పదకొండవ శతాబ్దం లోని పారిశ్రామికీకరణ ఇంగ్లాండ్ లో పెను మార్పులు తెచ్చింది. ఒకవైపు సంప్రదాయం, మరొకవైపు అభ్యుదయం సంఘర్షణను, సాహిత్యం లో కూడా మార్పును తెచ్చాయి. ఈ వేగంలో మార్పుతో పోటీపడలేక మానవుడు అంతర్ముఖుడయ్యాడు. వ్యక్తిగత సంబంధాలు, గృహ సంబంధమైన...
పడమటి రాగం
ఆధునిక నాటకానికి నాంది
పలికిన వాడు: బెర్నార్డ్ షా
ఆంగ్ల నాటక పితామహుడైన విలియం షేక్స్పియర్ తర్వాత అంతటి పేరుగాంచిన నాటక రచయిత జార్జ్ బెర్నార్డ్ షా. 1856 జులై 16న ఐర్లాండ్ లోని డబ్లిన్ లో జార్జ్ బెర్నార్డ్ షా ఒక పేద కుటుంబం లో జన్మించాడు. తల్లి సంగీత అధ్యాపకురాలు అయితే తండ్రి ఆల్కహాల్ కు బానిస...
లోతులున్న నవ్వులు: మార్క్ ట్వెయిన్
మనమందరం చిన్నతనంలో టామ్ సాయర్ కథలు చదివి వారిలో మనలను వూహించుకుని స్వప్న జగత్తులో విహరించిన వారమే. వాటన్నిటినీ వ్రాసింది మార్కెట్వెయిన్ అని ఎంతమందికి గుర్తుంది? మార్క్ ట్వెయిన్ గా ప్రసిద్ధి పొందిన శామ్యూల్ లాంగోర్న్ క్లెమెన్స్ 1835 నవంబర్ 30 న...
అస్తిత్వవాద ఘర్షణకు
నిలువుటద్దం కాఫ్కా
జర్మన్ ల ప్రకారం యూదు, చెక్ ల ప్రకారం జర్మన్ అయిన ఫ్రాంజ్ కాఫ్కా 1883 జూలై 3న ప్రేగ్ నగరంలో మధ్య తరగతి కుటుంబంలో జన్మించాడు. న్యాయవాద శాస్త్రాన్ని చదివి ఇన్సూరెన్స్ కంపెనీ లో ఉద్యోగం చేస్తూ విడి సమయంలో రచనలు చేశాడు. తన రచనలలో అస్తిత్వ సంఘర్షణను...
రష్యాలో నిరంకుశత్వం మీద
తిరుగుబాటు బావుటా ‘అనా అఖ్మతొవా’
“చీకటిలో అన్నిటినీ భయమే తాకుతుంది వెన్నెలనీ గొడ్డలి వేటుకు లాగుతుంది గోడ వెనుక ఓ దుశ్శకున శబ్దం: దయ్యమో, దొంగో, ఎలుకో…” లెనిన్ మరణం తర్వాత స్టాలిన్ పాలన రష్యా ప్రజలను భయాందోళనలో ముంచెత్తింది. ప్రజల బాధలకు, మరణానికి కారణమైంది. అతని దురహంకార...
సహజ కథా, నాటక రచయిత ఎంటన్ చెఖోవ్
ఒక పట్టణంలోని ఓ ధనికుడి ఇంట్లో ఒక పల్లెటూరి కుర్రాడు పనికి కుదురుతాడు. ఆ యింట్లో యజమానురాలు పెట్టే కష్టాలను భరించలేక వర్ణిస్తూ తన తాతకు ఉత్తరం రాస్తాడు. వచ్చి తీసుకుపొమ్మని అభ్యర్ధిస్తూ రాసిన ఉత్తరం పై తన తాత చిరునామాను సరిగా రాయలేకపోతాడు. తాత...
ప్రేమ విలువను గానం
చేసిన నవ్య కవులు (2)
వడ్స్ వర్త్ తర్వాత పేర్కొనదగిన ముఖ్యమైన నవ్య కవులు లార్డ్ బైరన్, పెర్సీ బిషీ షెల్లీ, జాన్ కీట్స్. జార్జి గార్డెన్ బైరన్ (1788 – 1824) రెండు విభిన్న పార్స్వాలు గల వ్యక్తి, కవి. ఓ వైపు విచ్చలవిడితనం మరోవైపు కవిత్వం పట్ల ప్రేమ అతన్ని ఒక వ్యక్తిత్వం...
సామాన్యుడిని హీరో చేసిన
నవ్య కవిత్వ యుగం-1
(విలియం బ్లేక్, కోలరిజ్, వర్డ్స్ వర్త్) పారిశ్రామిక విప్లవం తర్వాత చాలామంది పల్లె వాసులు, రైతులు పట్టణాల్లో కార్మికులుగా మారిపోయారు. నగరీకరణ క్రమంలో జరిగిన ఆక్రమణలతో మనిషి ప్రకృతికి దూరమైపోయాడు. ఒక కృత్రిమత్వం, అసహజత్వం సమాజమంతా అల్లుకుపోయింది...
అమెరికా నాటకంలో మేలు మలుపు
యుజిన్ ఓ నీల్ (1888 -1953)
నటనే జీవితమూ వ్యసనమూ అయిన ఓ తండ్రి, భయంతో మత్తుమందుకు బానిస అయిన తల్లి, అగమ్య గోచరమైన జీవితం, దెబ్బతిన్న బాల్యం, విసుగు, కోపం, జీవితం పట్ల ద్వేషం, ఒక ఆత్మహత్యా ప్రయత్నం, తనకేం కావాలో తనకే తెలియనితనం, జీవితంతో పోరాటం, నాటక రచనలో అనూహ్య విజయం...
ఆంగ్ల సాహిత్యంలో స్త్రీ ప్రవేశం: జేన్ ఆస్టెన్
ఆంగ్ల నవలా చరిత్రలో స్త్రీ వాద రచనను ప్రారంభించిన రచయిత్రి జేన్ ఆస్టెన్ (1775 – 1817). స్త్రీ విముక్తి, స్త్రీ స్వేచ్ఛకు సంబంధించిన విషయాలను గురించి వ్రాయక పోవచ్చు కానీ స్త్రీల మనోభావాలు గురించి మొదటగా వ్రాసిన రచయిత్రి జేన్ ఆస్టెన్...
వైవిధ్య భరిత కథా రచయిత గీ ద మోపస
నాటక రచయితకు, నవలా రచయితకు లేని పరిమితులు కథారచయితకు చాలా ఉంటాయి. తక్కువ వ్యవధిలో జీవితాన్ని చిత్రీకరించాల్సిన కష్టమైన బాధ్యత నాటక రచయితదైతే, తక్కువ నిడివిలో జీవితాన్ని రసవంతంగా చిత్రించడం కథా రచయిత బాధ్యత. దీనిలో పాత్రలను, సంభాషణలను, పటిష్టమైన...
మృత్యువును ప్రేమించి జయించిన కవయిత్రి
ఎమిలీ డికిన్సన్ (డిసెంబర్ 10, 1830 – May 15, 1886) అందరికీ బ్రతుకంటే తీయగా, మృత్యువంటే చేదుగా, భయంగా ఉంటుంది. అవును, జీవితాన్ని ప్రేమించని వారెవరు చెప్పండి. అలాగని మృత్యువును ఆపగలవారూ లేరు. ఏదో నాడు తలుపు తట్టి పలకరించే అనుకోని అతిధే అయినా ఆ పేరు...
కధా రచనలో మహా మాంత్రికుడు ఓ.హెన్రీ
కథ అనగానే మనకు టాల్స్టాయ్, చెహోవ్, ఎడ్గర్ ఏలన్ పో, ఆస్కార్ వైల్డ్, సాకి, మపాసా, హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్ లాంటి కధకులు గుర్తొస్తారు. కధ లాటి జీవితాన్ని అనుభవించి కొత్త తరహా కధను అందించిన ఓ.హెన్రీ (1862–1910) అసలు పేరు ‘విలియం సిడ్నీ పోర్టర్’ ...
పెట్టుబడి నాటకం బయట పెట్టిన బ్రెఖ్ట్
‘తినే రొట్టె నెలా కాల్చాలో న్యాయమనే రొట్టెనీ ప్రజలే కాల్చాలి తాజాగా, మొత్తంగా, రోజూ – (బ్రెఖ్ట్, ద బ్రెడ్ ఆఫ్ ది పీపుల్ కవిత) కదా-న్యాయ మందరికీ సమానంకదా? కానీ పెట్టుబడిదారీ సమాజం లో న్యాయం అలా వుండదు.అది ధనికులకే అందుబాటులో వుంటుంది...
పెను విషాదం మోసిన సమవాద రచయిత్రి
వర్జీనియా ఉల్ఫ్ చాలామందికి కేవలం ఒక స్త్రీ వాద రచయితగా విషాద జీవితాన్ని మోసిన రచయిత్రి లాగే పరిచయం. సాహిత్యాన్ని ఎంతో తపన తో ప్రేమించి ఎందరినో ఉత్సాహపరిచి ఒక స్త్రీగా స్త్రీల కోసం సాహిత్యాన్ని రూపకల్పన చేసిన మహా రచయిత్రి ఆమె. 1822లో...
మానసిక సంఘర్షణా విశ్లేషకుడు దొస్తొయవిస్కీ
మానవ మనస్తత్త్వ శాస్త్రజ్ఞుడిగా పేరొందిన నవలాకారుడు దొస్తొయవిస్కీ 1821 లో సెయింట్ పీటర్స్బర్గ్ లో జన్మించాడు. పుష్కిన్, గోగోల్, అగస్టీన్, షేక్స్పియర్, డికెన్స్, బాల్జాక్, హెగెల్ వంటి ఎందరో రచయితలు, తత్వవేత్తల ద్వారా ప్రభావితుడై దొస్తొయవిస్కీ మానవ...
స్త్రీ స్వేచ్ఛకు వూపిరులూదిన ఇబ్సెన్ నాటకం!
సాహిత్యం సమాజ సమస్యల్ని ప్రతిబింబించినప్పుడే ఎక్కువగా ప్రజలకు చేరుతుంది. కథారచన, నవల, నాటకం ఈ మూడు ప్రక్రియలు సాహిత్యాన్ని ప్రజలకు మరింత చేరువచేస్తాయి. నాటక రచన నవలా రచనకన్న సంక్లిష్టమైనది. నవలారచయితకు పరిథి చాలా ఎక్కువ. నాటక రచయిత తక్కువ సమయంలో...
వ్యక్తి స్వేచ్ఛా గీతం: వాల్ట్ విట్మన్ ‘సాంగ్ ఆఫ్ మై సెల్ఫ్’
కవిత్వమెప్పుడూ ఒక ఆశ్చర్యకరమైన ఆసక్తికరమైన సృజన. ఏ మాట, ఏ వాక్యం ఎప్పుడు ఎలా కవిత్వమౌతుందో తెలియదు. కవిత్వ రీతులెపుడూ ఏదో ఒక తరాన్ని అనుసరిస్తూనో, విడివడుతూనో, ప్రభావితం చేస్తూనో వుంటాయి. ప్రకృతి, సమాజం, మనుషులు, తాత్వికత, దైవ భక్తీ, ఒకోసారి దేశం...