‘రస్తా’ మేరకు ఇది కుంచెం కొత్త ప్రయోగం. ఒక సమకాలీన తెలుగు కవి తాజా కవితను ఇంగ్లీషు చేసి ప్రచురించడం. ఒకరకంగా దీన్నొక వర్క్ షాప్ గా కూడా వాడుకుందాం. కవితను స్వయంగా కవే చేసినా సరే, మంచి అనువాదకునితో చేయించి పంపినా సరే. స్వయంగా చేసుకునే వారు తమ...
Name: ఎలనాగ

ఎలనాగ: అసలుపేరు డాక్టర్ నాగరాజు సురేంద్ర. పుట్టింది కరీంనగర్ జిల్లాలోని ఎలగందులలో, 1953. చిన్నపిల్లల డాక్టరు కాని, ప్రాక్టీసు చెయ్యటం లేదు. రాష్ట్రప్రభుత్వ వైద్య ఆరోగ్యశాఖలో పని చేసి, డెప్యూటీ కమిషనర్ స్థాయి హోదాలో 2012 లో పదవీ విరమణ. ఇప్పటి వరకు 24 పుస్తకాలు రాశారు. పన్నెండు స్వతంత్ర రచనలు, 12 అనువాదాలు. అనువాదాల్లో 8 ఇంగ్లిష్ నుండి తెలుగులోకి, 4 తెలుగునుండి ఇంగ్లిష్ లోకి. తెలుగులో వచనకవితా సంపుటులు, ఛందోబద్ధ పద్యాల సంపుటి, ప్రయోగపద్యాల సంపుటులు, గేయాల సంపుటి, భాష గురించిన వ్యాసాల సంపుటులు, ప్రాణిక గళ్లనుడికట్ల పుస్తకం. లాటిన్ అమెరికన్ కథలు, ఆఫ్రికన్ కథలు, ప్రపంచదేశాల కథలు, సోమర్సెట్ మామ్ కథలు - తెలుగు చేశారు. కవిత్వాన్ని ఇంగ్లిష్ నుండి తెలుగు లోకి, తెలుగునుండి నుండి ఇంగ్లిష్ లోకి అనువదించారు. వట్టికోట ఆళ్వారు స్వామి రచించిన ‘జైలు లోపల’ ను Inside the Prison పేరుతో, పవన్ కుమార్ వర్మ రాసిన Ghalib: The Man The Times ను ‘గాలిబ్ - నాటి కాలం’ శీర్షికతో ఆంగ్లంలోకి అనువదించారు. శాస్త్రీయ సంగీతం మీద స్వయంగా రాసిన తెలుగు కవితలను Memorable Melody Makers and Other Poems on Music పేరిట అనువదించి, ప్రచురించారు. తెలంగాణ సాహిత్య అకాడమి వారు ప్రచురించిన Astitva - Short Fiction from Telangana కు సహసంపాదకత్వం వహించారు. Indian Literature, Muse India, Episteme మొదలైన ప్రింట్/ వెబ్ పత్రికల్లో వీరి అనువాద కవిత్వం అచ్చయింది.