రేపు శుక్రారం. ఈ పొద్దు రెయ్యి నిద్రలోకి జారుకునే ముందు రేపు శుక్రారం బిరిన్నే లెయ్యల్ల అన్న మాటను తలకాయకు అప్పగించి నిద్రబోతాము. ఆ లచ్చిందేవి మా ఇంటికి వస్తుందో రాదో గాని ఇల్లూవాకిలి కడుక్కొని ముగ్గులుబోసుకొని, పసుపు కుంకాలబొట్లు పెట్టి, పూలు...
కథ
రభస దేవుడు
ప్రాణభయం వల్ల నాకు కలిగిన తాత్కాలిక దైవభక్తిని నాలో కమ్యూనిస్టు కూడా ఆమోదించినట్టున్నాడు. ప్రమాదం నుంచి బయటపడగానే మళ్ళీ నాస్తికుడిగా మారిపో అంటూ నీరసంగా అదేశించాడు. నాలో ఉన్న కమ్యూనిస్టు ఏపాటి? జాతీయ నాయకులే, తమ మద్దతుతో నడిచే బూర్జువా ప్రభుత్వాలను...
ఆమె వెళ్ళిపోయింది
పక్షులు కిలకిలముని శబ్దాలు చేస్తూ ఉన్నాయి, మెల్లని స్వరంతో ‘ప్రభు కాపాడండి, ప్రభు కాపాడండి’ అంటూ వంటగదిలో మోకాళ్ళ మీద పడి యేసు ప్రార్థన చేస్తున్న అమ్మ మాటలు మెల్లగా నా చెవిని చేరుతూ ఉన్నాయి. ఈలోగా సూర్యుని తెల్లని కాంతి తలుపుల సందులో నుంచి తలుపును...
నీరుగట్టు
మా అవ్వా తాతా నీరుగట్టు పనికి పోతుంటారు. శివరేతిరి నెల పెట్టేసుండాది. అరకవ నీల్ల పూట. ఈపొద్దు వంతు మాది. మేము పిల్లోళ్లం సంగటి తినేసి పణుకోనుండాము. మాయవ్వ నాపక్కనే పణుకుని ఆమాట ఈమాటా చెబతా ఉండాది. తినేసి బయిటికి పొయుండిన తాత అప్పుడే ఇంట్లోకి వచ్చి...
బంకసారు
“రండి. కూర్చొండి.” తన చాంబర్లోకి అడుగు పెట్టిన పార్ధు, కిరణ్ లను గిరిజన్ కార్పోరేషన్ మేనేజింగ్ డైరెక్టరు సాదరంగా ఆహ్వానించారు. వారిద్దరూ ‘పొంగేమియా ప్రొడక్ట్స్ లిమిటెడ్’ కంపెనీకి చెందినవారు. ఆ కంపెనీకీ, గిరిజన కార్పోరేషనుకీ ఉత్తర...
బాలమామ చుట్టాలు
మా బాలమామ బలేవోడు. ఎంత మంచోడో అంత కోపిస్టోడు. చిన్నప్పుడే, వాళ్ల నాయిన కొట్టినాడని అలిగి వేరే ఊరికి పొయ్యేసినాడు. ఆరేడేండ్లు ఊరితట్టు అడుగే పెట్లేదు. ఎంతైనా అబ్బాకొడుకులు కదా, ఎన్నేండ్లని కలుసుకోకుండా ఉంటారు! తాత మనమరాలిది, అంటే మామవాళ్ల అక్క...
ఆమె చూసింది
పది నిమిషాలయినా కాలేదు, చదువుతున్న పుస్తకాన్ని పక్కన పెట్టి బాల్కనీ లోకి వెళ్లి నిల్చున్నా. హాస్టల్ రెండో ఫ్లోర్లో ఉన్న నా రూమ్ నుండి కిందకి చూస్తే వార్డెన్ రూమ్, ఎదురుగా నీలగిరి చెట్లూ, వాటి సందుల్లోంచి చూస్తే చాలా దూరంలో మనిషెత్తైనా లేవన్నట్టు...
పాపా! కథ చెప్తావా!
“You want to tell a story? Grow a heart. Grow two. Now, with the second heart, smash the first one into bits.” — Charles Yu అన్ని రోజులలాంటివి కాని కొన్ని రోజులని, పూర్తిగా సంపూర్ణంగా బతికిన ఆ క్షణాలని వదిలి మళ్ళీ ఎప్పటిలాగే దుమ్ము పట్టిన...
అనామక మరణం
ఏదైనా భరించలేని సంఘటన జరిగినప్పుడు ఒక కథ రాయాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను. కానీ ఆ కథ ఇప్పటి వరకూ మొదలు కాలేదు. మొన్న తొమ్మిది నెలల పసి మొగ్గ నెత్తురు తాగిన మగ జంతువు గురించి విన్నప్పుడు దిగాలు పడిపోయాను. సరిగ్గా అప్పుడే నేను రాయాలనుకుంటున్న...
యాభైసోమి గుర్రం
ప్రతిరోజూ.. ఉదయాన్నే నాలుగేళ్ల నా కూతుర్ని తీసుకుని రెహ్మత్నగర్లోని డైరీఫామ్కి వెళ్లటం అలవాటు. వెళ్లే దారిలో పావురాలు, కోళ్లు, ఆవులు, పిల్లులు, కుక్కలు, మేకలు.. ఎదురవుతూనే ఉంటాయి. వాటి గురించి కథలు చెప్పుకోవటం మాకు అలవాటు. అదే...
డిగ్రీ ఫ్రెండ్స్
నలభైకి దగ్గరపడే కొద్దీ నాకు ఆరోగ్యం మీద శ్రద్ధ పెరిగింది. తెల్లారగట్ల పార్కులో పరిగెడుతున్నాను. మొదట్లో ఓ పదడుగులేయటం కష్టంగా ఉండేది. ఇప్పుడు పావు కిలోమీటరు పైనే ఆగకుండా పరిగెత్తగలను. మొన్నో రోజు పరుగు మధ్యలో ఉండగా పాత విషయం ఒకటి గుర్తొచ్చింది...
అల్గారిథం
‘ప్రయాణ బడలిక’ ఇప్పటికి చాలా సార్లు తనకుతాను చెప్పుకున్నది శృతి. అయినా విమానంలో కదా వచ్చింది, సంశయం కలిగింది – ఏకధాటిగా 10 గంటల ప్రయాణం, శరీరం తట్టుకోవద్దూ? దారిలో ఎక్కువసేపు నిద్రేనాయే, ఇంకేంటి? అది మాగన్నుగా కళ్ళు మూయడమే, సరైన...
ఆ…అమ్మ
1 అరవైల నాటి కమ్యూనిస్టు ఇల్లు అది. తొంభైవ పడిలో ఉన్న ఆ వృద్ధుడు నిశ్చలంగా కూర్చొని ఉన్నాడు. ముందు చిన్న వరండా గది. వెనక అంతే ఉన్న ఈ చిన్న గది సరిగ్గా ఒక మంచం పక్కన ఒక స్టూలు వేయడానికి సరిపోయింది. వెనక గుమ్మం పైనున్న గోడ మీద రంగు వెలిసి పోయిన పేద్ధ...
కోతి బొమ్మచ్చి
ఆరేళ్ళు పూనాలో గడిపి, సికింద్రాబాదుకి బదిలీమీద రాగానే తెలుగుప్రాంతానికి వస్తున్నందుకు సంతోషించినా, ఆఫీసు క్వార్టర్ దొరుకుందో లేదో అని బెంగపట్టుకుంది. అందుకని కుటుంబాన్ని నెల తర్వాత తీసుకొద్దామని ముందు ఒక్కణ్ణీ ఆఫీసులో జాయినై క్వార్టర్ కోసం అడిగితే...
వెతుకులాట
“ఒరే! ఈరబాబు! ఇజీనగరం పైడితల్లమ్మ పండక్కి ఎప్పుడైనా ఎల్లేవా? ఎంత బాగుంతాదో తెలుసా?ఊరు వూరంతా నైట్లే. పట్టపగల్లాగా వుంతాది. ఎక్కడ సూడు, పులేసాలు, కొండేసాలు, కోయేసాలు, దొంగా పోలీసులు. మరో పక్క బుర్రకతలూ, అరికతలూ, డేన్సులు. ఒరే! సెప్పడానికి నేదురా...
ముక్కు
ఇంక నేనే ఆఖరి పేషెంటుని. నర్సు నా పేరు ఇలా పలకబోయిందో లేదో డాక్టర్ గదిలో దూరిపోయాను. అంతసేపూ ఎప్పుడు పిలుస్తారా అని బైట నేను పడిన కంగారుకి విరుద్ధంగా ఉంది లోపలంతా. టేబిల్ మీంచి ఏదో నెమ్మదిగా తీసి దాన్ని ఆ టేబిల్ మీదే ఇంకోచోట అతినెమ్మదిగా...
నాన్నకు.. ద్వేషంతో…..
నాన్న చనిపోయాడు. అందరూ ఏడుస్తున్నారు. నేను మాత్రం ఏడవడం లేదు. చెట్టంత కొడుకులు కూడా ‘నాన్నా.’.అంటూ బావురుమన్నారు. ఆఖరికి, ‘వీడు ఎప్పుడు పోతాడా’ అని కళ్లల్లో వొత్తులు వేసుకుని ఎదురు చూసిన కోడళ్లు కూడా కుమిలి కుమిలి ఏడుస్తున్నారు. “కూతురి...
గడ్డిపరక నలగాలి
మార్చి 2018 ఆదివారం రాత్రి ఈ హోటలొద్దని సుందరం బావ మొదట్నించీ చెబుతూనే ఉన్నాడు. సిబ్బంది కస్టమర్లని పీడిస్తారని అక్కడక్కడ విన్నవన్నీ చెప్పాడు. శ్రద్ధగా విన్నాను కానీ పట్టించుకోలేదు. నిజానికి అమ్మాయి నిశ్చితార్థం తుంగపాడులోనే చేసేవాడిని...
భాగ్యలతా కాలనీ
ఆ మర్నాడే అరుణ విమానమెక్కి వెళ్ళిపోతుంది. ఇంక నాకెప్పటికీ కనపడకుండా. నేను చేసిందే అంతా. మేమిద్దరమూ ఒక జంట అన్న నమ్మకంలో ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటుంటే, ఇక్కడ నేను ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాను. తనతో కలిసాను కూడా. నా వంచన పొడ అరుణకి వెంటనే...
క్రూరత్వం
జానకీ, నువు చాలా కష్టపడి పంపించిన ఉత్తరం చదివాను. ఇన్నేళ్ళయినా నువు నన్ను మర్చి పోలేదు. నా గురించి ఎలాగోలా తెలుసుకున్నావు. నేను ఇక్కడ ఉన్నానని అమ్మ చెప్పిందన్నావు. కనీస సౌకర్యాలు అంటే కనీసంగా కూడా తెలీని గిరిజన ప్రాంతం ఇది. ఇక్కడి పిల్లలందరూ “ఒకటో...
పొద్దున్నే హడావిడి
బాబిగాడికి లెట్రిన్లో ఎక్కువ సేపు కూర్చోవటమంటే ఇష్టం. అమ్మా నాన్నా ఎన్నిసార్లు తిట్టినా పద్ధతి మారలేదు. ఏవో ఊహల్లోపడి ముడ్డెండిపోయేదాకా అలాగే కూర్చుంటాడు. రెండ్రోజులుగా వర్షం పడి ఆ రోజే కాస్త ఆగింది. లోపల మటుకు వెచ్చగానే ఉంది. అప్పటికే బాబిగాడు...
ఆ అమ్మాయి..
దాదాపు రెండు సంవత్సరాలవుతుంది. ఆ అమ్మాయిని మాత్రం మరచిపోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంది. కళ్ళు మూసుకోవచ్చు. చెవులు మూసుకోవచ్చు. మనసెలా మూసుకుంటాం చెప్పండి. అందుకే ఆ అమ్మాయి మాటిమాటికీ గుర్తుకొస్తుంది. మనసును కప్పెట్టే మూతలేమైనా ఉన్నాయేమో...
ఆఁ..!
“బాగున్నావా?” “హూఁ! భగవంతుడి దయ, బాగానే ఉన్నాం. నువ్వెల్లాగున్నావు?” “అంతా బాగే “చాన్నాళ్ళకి గుర్తుకొచ్చానే” “అలా ఏం కాదు.టైం కుదరక“ “ఇంకా” “ఇంకేం లేదు“ “అదేంటీ...
వాళ్ళ వాళ్ళ విజయాలు
1 ‘యింతకు ముందుసారి ఈమె వొచ్చినపుడు ఆ కళ్ళలోకి చూడడడానికి చాలా యిబ్బంది పడ్డాను’ అని గుర్తు తెచ్చుకున్నాడు డా.అయాన్. ‘ఐదేళ్ళయిందేమో… కానీ యింతలోనే ఎంత తేడా’ అని కూడా అనుకున్నాడు. ‘ఆ పక్కన కూర్చున్న తండ్రి యిప్పుడు నిర్లిప్తంగా తనకేమీ...
పాఠ్యాంశం
సీ…ముసురు సీకటి…సీకటి ముసురు…ముసురు… సీముసురు… మూత పెట్టి కప్పీసిన గంగాళం నాగుంది…భూగోళం సీకటి సీకటిగ. ప్రెపంచంలోని మనుషులే కాదు జీవజాలమంతా కలిసి కారస్తన్న కన్నీళ్ల లాగ ఆకాశిం ధారగా కురస్తంది! ముసురు ముసురు...
నీ దారే నా దారీ!
మధ్యాహ్నం వచ్చాను హైదరాబాదు నుంచి. సూట్ కేసులు హాల్లోనే పెట్టి, స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు కునుకు తీద్దామనుకుంటే, ఏకంగా నాలుగు గంటలు నిద్రపోయాను. లేచే సరికి సాయంత్రం అయింది. అది కూడా అనన్య స్కూల్ నుంచి వస్తూ ఇంట్లో అడుగుపెట్టిందో లేదో సూట్...
కకాకికీ
నిండైన, సంపూర్ణమైన, పరిపూర్ణమైన సూర్యోదయం కోసం యెదురుచూస్తున్నాను. సముద్రాన్నీ ఆకాశాన్నీ వేరుచేసే క్షితిజరేఖ స్పష్టా స్పష్టంగా ఆకృతి నేర్పరచుకుంటోంది. వెలుతుర్లో ముందుకెళ్ళిన కొద్దీ వెనక్కు వెళ్ళిపోతున్న క్షితిజరేఖ చీకట్లోనైనా నిలకడగా వుంటుందో లేదో...
హడలిపోయాను
గౌరీశంకర్ చనిపోయాడన్న కబురు తెలిసింది. గౌరీశంకర్ మా ఆఫీస్ బోయ్. నేను బదిలీతో ఈ ఆఫీస్ కొచ్చిన రోజునే గౌరీశంకర్ నన్ను ఆకట్టుకున్నాడు. అతడి మాట తీరు బాగుంటుంది. అతడు కలివిడిగా కలిసి పోతుంటాడు. అతడు అరమరికల్ని ఆమడ దూరాన్న పెట్టేవాడు. అతడు నొవ్వడు ఎవర్నీ...