నీవు నిర్వాత మేఘ శకలానివి, కదలలేవు; ఆకాశం నీకు ఊచలు లేని పంజరం ! నేను కటకటాల వెనుక చిలుకను, ఎగిరిపోలేను; నేను నిగళాలకు చిక్కిన నింగిని ! నీవేనా ఆ నీలి మబ్బుల నీడలలో చువ్వలను కట్టుకొని ఎగురుతున్న లోహ విహంగానివి ! తొంగి చూడకు శూన్యం లోకి ; అక్కడ నీకు...
Name: నాగరాజు రామస్వామి

నాగరాజు రామస్వామి. స్వగ్రామం : ఎలగందుల, కరీంనగరం జిల్లా, తెలంగాణ. పుట్టిన తేది : 9- 9 -1939 విద్య : B .Sc , B .E ., శాంతినికేతన్ లో 6 నెలల సాంఘిక విద్యా ట్రైనింగ్ . ఉద్యోగ పర్వం : పదేళ్లు ఎలక్ట్రిక్ ఇంజనీరుగా ఇండియాలో, పాతిక సంవత్సరాలు నైజీరియా, ఘాన, ఓమన్, సౌదీఅరేబియా లో టెక్సటైల్ కంపెనీలలో, చీఫ్ఇంజినీరుగా, ప్రాజెక్ట్ మానేజర్ గా. నివాసం : హైద్రాబాద్ . ప్రచురణలు : ఆంగ్ల కవితా సంపుటాలు -2 , స్వీయ కవితా సంపుటాలు - 3 , వచనం -1 , అనువాద కవితా సంపుటాలు - 7 ( జాన్ కీట్స్ కవితా వైభవం, గీతాంజలి, ఆక్టేవియో పాజ్ సూర్యశిల / Sunstone , అనుధ్వని, అనుస్వరం, అనుస్వనం, కల్యాణ గోద ) - మొత్తం 13 . అముద్రిత కవితా సంపుటాలు - 2 . మొదట్లో కొన్నాళ్ళు "ఎలనార" కలం పేరుతో కవితలు రాశారు. ప్రస్తతం: సిటిజన్ షిప్ కోసం వేచిఉన్న గ్రీన్ కార్డు హోల్డెర్ని. ముగ్గురు పిల్లలు. ఇద్దరు కూతుర్లు, ఒక కొడుకు - సన్నీవేల్, ఆస్టిన్, డాలస్ లలో.