ఏదైనా భరించలేని సంఘటన జరిగినప్పుడు ఒక కథ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఆ కథ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. మొన్న తొమ్మిది నెలల పసి మొగ్గ నెత్తురు తాగిన మగ జంతువు గురించి విన్నప్పుడు దిగాలు పడిపోయాను. సరిగ్గా అప్పుడే నేను రాయాలనుకుంటున్న...
Name: ప్రసాద మూర్తి

పూర్తి పేరు రామవరప్రసాదమూర్తి. జన్మస్థలం ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా నిడమర్రు గ్రామం. ప్రసాదమూర్తి అనే పీరుతో రాస్తుంటారు. ‘’కలనేత ‘’, ‘’మాట్లాడుకోవాలి’’, ‘’నాన్నచెట్టు’’, ‘’పూలండోయ్ పూలు’’, ‘’చేనుగట్టు పియానో’’, ‘’మిత్రుడొచ్చిన వేళ’’ కవితా సంపుటాలు ప్రచురించారు. ఇప్పుడు ‘’దేశం లేని ప్రజలు’’ సంపుటి ఆవిష్కృతమవుతోంది. ‘’ఒక దశాబ్దాన్ని కుదిపేసిన దళిత కవిత్వం’’ అనే పరిశోధన గ్రంధం అచ్చయింది. త్వరలో కథా సంకలనం రానున్నది. వృత్తి జర్నలిజం. ప్రస్తుతం ఒక ఎలక్ట్రానిక్ మీడియాలో ఉద్యోగం. నూతలపాటి గంగాధరం, సోమసుందర్, స్మైల్, ఫ్రీవర్స్ ఫ్రంట్, విమలా శాంతి, ఉమ్మడిశెట్టి,ఢిల్లీ తెలుగు అకాడెమీ, రొట్టమాకురేవు మొదలైన సాహితీ పురస్కారాలు పొందారు.