అమెరికా ఆస్ట్రేలియా దేశాలలో చాలా పదాలు అఫెన్సివ్ అనిపిస్తాయి. అఫెన్సివ్ అంటే అసహ్యకరంగా, అసంబద్ధంగా, నిందార్ధకమైన, దూరీతమైన, తుచ్చమైన, జాతి వివక్షతతో కూడిన..ఇలా అనేక అర్ధాలు చెప్పుకోవచ్చు. ఒక్కొక్క. పదం ఒక్కొక్క జాతీయతకు లేదా జాతికి చెందిన...
Name: తుల్లిమల్లి విల్సన్ సుధాకర్

తుల్లిమల్లి విల్సన్ సుధాకర్: తుల్లిమల్లి విల్సన్ సుధాకర్ దళిత కవి. కేంద్ర పర్యాటక మంత్రిత్వ శాఖలో అసిస్టెంట్ డైరెక్టర్ జనరల్ గా జపాన్, దుబాయి, దక్షిణాఫ్రికా మొదలైన దేశాలలో పనిచేశారు,అప్పటి కేంద్ర మంత్రి జగ్మోహన్ తో కలిసి ఈస్ట్ఏషియా దేశాలలో పర్యటించి చైనా నుంచి ఇండియాకు మోస్ట్ ఫేవర్డ్ డెస్టినేషన్ సాధించడంలో కృషిచేశారు. దక్షిణ కొరియా, ఒసాకాలో జరిగిన వర్ల్డ్ టూరిజం ఆర్గనైజేషన్ సమావేశాలలోనూ, దక్షిణాఫ్రికాలో జరిగిన బ్రిక్స్ మినిస్టీరియల్ సమావేశంలోనూ ఇండియా తరపున ప్రాతినిధ్యం వహించారు. 2010లో జరిగిన కామన్ వెల్త్ క్రీడలకోసం జోహన్నెస్‌బర్గ్, కేప్‌టౌన్ లలో క్వీన్స్ బేటన్ ర్యాలీని దేశం తరపున నిర్వహించారు. హాంగ్ కాంగ్ నుంచి ఇండియాకు డైరెక్ట్ ఫ్లైట్ వేయడానికి ముఖ్యపాత్ర వహించారు. తెలుగులో దళిత వ్యాకరణం, మాకూ ఒకభాష కావాలి కవిత్వ సంకలనాలను ప్రచురించారు. 2011లో మలేషియాలో జరిగిన ప్రపంచ తెలుగు మహా సభలలో పాల్గొన్నారు. పొట్టి శ్రీరాములు విశ్వవిద్యాలయం పురస్కారం, ప్రతిష్టాత్మక ఫ్రీ వెర్స్ ఫ్రంట్ పురస్కారం, విమలాశాంతి పురస్కారం, విజయవాడ వారి క్రైస్తవ పురస్కారం అందుకున్నారు. దక్షీణాఫ్రికా తెలుగు సంఘం, టోక్యోలోని తెలుగు సంఘం కార్యక్రమాలను ప్రోత్సహించి వారి కార్యక్రమాలకు నిధులు అందజేశారు.