కవిత

సర్కార్ టు ది పవరాఫ్…

కాకిరెట్టలోంచి జారిన ముషిడిక విత్తనం పుట్టుకతోనే తనపని మొదలెట్టింది కళ్ళు పారించిన మేర వేరుతన్నడం ముట్టితో నేల తవ్వడంఎక్కడెక్కడి సుస్థిరాల్నీఅస్థిరాలు చెయ్యడం అస్థిరాల్ని ఆస్తి ఖాతాలో జమ చేయడం ఇక్కడి గంగానదీ బ్రిటిష్ వాడి కన్నూ కలిపీ ఓ వింత రసాయనం...

సృష్టి స్వప్నం

కవీ మళ్లీ కొత్తగా ఈ కుట్ర గొడవేంటీ?’’ కుట్ర కొత్త కాదు గొడవ అంతకంటే కాదు ఆదియందూ కుట్ర కలదు అంతమందునూ కుట్ర కలదు వెలుతురు పంచడానికి కిరణాలతో ఆకాశం గొంతు చీల్చే సూర్యుడు భూమి నుదిటిపైని చెమటతో సంగమానికి.. మేఘాన్ని కరిగించి చిప్పిల్లే చినుకు పచ్చదనం...

నా కవిత

అల్లరి మాని బుద్ధి గా అఆ లు వ్రాసుకున్నా దేముడు మాస్టారికి నా కవిత చూపించా ఇంకా.. నేలను తాకే చినుకులో ఆఖరి సెకను సందడి ఆకు తనపై వ్రాయించుకున్న మంచుబిందువుల ప్రేమలేఖ పొద్దుపొద్దున్నే విచ్చుకున్న పువ్వుకు భ్రమరం చేసే వాగ్దానం ఇంకా కన్నిప్పని కూనకు...

ఎప్పటిలానే…

సాయంత్రానికి…. నిస్సత్తువను క్యారియర్ బ్యాగులో మోసుకుంటూ ఖాళీయైన టాటా గ్లూకోజ్ గ్లాసులా ఇంటికొస్తాను అప్పటి వరకు చూపులను ఇంటి గేటుకు అతికించుకున్న పిల్లలు నాన్నా…అంటూ నలిగిన చాక్లెట్ రేపర్లలా చుట్టుకుంటారు ఇంతకీ…వారి ప్రేమ నా మీదా...

రాయలోరి తోటలో

చీకటి మంటల చిక్కటి మసితో పొగచూరి పోయింది వెన్నెల వంచన గాయాల నెత్తుటి ధారలు గడ్డ కట్టి మట్టి కొట్టుకుపోతున్నాయి పాతిపెట్టిన నమ్మకానికి నివాళులర్పిస్తూ… చిన్నప్పుడు ఊయలలూపిన మర్రిమాను ఊడలు ఊరితాళ్లు పేనుతున్నాయు ఒకటే ఉక్కపోత… ఎడారి బ్రతుకులో...

పాఠం చెప్పలేనని నేనెలా అనగలను?

నెల రోజులుగా నీరసంగా ఉన్న నీలి కళ్ళ అబ్బాయిలో నిన్ననే ఉత్సాహం తొంగి చూసింది పోయిన వారమే నల్ల అమ్మాయిలో కొత్త వెలుగులు నాట్యం చేసాయి నిత్యం చిర చిర లాడే చిన్నోడు ఇప్పుడే నవ్వాడు అమ్మ నాన్న లేని అమ్మడి విచార వదనంలో వెలుగు రేఖలు పెదాలను నేడే ముద్దాడాయి...

కవనాశ్రువులు

నా అక్షరాలు దైవాంశ సంభూత భూతాలు , నా పదాలు దింపుడు కళ్ళపు పిలుపులు, నా వాక్యాలు సజీవ శిలాజ సామ్రాజ్యాలు, నా పంక్తులు మృతామృత పిండాలు, నా శబ్దాలంకారాలు ఉత్కృష్ఠ శవాలంకారాలు, నా స్వరాలు సైకీ సహస్రాల సరాగాలు, నా రాతలు రోషాక్ సిరా మరకలు, నా పలుకులు...

ఎగురుతూనే వుండు

గర్వంగా గౌరవంగా కిందకు చూడకుండా నీలి మేఘాల్లోకే చూస్తూ ఆడీ కార్లమీదా కలలకందని ఫ్లై ఓవర్లమీదా అధికారుల బంగ్లాల మీదా గోడలు పట్టకుండా మెరిసే యల్ ఈడీ తెరల మీదా యఫ్ యమ్ రేడియోలమీదా జనావాసాల్లో నిలిచిన మద్యందుకాణాలపైనా గుండెలుప్పొంగేలా కురిసే భక్తిని...

రాత మారిన అక్షరం

అక్షరమంటే కలువ పూల చెరువులో స్నానమాడే అందమైన చందమామ గుండె గూడు నుండి ఒకటొక్కటిగా జారి పడే తేనె చుక్క నరాల తీగలపై చిగురించి మనసులో విరిసే మల్లెపూల పందిరి ఆకాశం నల్ల చీరపై తళుకు మెరుపుల జలతారు అంచు గుండె ఉలిక్కిపడేలా నిరంతర చైతన్యాల ఉరుముల ఫెళ ఫెళ...

గోడ కుర్చీ

కొండలాంటి వాడివి కావొచ్చు లంకంత ఇల్లు లాంటి వాడివీ కావొచ్చు సముద్రం లాంటి గోడ మీద మాత్రం. నువ్వొక వలకి చిక్కిన జాలరివి…!! 1 పెరటి గోడమీద నాచు, యవ్వనం కాలేస్తే జారిపోయే బొమ్మల్ని చూపిస్తుంది..! ఇంటి ప్రహరీ గోడ, ఏళ్ళతరబడిగా ఊసరవిల్లిలాంటి...

సాగర ఘోష

అక్కడ కొన్ని బతుకు కెరటాలు వున్నట్టుండి విరిగి ఓటి నత్తగుల్లలౌతాయి! కొన్ని సైకత చిత్రాలు నీట మునిగి చెదరిన రేణువులుగా మిగులుతాయి!   అక్కడ కొన్ని దేహాలు ఉప్పులో నానబెట్టిన జల పుష్పాలౌతాయి! కొన్ని రాత్రులు కడలి లోతుల్లో వెలుగు ముత్యాలకై చరించే...

నువ్వు గుర్తొస్తావు

   ఎందుకంటే ఏం చెప్పను గుర్తొస్తావు అంతే. క్రితం వరకూ నిద్రపోయిన గాఢత అంతలోనే చెదిరి నిద్ర మంచం మీదే కనులు విచ్చుకున్నట్టు నువ్వు గుర్తొస్తావు. ఆకాశంలోని మేఘాలు నల్లని పాండ్స్ పౌడరు అద్దుకుని క్యుములోనింబస్ మేఘాలై గొర్రెల గుంపులా అన్నీ ఒక చోట...

స్నేహితుడు

నీపై నిప్పుల వర్షం కురుస్తున్నప్పుడు జలపాతాన్ని గొడుగులా ఎత్తేవాడు నీవు ఆశయం కోసం ఒంటరివైనప్పుడు నమ్మకంతో నిన్నలుముకొని సమూహమయ్యేవాడు నువ్వు కత్తుల వంతెన దాటాల్సి వచ్చినప్పుడు విచ్చుకత్తుల్ని పువ్వొత్తుల్లా మార్చేటోడు నువ్వు అగాధంలోకి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.