పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథాశిల్పం గురించి కొన్ని ఆలోచనలు ‘కథలంటే వింతవిషయాలే గదా’ (‘ఆర్ముగం-అనంతలక్ష్మి’కథలో కథకుడు) పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938-2018) ఆధునిక తెలుగు కథని రెండడుగులు ముందుకు నడిపించిన కథకుడిగా తన జీవితకాలంలోనే గుర్తింపు...
Name: వాడ్రేవు చినవీరభద్రుడు

వాడ్రేవు చినవీరభద్రుడు: 1962 లో తూర్పుగోదావరి జిల్లా మన్యప్రాంతంలో పుట్టిపెరిగారు. తత్త్వశాస్త్రంలో ఎమ్మే చేసారు. గత ముప్పై ఏళ్ళకు పైగా ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖలో పనిచేస్తూ ఉన్నారు. ప్రస్తుతం హైదరాబాదులో సెంటర్ ఫర్ ఇన్నొవేషన్స్ ఇన్ పబ్లిక్ సిస్టమ్స్ లో సలహాదారుగా ఉన్నారు. ఇప్పటిదాకా మొత్తం 34 పుస్తకాలు వెలువరించారు. వాటిలో కవిత్వం, కథలు, సాహిత్యవిమర్శ, యాత్రాకథనాలతో పాటు విద్యమీద కూడా స్వీయ రచనలతో పాటు కాంట్, కబీరు, బషొ, కలాం, గాంధీ, టాగోర్ మొదలైన రచయితల అనువాదాలు కూడా ఉన్నాయి. కవిత్వానికి, సాహిత్య విమర్శకు తెలుగు విశ్వవిద్యాలయం పురస్కారాలతో పాటు, అనువాదానికి కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కారం లభించింది.