పాతసంచికలు

శ్రామికుడు చరిత్ర చదివితే

థేమ్స్ ఏడు ద్వారాలను నిర్మించిందెవరు? చరిత్ర పుటలన్నీ రాజుల పేర్లుతోనే నిండిపోయాయి రాజులెప్పుడైనా రాళ్ళెత్తారా? పదే పదే ధ్వంసమయిన బాబిలోన్ నగరాన్ని పునర్నిర్మించిందెవరు? ధగధగ మెరిసే లైమా గృహాలలో… కట్టిన వారు ఒక్క పూటైనా వున్నారా? చైనాగోడ...

ఇస్మార్ట్

‘గిందాకటి కాన్నించీ  సూత్తన్నా ఏందా సూపు ‘ ‘కాదే నిన్ను సూత్తే ఏమీ సమజవడం లే. నువ్వసలు అప్పటి మడిసివేనా అని’ ‘కాక అపుడెందో గిపుడూ అదే . నువ్వూరకే అనుమానిస్తన్నావ్. నాకర్ధమైంది నీకేటైందో’ ‘ఏటైందేటి పిచ్చి లేత్తాంది సంపి ముక్కలు సేత్తామనిపిత్తాంది...

కుల మత రహిత అస్తిత్వం కోసం…. !

 ‘మిత్రులారా ! నమస్కారం .. మాది కులాంతర, మతాంతర వివాహం .. వేరు వేరు సామాజిక నేపథ్యాలు ఉన్న మాలో ఒకరు మతాన్ని నమ్మినా, మరొకరు ఏ మతాన్ని నమ్మకున్నా మా పిల్లల విషయంలో మేము ఎటువంటి కుల, మత విశ్వాసాలను అనుసరించడం లేదు.. స్కూల్‌ అప్లికేషన్‌లో తప్పనిసరిగా...

అదో సరదా!

బూర్జువా వర్గానికి ఒకే ఒక సరదా వుంటుంది. అన్ని సరదాలను పాడు చేయడం దాని సరదా. ఇది ఏ ‘మహనీయుడో’ చెప్పిన మాట కాదు. ఇప్పుడు అంతగా ప్రచారంలో లేదు గాని, ‘68 తరం వేనోళ్ల నానిన ‘ఎడమ చేతి నిఘంటువు’ (లెఫ్ట్ హ్యాండ్ డిక్షనరీ) చమత్ కారాల్లో ఇదొకటి. స్వేచ్ఛ ఒక...

పర్యావరణ విధ్వంసం మీద పసివాళ్ల తిరుగుబాటు

“మా భవిషత్తును దోచుకుంటున్నారు” అని ప్రపంచ నాయకులను నిలదీసింది స్వీడన్ దేశానికి చెందిన 15 ఏళ్ళ గ్రెటా థున్బెర్గ్,(Greta Thunberg). పోలెండు లో కటొవిస్ లో  జరిగిన 24 వ ఐక్య రాజ్య సమితి ‘క్లైమేట్ సమ్మిట్’  ప్లీనరీలో మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్యం...

మనిషీ మరణం

అరటి తోటలో ఐదో చాలు కూడా అతడు గొడ్డలితో శుభ్రం చేశాడు. ఇంకా రెండు చాళ్లు వున్నాయి. వాటిలో కూడా పొదలున్నాయి గాని, అవేమంత సమస్య కాదు. పని తొందరగానే అయిపోతుంది అనుకుంటూ అప్పటి వరకు శుభ్రం చేసిన చాళ్లను తృప్తిగా చూసుకున్నాడు. కాస్త విశ్రాంతి తీసుకుని...

రచయితకు తెలియని ఆత్మకథ

కొన్ని పుస్తకాలను చదువుతుంటే పరిసరాలను మరిచిపోయి, పుస్తకంలో లీనమైపోతాం. అలాంటి పుస్తకం “బేబీ హాల్ దార్- చీకటి వెలుగులు.” ఇదొక బెంగాలీ రచన. “ఆలో-ఆంధారి-బేబి హాల్ దార్” పేరుతో వెలువడింది. తన కథని తాను రాసుకుంటున్నానని...

లోపలి గోడ మీద రాసుకున్న ధ్యానవచనం

లీనాలీనమ్ గడియారం యాజ్ఞవల్క్య రాసుకున్న అంతర్జాల కవిత్వం. హఠాత్తుగా మాయమైన యాజ్ఞి అంతర్జ్వలన కవిత్వం. అతని తుదిశ్వాస వెలిగిన రాగదీపం. అనువాదకుడిగా గుర్తింపు తెచ్చుకున్న యాజ్ఞి తన అంతర్పుటలలో నిత్యం కవిత్వమే రాసుకున్నాడు. చదువరిగా, సంగీతప్రేమికుడిగా...

మృత్యువును ప్రేమించి జయించిన కవయిత్రి

ఎమిలీ డికిన్సన్‍ (డిసెంబర్‍ 10, 1830 – May 15, 1886) అందరికీ బ్రతుకంటే తీయగా, మృత్యువంటే చేదుగా, భయంగా ఉంటుంది. అవును, జీవితాన్ని ప్రేమించని వారెవరు చెప్పండి. అలాగని మృత్యువును ఆపగలవారూ లేరు. ఏదో నాడు తలుపు తట్టి పలకరించే అనుకోని అతిధే అయినా ఆ పేరు...

ఇప్ప పూల కొమ్మల్లో నిప్పు కణికలు

కవిత్వంలో రాజకీయముంటుందా? ఇదేమీ కొత్త ప్రశ్న కాదు. కాలానుగుణంగా కేవలం కవిత్వం మాత్రమే చదివే ప్రతి తరంలోనూ ఉత్పన్నమయ్యే సందేహమే. అయితే అసలు రాజకీయం లేని కవిత్వముంటుందా? అదొక జీవిత భాగంగా ఉన్నపుడు, దానికి చిత్రిక పట్టగలిగింది కవిత్వమే కాగలిగినప్పుడు...

ఒక తమ్ముడు…

మా తమ్ముడు లాంటి తమ్ముడు మీకున్నాడా? ఇలాంటి పిల్లాడు భూమ్మీద ఎక్కడా వుండడంటుంది నానమ్మ. అందరు పిల్లలూ అంతే అంటుంది అమ్మమ్మ. ఈ కాలమే అంత అని. నా రాజే.. అంటుంది అత్త. తాటిరాజు పితూరి.. అని కూడా అత్తే అంటుంది. తాటిరాజు ఎవరని అడిగితే, తాటిరాజుకి...

పూర్తి ‘మంచి’ పూర్తి ‘చెడ్డ’ సాధ్యమేనా?

అరవింద కుమార్, అనంతపురం  (ఉత్తరంలో) ఏమండీ, మనం ఒక విషయాన్ని ‘ఇది మంచీ, అది చెడ్డా’ అని కచ్చితంగా తేల్చగలమా? ‘ఇది నలుపూ – అది తెలుపూ’ అనవచ్చు గానీ, వాటి మధ్య ఆ ‘నలుపు’ రక రకాల స్తాయిల్లో వుంటుంది. అలాగే...

కుల వివక్ష మీద బలమైన బాణం

2018 మార్చి. గుజరాత్ లోని తింబి గ్రామంలో ప్రదీప్ రాథోడ్ అనే ఇరవై ఒక్క ఏళ్ల దళిత యువకుడ్ని అగ్రకులస్తులు ఘోరంగా హత్య చేశారు. గుర్రాన్ని పెంచుకోవడం అతడు చేసిన నేరం. 2018 ఏప్రిల్. రాజస్థాన్ భిల్వారా జిల్లాలో దళితుల పెళ్లి సందర్భంగా పెళ్లి కొడుకు గుర్రం...

ఐదొందల ఎకరాల్లో అపురూప దేవాలయం

ఆంగ్కోర్ వాట్ (Angkor wat) చూడటం జీవితంలో ఖచ్చితంగా తీర్చుకోవాల్సిన ఒక కల. అక్కడకి వచ్చిన వారిలో అన్ని  దేశాల వారు  సమాన సంఖ్యలో కనిపిస్తారు. తాము అంతగా కలగన్న ఆ ప్రదేశాన్ని చూడటానికి  వచ్చిన వారు ఎవరూ  నిరాశపడరు. చూడటానికి  మనస్సు, ఐదు వందల ఎకరాలను...

సోఫియా డి మెల్లో బ్రేయ్నర్  కవితలు నాలుగు

సముద్రపు పగలు ఆకాశంలో సముద్రపు పగలు, అది నీడలతో, గుర్రాలతో, పక్షి ఈకలతో తయారయినది. నా గదిలో సముద్రపు పగలు- అదొక క్యూబ్ అక్కడే నా నిద్రానడక చర్యలు జారుతుంటాయి జంతువుకీ పువ్వుకీ మధ్య, మెడుస్సా మాదిరి. సముద్రంలో సముద్రపు పగలు, మిట్ట మధ్యాన్నం అక్కడ నా...

అబద్ధాలపై అబద్ధాలు – పాలన నవ్వులపాలు.

ఈ మధ్య ముఖ్యమంత్రి చంద్రబాబు గారికి ఓ కొత్త జబ్బు పట్టుకుంది. యీ జబ్బు గతంలోనే వున్నా 2014 లో అనుకోకుండా వచ్చిపడిన అధికారం  ‘అహం బ్రహ్మాస్మి‘ భావనను మరింత పెంచినట్టుంది. తానో రాష్ట్రానికి ముఖ్యమంత్రి ని అనే విషయం మరిచిపోయరా అని జనాలు అనుకునేంత...

అక్షరాలే ఆసరా…

చేయి అలా చాస్తే…. నోటి మాటగా ధ్వనిస్తే.. కొల్లల కరెన్సీ కట్టలు!! తుప్పట్టిన ఇనుప బీరువాల బందీలయి మట్టి బొరియల చీకటి గూళ్లల్లో నా నా జీవుల విసర్జకాల పెంటల్ని ప్రీతిగా మెక్కి పొర్లాడి దుర్గంధాల క్రిముల బురద నంటిన వరాహ స్వాముల తనువుల్లాగా...

మరో చిట్టి సంబరం

ఓహ్, ఎనిమిది నెలలు, 15 సంచికలు. మరో చిట్టి సంబరం. సంతోషంగా చెబుతోంది ‘రస్తా’ మీకు… నూత్న వర్ష శుభాకాంక్షలు. మరింత ఆనందంగా చెబుతోంది ‘రస్తా’ మీకు ‘థాంక్యూ సో.. మచ్’. నిజం చెప్పొద్దూ! అప్పుడు మీతో అనలేదు గాని, పత్రికను నిజంగా మొదలెడతామని మేము...

చియ్యకూరల పాట

ఎర్రని ఎండలో పెయ్యినిండ సల్లని చెమటలు పట్టంగ ఎన్నో ఈదులను దాటివచ్చిన పచ్చి ఈతబరిగెల మోపువైతవు ఈతకర్రల తలలను పెద్దకొడవలితో రెండుపాయలుగ దువ్వడం తాతలకాలం నుండి వస్తున్న విద్దె నీకు నువ్వు సిగ ముడిచి నెత్తిన కొప్పుపుల్ల చెక్కితే నలుపులోని అందమంతా నీ...

మీటింగ్

‘మధ్యాహ్నం కొత్త ప్రిన్సిపాల్ మీటింగ్ పెడతాట్ట గురూ’ – టీ తాగటానికి కాంటీన్ వైపు నడుస్తున్న అయిదుగురు అధ్యాపకులలో ఒకరు. ‘పొద్దునేగా జాయిన్ అయాడు’ – ‘కొత్త బిచ్చగాడు…’ అర్ధోక్తిగా తన ముక్కు నవ్వు నవ్వి ఆగాడు పండితుడు. ‘ఏం చేస్తాట్ట మీటింగ్...

వ్యక్తిత్వ వికాసానికీ బుద్ధుడే శరణం

ఈ రోజు బుద్ధుడి గురించి ఎవరికీ కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. జ్ఞానం కోసంఆయన అంతఃపురం నుండి అనంత ప్రపంచంలోకి, అన్ని బంధాలు వదలి ఏకాకిగా నడచిన వైనం అందరికీ తెలుసు. సకల దుఃఖాలకు మూలం కోరికలేనని; కోరికలను నియంత్రిస్తేనే సంతోష ద్వారాలు తెరుచుకుంటాయని...

ఆ అమ్మాయి..

దాదాపు రెండు సంవత్సరాలవుతుంది. ఆ అమ్మాయిని మాత్రం మరచిపోలేకపోతున్నాను. ఎప్పుడెప్పుడో గుర్తొస్తుంది. కళ్ళు మూసుకోవచ్చు. చెవులు మూసుకోవచ్చు. మనసెలా మూసుకుంటాం చెప్పండి. అందుకే ఆ అమ్మాయి మాటిమాటికీ గుర్తుకొస్తుంది. మనసును కప్పెట్టే మూతలేమైనా ఉన్నాయేమో...

అప్పటికి మిగిలేది…

కొన్నివేల సంవత్సరాల తర్వాత… భూమి పొరల్లో కుప్పలు కుప్పలుగా శవాలు ఏ అణ్వాయుధ పరిశోధనల మహా ఫలమో! బొబ్బలు చూస్తే అతినీలలోహిత కిరణాలు శరీరాల్ని చీల్చినట్లున్నాయి! మిగిలిన‍వి? ఎవరెస్టు కరిగి తనలో కలిపేసుకుందేమో! విసుగొచ్చి ఏ మహాసముద్ర సునామీ...

క్లిక్ క్లిక్

మా రెండో అక్కకి మా ఎవరికీ లేని ఒక అలవాటొచ్చింది.  ప్రతి పుట్టిన రోజుకీ తలంటు, పరమాన్నం గుడి అయ్యాక , తన మజిలీ ఫొటో స్టూడియో కే.  ఏడుగురిలో తనకే ఎందుకొచ్చింది అంటే గుట్టమీది రాంరెడ్డి తాత మనవరాలి స్నేహం కావచ్చు.  అప్పట్లో అది ఖరీదైన వ్యవహారం కదా...

జాతి మూలాల్ని గెలిపిస్తుందీ కవిత్వం

అసలీ పుస్తకానికి “అయినా నిలబడతాను” అని పేరు పెట్టాల్సిందేమో. అంత శిఖరాయమానంగా ఉందా కవిత. “రుచించనప్పుడు ఓ గెలుపు అదృష్టమే అవుతుంది. గెలవడం ఇష్టంలేకపోతే చెప్పు….ఇకముందు ఓడిపోవడానికి ప్రయత్నిస్తాను” అన్న వాక్యాలు మంచు...

అస్తిత్వవాద‍ం ఇంకొన్ని కోణాలు!

(ఇది షాజహానా క‍థల‍ పుస్తకం ‘లద్దాఫ్ని’ పై ఒక సభలో కె. శ్రీనివాస్‍ ప్రసంగ పాఠం, స్కై బాబా రాసి ప‍ంపినది) కధలు విడివిడిగా వచ్చినపుడు రచయితలు కొద్దికొద్దిగా అర్ధమవుతారు. కొన్ని కొన్ని కోణాల్లో తెలుస్తారు. కానీ కొన్ని కథలై తరువాత అదొక...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.