని మరింత అర్థవంతం చేసుకోవాలని ప్రయత్నిస్తూనే ఉన్నాడు. మనిషి మనుగడ మాత్రమే మనిషి సారాన్ని లేదా చైతన్యాన్ని...
Name: డాక్టర్ తైదల అంజయ్య

తైదల అంజయ్య: జననం: ఉమ్మడి కరీంనగర్ జిల్లా లా కోహెడ మండలం నాగ సముద్రాల గ్రామంలో రాజయ్య మల్లవ్వ అనే పేద కూలీల ఇంట. పుట్టిన తేదీ తెలియదు గాని సంవవ్సరం 1976లో. ఎమ్మెస్సీ ఫిజిక్స్. తెలంగాణ కవిత్వం ప్రాదేశిక చైతన్యం అన్న అంశం మీద పీహెచ్డీ చేసి గణిత శాస్త్ర ఉపాధ్యాయుడిగా పని చేస్తున్నారు. 2006లో పునాస 2012లో ఎర్రమట్టిబండి అనే కవితా సంపుటాలను వెలువరించారు. 2019లో వెదురు విల్లు అనే పేరుతో ఇతని కవిత్వం ఆంగ్లంలో వెలువడింది. చిక్కనవుతున్న పాట, పొక్కిలి, మత్తడి, దూదిపూల దుఃఖం, నూరు అలల హోరు మొదలగు సంకలనాలలో ఈయన కవితలు ప్రచురితం అయ్యాయి. ఉమ్మడిశెట్టి అవార్డు 2007, రంగినేని ట్రస్ట్ అవార్డ్ 2007, భారతీయ దళిత సాహిత్య అకాడమీ అవార్డు 2009, ఎస్ జి ఫౌండేషన్ అవార్డు 2010, సినారే అవార్డు 2014, సదాశివుడు అవార్డు 2016, మిషన్ కాకతీయ మీడియా అవార్డు 2016, సిద్దిపేట జిల్లా ఉత్తమ అవార్డు 2017 అందుకున్నారు. ఈయన ‘పునాస’ కవితా సంపుటి శ్రీకృష్ణదేవరాయలు యూనివర్సిటీలో ఎమ్మే తెలుగు సిలబస్ లో ఉంది. పాటలు పాడడం రాయడం చిత్రలేఖనం పద్య నాటకాలు ఇతని అభిరుచులు మొబైల్ నంబర్: 9866862983.