నా భావాలు రూపాన్ని అద్దుకుని నీవుగా మారి ఎదుట నుంచోడం ఎంత బాగుందో.. అనేకానేక నేనులు బయల్డేరి నీచుట్టు నుంచుంటాం నీ మాట కోసం నీ చూపు కోసం.. కాలం అక్కడే నడకను మర్చిపోతుంది.. నువు పంపే హడవుడి సంక్షిప్త లేఖలు వెన్నెల రోజుల్లో సుదీర్ఘ లేఖలు కృష్ణపక్షంలో...
కవిత
పోయేదేమీ లేదు!
ఆకాశంలో నున్న వేదాంతిని బతుకు పాయల నడుస్తున్న సంసారినీ నడి బజారు కి రప్పించి తుదకి వోటరు గా మార్చి పింఛనీ యిప్పిస్తోంది ప్రతిభ గల ప్రభుత్వం రండి మనుషులారా ఓటరు కండి పోయేదేమీ లేదు రేపటి బతుకు తప్ప! పొయ్యి దగ్గర చతికిలబడిన ఆశయం చరిత్ర ని మంట పెట్టి...
మెలకువ రేవు
పగలంతా సముద్రం మింగిన నా పాదముద్రల కోసం ఈతకొడుతూనే ఉన్నాను రాత్రి కొమ్మకు పూసిన పూలను అక్కడే వదిలేశాను ఇవన్నీ గాజు కళ్ళు కలలు కనే కళ్ళు రాత్రి దేహంపై అతికించబడ్డాయి నన్ను నేను మర్చిపోతాను ఎవరో తట్టి లేపుతారు దేహం లేచి పరిగెడుతుంది కాలాన్ని సెకండ్ల...
Φ (ఫై)
;1. ఏమీలేనితనమంటే శూన్యమేనా? అప్పుడప్పుడు మనసు గుంజాయితి పడుడు సూత్తాంటె గుండె తరుక్కపోతది. బోర్లించిన ఖాళీ గిన్నెల్లోంచి గాలిని ఎల్లగొట్టి నిన్ను నువ్వు నింపుకుంటావు. ఖాళీగా వున్న రెండు మీసాల బ్రాకెట్లు ఎప్పటికీ నిన్ను ప్రతిబింబిస్తూనే వుంటది. 2...
దేవుడిని చూశాను
గుళ్ళల్లో దేవుడున్నాడంటే అన్ని గుళ్ళూ తిరిగాను గొంతు పోయేదాకా పిలిచాను..! నిరాశతో వెనుదిరిగిన నాకు మెట్లమీద అయ్యా ఆకలి అంటూ దీనంగా అర్ధిస్తున్న గొంతొకటి వినపడింది… ఆ వేదనా భరితమైన గొంతులో దేవుడిని చూశాను! పెద్దపెద్ద మేడల్లో, మిద్దెల్లో, ఘనంగా...
పద్యాన్ని పట్టుకో…
ఉదయం కిటికీ తలుపులు తెరవమని ఒకటే గోల ప్రేమగ కొడుతూనే ఉన్నావ్ తీరా తలుపు తీశాక నువ్వు మాయం నీ వాసన ఆకుపచ్చ హృదయపు జాడ కన్ను కొడుతున్న గాలి రాత్రంతా జోరుగా కురిశావ్ తలుపు వేసి కూర్చున్నా కిటికీ అద్దాల నిండా నువ్వే స్పర్శ యేటి కాలువ స్పర్శ సెగ లాంతరు...
పక్కటెముకల మద్దె యుద్ధం
సరిగ్గా అప్పుడే మొదలవుతుంది యుద్ధం… కుళ్ళినపండు మీద ఈగ వాలినప్పుడు ఎంగిలాకు కాడ పందులు రెండు కొట్లాడుతున్నప్పుడు… ఎందుకున్నాయి కళ్ళు.. ఎండిన ఈ దేహానికి? మెతుకు చూసినప్పుడల్లా… పేగులు కత్తులవుతుంటాయి..! సొంగ కార్చి కార్చి...
అక్షరాలే ఆసరా…
చేయి అలా చాస్తే…. నోటి మాటగా ధ్వనిస్తే.. కొల్లల కరెన్సీ కట్టలు!! తుప్పట్టిన ఇనుప బీరువాల బందీలయి మట్టి బొరియల చీకటి గూళ్లల్లో నా నా జీవుల విసర్జకాల పెంటల్ని ప్రీతిగా మెక్కి పొర్లాడి దుర్గంధాల క్రిముల బురద నంటిన వరాహ స్వాముల తనువుల్లాగా...
చియ్యకూరల పాట
ఎర్రని ఎండలో పెయ్యినిండ సల్లని చెమటలు పట్టంగ ఎన్నో ఈదులను దాటివచ్చిన పచ్చి ఈతబరిగెల మోపువైతవు ఈతకర్రల తలలను పెద్దకొడవలితో రెండుపాయలుగ దువ్వడం తాతలకాలం నుండి వస్తున్న విద్దె నీకు నువ్వు సిగ ముడిచి నెత్తిన కొప్పుపుల్ల చెక్కితే నలుపులోని అందమంతా నీ...
అప్పటికి మిగిలేది…
కొన్నివేల సంవత్సరాల తర్వాత… భూమి పొరల్లో కుప్పలు కుప్పలుగా శవాలు ఏ అణ్వాయుధ పరిశోధనల మహా ఫలమో! బొబ్బలు చూస్తే అతినీలలోహిత కిరణాలు శరీరాల్ని చీల్చినట్లున్నాయి! మిగిలినవి? ఎవరెస్టు కరిగి తనలో కలిపేసుకుందేమో! విసుగొచ్చి ఏ మహాసముద్ర సునామీ...
విడి విడి ఊహలు
ఎక్కలేని చెట్టు ఆకాశం మీద ఎక్కడో పచ్చగా, అంతెత్తున సూరీడ్ని కొన్ని పసిడి కాంతుల్ని ఇస్తాడేమో అడగాలనిపిస్తుంది చుక్కల్ని మొయ్యలేక ఆకాశం కొన్ని మనుషుల శరీరాల్లోకి తాపడం చేసినట్లుంది స్వేద బిందువులివిగో సూర్య వర ప్రసాదితాలు! జాలర్లు చేపల వలల్ని ఖాళీగా...
నేనో సముద్రం…
నీ చేరువలో నేను సముద్రాన్నై ఎగసిపడుతుంటాను గుండెల్లో కలల అలలు.. ఎడతెరిపి లేకుండా! ఒక్కో కలా ఒక్కో ముత్యమై లోలోపల దాగుంటుంది… నీ చెంతలేని క్షణాల్లో తవ్వుకుంటాను ఆ అపారనిధిని! నిశ్శబ్దం అనేది ఎరుగని నా హృదయం ఆల్చిప్పలను తాకి ప్రతిధ్వనిస్తుంది...
స్నేహాక్షరం
మన మధ్య ఉన్నది వెన్నెలమడుగే దోసిళ్లతో తోడి పారేద్దామనుకోకు వెలుగుచిరునవ్వు వెలిగించుకొని మాటలు పంచుకుందామనుకుంటేమాత్రం స్నేహవంతెన మీదుగా రా నీకోసం నీ స్నేహం కోసం రెప్పలకి చూపుల దీపతోరణం కట్టి స్వాగతిస్తూనే ఉంటాను ఒకనాడు స్నేహహస్తాన్ని చాపి...
అమ్మ బయలెల్లినాది
ఆకాశంలో సగమే గానీ, విడిపోయిన అన్నదమ్ముల చట్టసభలో మాత్రం నీ మెత్తటి పాదాలకి ఇంత జాగా దొరకలేదు చూపుడువేలు మీది సిరాచుక్కలో లింగవివక్ష నీడ, సాధికారతకు అర్ధం చెరిపిన నిఘంటువులో బుగ్గన చుక్కపెట్టుకుని కిసుక్కున నవ్వుతుంది రాజకీయం ఎక్కడైనా ఒకటే అని...
లెక్క తప్పింది!
వాడు పెగ్గు తర్వాత పెగ్గు తాగుతాడు తాగి ఊయలలూగుతాడు ఊగి నేలపై పొర్లుతాడు వాడికి పగలూ రాత్రీ తేడా లేదు ఆమెకు మనసు మనసులో ఉండదు ఫోన్ చేస్తుంది మాట్లాడేది వాడు కాదు వాడి ఆనుపానులు ఎవరో చెబుతారు ఆమె బలవంతాన అలల్ని కంట్లోనే నిలిపి అతడి కోసం వెళ్తుంది...
‘మర్మ’ సంభాషణ
బాల్యం గుర్రం ఎక్కి ఊగే పసిదనం పద్యాన్ని ఆకాశం నదిలో కదిలే దూదిమబ్బుల చేపపిల్లలను పట్టుకొని బుట్టలో వెయ్యాలనుకునే అమాయకత్వాన్ని గాలి ఉయ్యాలలో తూనీగల రెక్కలమీద ఎగిరే చంచల బాల్యాన్ని ఉరుకులు పెట్టే ఉడతలతో చెంగుచెంగున దూకే కుందేళ్ళతో కబుర్లు చెప్పే...
గొలుసు
పిల్లల ముచ్చట కాదనలేక కుక్కపిల్లనయితే కొన్నాను గానీ దాన్ని చేత్తో పట్టుకోవడమంటే చెప్పలేనంత భయం నాకు. నా అవస్థ చూడలేక దాని మెళ్ళో ఓ గొలుసు వేసి ‘”ఇహ లాక్కెళ్ళండ”న్నాడు షాపువాడు. అది కూడా తెగ సంబరపడిపోతూ తోకూపుకుంటూ బయల్దేరింది నా...
సర్కార్ టు ది పవరాఫ్…
కాకిరెట్టలోంచి జారిన ముషిడిక విత్తనం పుట్టుకతోనే తనపని మొదలెట్టింది కళ్ళు పారించిన మేర వేరుతన్నడం ముట్టితో నేల తవ్వడంఎక్కడెక్కడి సుస్థిరాల్నీఅస్థిరాలు చెయ్యడం అస్థిరాల్ని ఆస్తి ఖాతాలో జమ చేయడం ఇక్కడి గంగానదీ బ్రిటిష్ వాడి కన్నూ కలిపీ ఓ వింత రసాయనం...
సృష్టి స్వప్నం
కవీ మళ్లీ కొత్తగా ఈ కుట్ర గొడవేంటీ?’’ కుట్ర కొత్త కాదు గొడవ అంతకంటే కాదు ఆదియందూ కుట్ర కలదు అంతమందునూ కుట్ర కలదు వెలుతురు పంచడానికి కిరణాలతో ఆకాశం గొంతు చీల్చే సూర్యుడు భూమి నుదిటిపైని చెమటతో సంగమానికి.. మేఘాన్ని కరిగించి చిప్పిల్లే చినుకు పచ్చదనం...
నా కవిత
అల్లరి మాని బుద్ధి గా అఆ లు వ్రాసుకున్నా దేముడు మాస్టారికి నా కవిత చూపించా ఇంకా.. నేలను తాకే చినుకులో ఆఖరి సెకను సందడి ఆకు తనపై వ్రాయించుకున్న మంచుబిందువుల ప్రేమలేఖ పొద్దుపొద్దున్నే విచ్చుకున్న పువ్వుకు భ్రమరం చేసే వాగ్దానం ఇంకా కన్నిప్పని కూనకు...
ఎప్పటిలానే…
సాయంత్రానికి…. నిస్సత్తువను క్యారియర్ బ్యాగులో మోసుకుంటూ ఖాళీయైన టాటా గ్లూకోజ్ గ్లాసులా ఇంటికొస్తాను అప్పటి వరకు చూపులను ఇంటి గేటుకు అతికించుకున్న పిల్లలు నాన్నా…అంటూ నలిగిన చాక్లెట్ రేపర్లలా చుట్టుకుంటారు ఇంతకీ…వారి ప్రేమ నా మీదా...
రాయలోరి తోటలో
చీకటి మంటల చిక్కటి మసితో పొగచూరి పోయింది వెన్నెల వంచన గాయాల నెత్తుటి ధారలు గడ్డ కట్టి మట్టి కొట్టుకుపోతున్నాయి పాతిపెట్టిన నమ్మకానికి నివాళులర్పిస్తూ… చిన్నప్పుడు ఊయలలూపిన మర్రిమాను ఊడలు ఊరితాళ్లు పేనుతున్నాయు ఒకటే ఉక్కపోత… ఎడారి బ్రతుకులో...
పాఠం చెప్పలేనని నేనెలా అనగలను?
నెల రోజులుగా నీరసంగా ఉన్న నీలి కళ్ళ అబ్బాయిలో నిన్ననే ఉత్సాహం తొంగి చూసింది పోయిన వారమే నల్ల అమ్మాయిలో కొత్త వెలుగులు నాట్యం చేసాయి నిత్యం చిర చిర లాడే చిన్నోడు ఇప్పుడే నవ్వాడు అమ్మ నాన్న లేని అమ్మడి విచార వదనంలో వెలుగు రేఖలు పెదాలను నేడే ముద్దాడాయి...
కవనాశ్రువులు
నా అక్షరాలు దైవాంశ సంభూత భూతాలు , నా పదాలు దింపుడు కళ్ళపు పిలుపులు, నా వాక్యాలు సజీవ శిలాజ సామ్రాజ్యాలు, నా పంక్తులు మృతామృత పిండాలు, నా శబ్దాలంకారాలు ఉత్కృష్ఠ శవాలంకారాలు, నా స్వరాలు సైకీ సహస్రాల సరాగాలు, నా రాతలు రోషాక్ సిరా మరకలు, నా పలుకులు...
ఎగురుతూనే వుండు
గర్వంగా గౌరవంగా కిందకు చూడకుండా నీలి మేఘాల్లోకే చూస్తూ ఆడీ కార్లమీదా కలలకందని ఫ్లై ఓవర్లమీదా అధికారుల బంగ్లాల మీదా గోడలు పట్టకుండా మెరిసే యల్ ఈడీ తెరల మీదా యఫ్ యమ్ రేడియోలమీదా జనావాసాల్లో నిలిచిన మద్యందుకాణాలపైనా గుండెలుప్పొంగేలా కురిసే భక్తిని...
రాత మారిన అక్షరం
అక్షరమంటే కలువ పూల చెరువులో స్నానమాడే అందమైన చందమామ గుండె గూడు నుండి ఒకటొక్కటిగా జారి పడే తేనె చుక్క నరాల తీగలపై చిగురించి మనసులో విరిసే మల్లెపూల పందిరి ఆకాశం నల్ల చీరపై తళుకు మెరుపుల జలతారు అంచు గుండె ఉలిక్కిపడేలా నిరంతర చైతన్యాల ఉరుముల ఫెళ ఫెళ...
గోడ కుర్చీ
కొండలాంటి వాడివి కావొచ్చు లంకంత ఇల్లు లాంటి వాడివీ కావొచ్చు సముద్రం లాంటి గోడ మీద మాత్రం. నువ్వొక వలకి చిక్కిన జాలరివి…!! 1 పెరటి గోడమీద నాచు, యవ్వనం కాలేస్తే జారిపోయే బొమ్మల్ని చూపిస్తుంది..! ఇంటి ప్రహరీ గోడ, ఏళ్ళతరబడిగా ఊసరవిల్లిలాంటి...