Name: కొండేపూడి నిర్మల

Alternative Text

కొండేపూడి నిర్మల సుప్రసిద్ధ ఫెమినిస్టు రచయితా కవయిత్రి. లేబర్ రూం  తదితర కవితలతో ... మాతృత్వం వంటి సున్నితమైన సెంటిమెంటల్ సమస్యలలో స్త్రీవాద అవగాహనను నీళ్లు నమలకుండా వ్యక్త్తం చేయడం ద్వారా కొత్త ఉద్యమానికి ముందు వరుసలో నిలబడ్డారు. కబుర్లు చెప్పుకుంటూ కాఫీ తాగినంత హాయిగా, గాజు గ్లాసులో చిక్కిన ఈగను సాశ్చర్యంగా చూసీ కవిత్వం చెబువారు. 'మృదంగ నాదం' ఆమె ఇటీవలి పుస్తకం. విజయవాడలో పుట్టి పెరిగి, మేరీ స్టెల్లా కాలేజీలో చదువుకున్న నిర్మల ప్రస్తుతం హైదరాబాదులో నివసిస్తున్నారు.

అమానుషంలో సామూహికత ?

ఈమధ్య దినపత్రిక తిరగేసినప్పుడల్లా సామూహిక అనే నాలుగక్షరాల దగ్గర నా చూపు ఆగిపోతోంది . ఆ తర్వాత ఏమి రాసి వుందో చదవాలంటేనే భయమేస్తోంది.  ఈ సామూహిక అనే పదం మనకి అత్యాచారంతో ముడిపడి మాత్రమే కనిపిస్తోంది. ఇంతకంటే ఇంకే పని లోనూ ఇలాంటి సామూహికత లేదేమో...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.