నీలోకి దారి తెలియక… నీలోకి చూసే ముందు నాలోకి నన్ను చూసుకోవాలి లోపల్లోపలికి చూసుకున్న కొద్దీ నీ నీలికళ్ళ వలయ లయల్లోకి మంద్రస్వర మార్మిక తుషారాల లోయల్లోకి- నిను స్పృశించే ముందు నా చర్మం పొరల వెనుక జ్వలించిన కాంక్షా సౌగంధ సౌరభాల్ని...
Name: పసునూరు శ్రీధర్ బాబు

పసునూరు శ్రీధర్ బాబు: నల్లగొండ జిల్లా మోత్కూరు లో పుట్టి పెరిగారు. న్యాయ శాస్త్ర పట్టభద్రుడు. వృత్తి రీత్యా జర్నలిస్టు. ప్రింట్, విజువల్ మీడియాలో చిరకాలంగా పని చేస్తున్నారు. ప్రవృత్తి రీత్యా కవి. తన కవితా సంపుటి ‘అనేక వచనం’ అనేక ప్రశంసలు అందుకుంది. వైయక్తిక అనుభవాల్ని తాను చూసినంత సాంద్రంగా పఠితలకు అందించే పదునైన కలం. శ్రీధర్ బాబు ప్రస్తుతం ఢిల్లీలో, బిబిసి న్యూస్ ఛానల్ లో సీనియర్ బ్రాడ్ కాస్ట్ జర్నలిస్టుగా పని చేస్తున్నారు.