నెల రోజులుగా నీరసంగా ఉన్న నీలి కళ్ళ అబ్బాయిలో నిన్ననే ఉత్సాహం తొంగి చూసింది పోయిన వారమే నల్ల అమ్మాయిలో కొత్త వెలుగులు నాట్యం చేసాయి నిత్యం చిర చిర లాడే చిన్నోడు ఇప్పుడే నవ్వాడు అమ్మ నాన్న లేని అమ్మడి విచార వదనంలో వెలుగు రేఖలు పెదాలను నేడే ముద్దాడాయి...
Name: ఎడమ శ్రీనివాసరెడ్డి

ఎడమ శ్రీనివాస రెడ్డి కాకతీయ ప్రభుత్వ కళాశాలలో రసాయన శాస్త్ర అధ్యాపకులు, గతంలో టీచర్ ఎడ్యుకేటర్ గా కూడా పనిచేశారు. ‘స్వాతి’ వార పత్రిక కథల పోటీలో (1985) బహుమతితో రచనా వ్యాసంగం ప్రారంభం. పది లోపు కథలు, డజన్ కవితలు, రసాయన శాస్త్రం, విద్యారంగ విషయాలపై వందకు పైగా వ్యాసాలను ప్రచురించారు. రెండు పుస్తకాలు ప్రచురించారు. విద్యా రంగ సమస్యలపై పని చేస్తున్న ‘సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్’ స్టీరింగ్ కమిటీ సభ్యులు. షాడో ఎడ్యుకేషన్, విద్యా ప్రైవేటీకరణ, టీచర్ ఎడ్యుకేషన్, కంపారిటివ్ ఎడ్యుకేషన్ ఆయనకు ఆసక్తి వున్న విషయాలు.