ఉదయం నుండీ తన వెలుగు, వేడి అందరికీ పంచి అలసిన సూర్యుడు ఎర్రబడిన శరీరంతో ఇక విశ్రాంతి కోసం వెళ్ళడానికి సిద్ధంగా ఉన్నాడు. క్రమంగా చీకటి కమ్ముకొస్తోంది. లేగదూడలు పాలకోసం ఎదురు చూస్తాయని పశువులు పరుగెడుతున్నాయి. చీకటి పడ్డాక మేం మాత్రం ఏంచేస్తాం...
Name: వేణు నక్షత్రం

వేణు నక్షత్రం: ఉస్మానియా విశ్వవిద్యాలయం ద్వారా ఎంసీఏ పూర్తి చేసి 1998 లో జీవన భృతికై అమెరికావచ్చారు. సిద్దిపేటలో మంజీరా రచయితల సంఘం స్పూర్తితో రాయడం అలవాటు చేసుకున్నారు. కథలు మౌనసాక్షి (సుప్రభాతం 1992) , పర్యవసానం ( ఆంధ్రజ్యోతి 1993) మరి కొన్ని కవితలు రాశారు. గత రెండు దశాబ్దాలుగా కంప్యూటర్ రంగం లో పని చేస్తున్నప్పటికీ, సాహిత్యం రంగాలు ప్రవృత్తి అయ్యాయి. అమెరికాలో పలు సినిమాలకి దర్శకత్వ శాఖలో పని చేసి, ఆ తర్వాత తీసిన మూడు కథల సమాహారం "నక్షత్రం - మూడు హృదయాల చప్పుడు' ప్రపంచ వ్యాప్తంగా ఎంతో మందిని ఆత్మీయంగా పలకరించింది . ఇటీవల ప్రారంభించిన పిలుపు టీవీ కూడా అనతి కాలంలోనే జన రంజకమయింది. . email: nakshatram@gmail.com