“దళిత, ఆదివాసీ, ముస్లిం స్త్రీలు సమాజపు ఆఖరి మెట్టు మీద నిలబడి పీడితులలో పీడితులుగా ….. హక్కుల నిరాదరణకు గురౌతున్నారు” అనే వాక్యంతో మొదలవుతుంది కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి ‘వేకువపిట్ట’ కవితా సంపుటికి రాసిన ముందుమాట. ఆలోచనాపరులు కేవలం...
Name: ఉషా ఎస్ డానీ

ఉషా యస్ డానీ: అసలు పేరు అహ్మద్ మొహియుద్దీన్ ఖాన్ యజ్దానీ జర్రానీ. తెలుగు. ఆంధ్రభూమి, ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ, డెక్కన్ క్రానికల్, ఏపీ టైమ్స్, సీ-టీవీ, ఎన్-టీవీ, ఎక్స్ ప్రెస్ టీవీల్లో ఆయన పనిచేశారు. ఇండియన్ పత్రిక, జైకిసాన్ టీవీల్లో ఎడిటర్ బాధ్యతలు నిర్వహించారు. ప్రస్తుతం స్వతంత్ర పాత్రికేయునిగా, డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్ గా వుంటున్నారు. నరసాపురం ఆయన పుట్టిన వూరు. నివాసాన్ని విజయవాడకు మార్చి విప్లవ కమ్యూనిస్టు ఉద్యమాలలో క్రియాశీలంగా పనిచేశారు. కారంచేడు ఉద్యమంలో పీపుల్స్ వార్ ప్రతినిధిగా పనిచేశారు. చినగంజాం ఉప్పుఫ్యాక్టరీ వ్యతిరేక పోరాటానికీ, వాడరేవు షిప్ బ్రేకింగ్ కూ వ్యతిరేకంగా జరిగిన పోరాటానికీ నాయకత్వం వహించారు. జూలియస్ ఫ్యూజిక్ (1981), డానీ వ్యంగ్యం (2011) పుస్తకాలను ప్రచురించారు. సమాజం, సాహిత్యం, రాజకీయాలపై చాల్ వ్యాసాలు రాసారు. ప్రస్తుతం ముస్లిం ఆలోచనాపరుల వేదికకు కన్వీనర్ గా, బహుజన ప్రతిఘటన వేదికకు కో-కన్వీనర్ గా, ఆంధ్రప్రదేశ్ పౌరసమాజానికి కార్యదర్శిగా వుంటున్నారు.