Name: హెచ్చార్కె

Alternative Text

కాలం కన్న బిడ్డలు

వంచన నాటకంలో చివరి అంకం? వంచక చొక్కా మడతల్లో ఇంకెన్ని ట్రిక్కులున్నాయో చెప్పలేం. జనాల మీద కుట్ర కేసులు మోపేది వాళ్ళే. జనాలకు వ్యతిరేకంగా కుట్రలు చేసేదీ వాళ్లే. రూల్ అఫ్ లా అని కేకలు వేసేది వాళ్ళే. అన్ని రూల్స్ ను తుంగలో తొక్కి వికటహసించేదీ వాళ్ళే...

కలవడమెలా?

మొహమాటాలొదిలి మాట్లాడుకుందామా? పోయినోళ్ళందరూ పోయాక, పోకుండా మిగిలినోళ్లమైనా … మాట్లాడితే అన్య ధోరణి అని ముద్ర వేస్తారని భయపడకుండా మాట్లాడుకుందామా? మాట్లాడుకోవాల్సిందే గాని, ఇప్పుడు కాదు, ఇప్పుడు మనం కష్టాల్లో వున్నాం… అంటారా? మనం...

చౌరస్తా!

ప్రపంచం ఒక నైతిక చౌరస్తాలో ఊగిసలాడుతోంది. చూట్టానికి గొప్ప హార్రర్ సినిమాలా వుంది. ఇది మనుషుల లోకం కాదనిపిస్తున్నది. ఒక అమానుష శక్తి భూగోళాన్ని రబ్బరు బంతి చేసుకుని ఆడుకుంటున్నట్టుంది. ఆటలో ఆటగా బంతిని ఏ అగాధం లోనికో లాక్కు పోతున్నట్లుంది. అమెరికా...

ఎవరి సొతంత్రం?

భలే సమయం, భారతీయులం సగర్వంగా స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకోడానికి ఇంతకన్న గొప్ప సమయం వుండదు. స్వాతంత్ర్యం కావాలంటే నువ్వొక మనిషివైతే చాలదు. ఒక దేశంలో పౌరుడివై వుండాలి. పౌరుడిగా వుంటానికి నీకొక దేశం వుండాలి. వీసా వొచ్చి, ఆపై గ్రీన్ కార్డు...

విమర్శ – ఆత్మవిమర్శ

  మనుషులం. మాట్లాడుకోకుండా వుండలేం. మూగవాళ్ళు కూడా మాట్లాడుతారు. సైగలతో, చిరు శబ్దాలతో. మాట పతనమైతే మనమూ పతనమవుతాం. గమనించారా?! ఇద్దరు వ్యక్తులు ఒకే అభిప్రాయంతో వున్నట్లయితే; ఆ సంగతి తెలిసే కొద్దీ… ఆ యిద్దరు మాట్లాడుకోడం మానేస్తారు...

అమ్మ క్యాలండర్

నేను అమెరికాకు వొచ్చి ఎన్నాళ్ళయిందా అని ఆలోచన వచ్చింది ఇవాళ పగలెప్పుడో రోడ్డు మీద నడుస్తుండగా. రోడ్డు మీద నడవక ఆకాశంలో  నడుస్తావా అని అడక్కండి. మనూళ్లో అయితే, ఎంచక్కా రోడ్డు విడిచి చెట్ల మధ్య మన దుమ్ములో మన ధూలిలో నడవొచ్చు. ఇక్కడ అలాంటి...

రాజ్యాధికారం అంత ముఖ్యమా?

దుర్మార్గమని చాల మందికి తెలిసిన పలు దుర్మార్గాలు మన మధ్య ఎలా వుండగలుగుతున్నాయి? మన లోపల ఎలా వుండగలుగుతున్నాయి? ఎన్ని విధాల ఆలోచించినా మిగిలే సమాధానం ఒక్కటే. సన్మార్గ శ్రేణుల్లోని రాజీ బేరాల వల్లనే దుర్మార్గాలు వుండ గలుగుతున్నాయి. మన లోనికి వొచ్చి...

మృతుల, వార్తల దేవుడు హెర్మ్స్

కార్ల్ మార్క్స్: కొలినిస్చె జేటంగ్ సంచిక 179 లో వ్యాసం కొలినిస్చె జేటంగ్ పత్రికను… ఇన్నాళ్లు ‘రైన్ ల్యాండ్ మేధావుల పత్రిక’గా కాకపోయినా, కనీసం, ‘రైన్ ల్యాండ్ వాణిజ్య ప్రకటన’గా మన్నించే వాళ్ళం. పత్రిక రాజకీయ వ్యాసాలు … పాఠకులకు...

అమెరికాలో ఏం జరుగుతోంది?

మతం వేరు మతస్థులు వేరు.  మతం మతస్థులు ఒకటే అనుకోవడమంటే, మతాన్ని అతిగా గౌరవించడమే. ఇందిరా గాంధీ కాలంలో ఒక జోకు వుండేది. ‘గరీబీ హఠావో’ అంటే గరీబుల్ని హఠాయించడమని. అది జోకు. గరీబీ వేరు గరీబులు వేరు. గరీబీ పోవాలి. గరీబులు వుండాలి. గరీబీ పోయాక గరీబులు...

మనిషీ మతం

ఒకరు ఫలానా మతం అయినందుకు ప్రేమించడం వున్నంత కాలం ఒకరు ఫలానా మతం అయినందుకు ద్వేషించడం కూడా వుంటుంది. ఈ రాగ ద్వేషాలు రెండూ మనిషిని దుంపనాశనం చేసేవే. రాగద్వేషాలకు మతం ఒక పతాకం అయినంత కాలం మనుషులు మనుషులుగా వుండరు. నా మతం ప్రాబల్యంలో వున్న చోట నేను...

హింసలెన్ని ఎదురైనా తల వంచని చింతన!

    ఈ పుస్కకాన్ని శ్రీ శ్రీ ప్రింటర్స్ యు విశ్వేశ్వర రావు చక్కగా జిరాక్స్ చేయించి, బైండు చేయించి ఇచ్చి  రెండు మూడేండ్లయ్యింది. ప్రజా శక్తి బుక్ హస్ కోసం అనువాదం చేస్తానన్నాను. అనారోగ్యం వల్ల కొంతా, మొదట చదవగానే ఇది నాతో ఎప్పటికయ్యేను అనే...

సంబరం

ఇది కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి సంవత్సరం. ఒక వుద్వేగం. ఒక వుత్సాహం. ఆలోచనల చరిత్ర చేసుకుంటున్న సంబరం. వంతెన కింద చాల జలాలు ప్రవహించాయి. ‘అయామ్ డన్ విత్ మార్క్సిజం’ అనడం ఒక ఫ్యాషన్ అయిపోవడం, ఆ ఫ్యాషన్ అర్థరహితమయిపోవడం కూడా జరిగి పోయింది...

తొలి అడుగు

ఇదొక అద్భుతమైన సమయం. అద్భుతాలన్నీ అందంగా వుండవు. చార్లెస్ డికెన్స్ తన రచనాద్భుతం ‘రెండు నగరాల కథ’ను మొదలెడుతో అంటాడు… ‘అది వర్స్ట్ ఆఫ్ టైమ్స్, బెస్ట్ ఆఫ్ టైమ్స్’… అని. మన సంక్షుభిత సమయానికి అతికినట్టు సరిపోతుందా మాట, డికెన్స్...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.