సమీక్ష

జాతి మూలాల్ని గెలిపిస్తుందీ కవిత్వం

అసలీ పుస్తకానికి “అయినా నిలబడతాను” అని పేరు పెట్టాల్సిందేమో. అంత శిఖరాయమానంగా ఉందా కవిత. “రుచించనప్పుడు ఓ గెలుపు అదృష్టమే అవుతుంది. గెలవడం ఇష్టంలేకపోతే చెప్పు….ఇకముందు ఓడిపోవడానికి ప్రయత్నిస్తాను” అన్న వాక్యాలు మంచు...

అస్తిత్వవాద‍ం ఇంకొన్ని కోణాలు!

(ఇది షాజహానా క‍థల‍ పుస్తకం ‘లద్దాఫ్ని’ పై ఒక సభలో కె. శ్రీనివాస్‍ ప్రసంగ పాఠం, స్కై బాబా రాసి ప‍ంపినది) కధలు విడివిడిగా వచ్చినపుడు రచయితలు కొద్దికొద్దిగా అర్ధమవుతారు. కొన్ని కొన్ని కోణాల్లో తెలుస్తారు. కానీ కొన్ని కథలై తరువాత అదొక...

చినుక్కింద దాక్కున్న మట్టి పూవు

కవి శిలాలోలిత ఈ పుస్తకం ముందు మాటలో ఒక మాటన్నారు. “ప్రేమ, విరహం, శృంగారం, వియోగం స్త్రీలకు నిషిద్థవిషయాలని సమాజం భావిస్తోంది. స్త్రీల  రచనల్లో అవి ఏ మాత్రం కనబడినా ఎవరై వుంటారు? అని డైరెక్ట్ , ఇండైరెక్ట్ గా చర్చిస్తూ వుంటారు. అది...

దెబ్బ వేసినా, దెబ్బ తిన్నా శ్రావ్యమే

కొండేపూడి నిర్మల కవిత్వం అందరికీ సుపరిచితం. ఆమె కథలు కూడా పరిచితమే. ఆ రెండు సృజనాత్మక ప్రక్రియలు. అంటే కల్పన వెనక, అలంకారాల వెనక, కథ వెనక,  పాత్రల వెనక, పదచిత్రాల వెనక ఎంతో కొంత దాక్కునే అవకాశం ఉంటుంది. కానీ పత్రికా శీర్షిక్ (కాలమ్ ) సంగతి వేరు...

ప్రవాహం వెనక్కి నడిచొస్తుందా ?

చారిత్రిక విభాత సంధ్యల మానవ కధ వికాసమెట్టిది ? అన్నాడొక మహాకవి. అంటే జీవన పరిణామక్రమంలోమానవుడు సాధించిన పురోగతి ఏమిటన్నది ఆతని ఊహ కావొచ్చు.  నిజమే మనిషి ప్రయాణాన్ని మించిన వికాస రహస్యం ఇంకెక్కడ దాక్కుంటుంది ? ఏ జీవికైనా జాతి పుట్టుక, దాని పురోగతీ...

భాషను అ-పరిమితం చేసేదే కవిత్వం

కవిమల్లుడని మేము ముద్దుగా పిలుచుకొనే ఒక మిత్రుడితో ఇటీవల ఒక సంభాషణ జరిగింది. మాటలు రకరకాల చోట్లకు తిరిగి వచ్చి మోదుగు శ్రీసుధ రాసిన ‘అమోహం’ పుస్తకం దగ్గర ఆగాయి. ఆ పుస్తకం ముద్రణకు సంబంధించి నాకూ కొంత ప్రమేయం ఉండటంతో అతని అభిప్రాయం కోసం...

కొన్ని కథలూ  ఒక అస్తిత్వమూ

కొన్ని కథలుంటాయి కథగాకంటే అనుభవం లా అనిపించేవి. ఈ పదమూడు కథల్లా ఒక చరిత్రనుంచి, ఒక కాలం నుంచీ, ఒక దుఃఖం నుంచీ అనుభవాన్ని మాత్రం ఏరి దగ్గరగా తెచ్చిపెట్టినట్టు. ఏది చరిత్ర? ఏది గతం? ఒక వీడ్కోలు సాయంత్రం లో “కేన్” అంటాడు ఇంగ్లీషు పాలనలో లేని భారతదేశం...

ఫెమి’నిజపు పురా పరిమళాలు

షులామిత్ ఫైర్ స్టోన్ రాసిన “ the dialectics of sex” లో వొక చాప్టర్ అయిన “ love (ప్రేమ ) “ ను పద్మావతి బోడపాటి గారు అనువాదం చేశారు. ఈ వొక్క చాప్టర్ మీద నా అభిప్రాయం – సాయి పద్మ ప్రేమ, రాజకీయం వొకే ఊపున వినాలంటే , మనసు వొప్పుకోదు. ముఖ్యంగా...

మోహన్ రుషి- Urban Saint

ఇవాళ మనకున్న చాల మంచి కవులలో మోహన్ రుషి ఒకరు. తన కవిత్వంలో అచ్చమైన అర్బేనిటీ మనల్ని తనతో కట్టేసుకుంటుంది. దీపశిల, బొమ్మల బాయి సిద్ధార్థ సంగతి చెప్పేదేముంది. తను మోహన్ రుషి తాజా పుస్తకం ‘స్క్వేర్ వన్' మన కోసం ఇలా చదువుతున్నాడు. తనతో పాటు మీరూ చదవండి...

శ్రుతి మించిన మెలో డ్రామా

మల్లీశ్వరి రచించిన నీల నవల, చిననవీరభద్రుడు  గారు ముందు మాటలో చెప్పినట్టు “ సిద్ధాంతాల ప్రాతిపదిక మీద కాకుండా, అనుభవాల ప్రాతిపదిక మీద నిర్మించిన ఒక ప్రతిపాదన”. ఈ నవల చదవడం మొదలుపెట్టి కొన్నిపేజీలు గడిచాక, మల్లీశ్వరి గారు 2015 లో  రాసిన “శతపత్ర సుందరి...

నీలం, ఎరుపు, ఆకుపచ్చ రంగుల పాట ‘వేకువ పిట్ట’

“దళిత, ఆదివాసీ, ముస్లిం స్త్రీలు సమాజపు ఆఖరి మెట్టు మీద నిలబడి పీడితులలో పీడితులుగా  ….. హక్కుల నిరాదరణకు గురౌతున్నారు” అనే వాక్యంతో మొదలవుతుంది కవయిత్రి చల్లపల్లి స్వరూపరాణి ‘వేకువపిట్ట’ కవితా సంపుటికి రాసిన ముందుమాట. ఆలోచనాపరులు కేవలం...

నిరుడు విరిసిన కవిత్వం: కవిత -2017

కళ ఒక మాయా వస్తువు. తనని గుర్తించేవారిని అది మైమరిచిపోయేలా చేస్తుంది. ఊరిస్తుంది, లాలిస్తుంది, వెన్ను తడుతుంది, చెంపమీద లాగి పెట్టి కొడుతుంది కూడా. దారి చూపుతుంది, కాని ఆ దారి కావాల్సిన వారికే కనబడుతుంది. కవిత్వం ఒక అభూత కల్పన అనడానికి లేదు...

‘ఒంటరి’ కానిదెవ్వరు’?!

గ్రామీణ జీవిత నేపథ్యంగా రచనలు సాగిస్తున్న వారిలో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఆయన ఇప్పటికే 7 నవలలు, రెండు కథా సంపుటాలను ప్రచురించినారు. సాహితీ క్షేత్రంలో ఆయన పండించిన మరో పంట ‘ఒంటరి’ నవల.  ఇది ‘తానా’ నవలల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది...

‘గెలుపు సరే; బతకడం ఇలా’

కాకర్ల నారసింహ యోగ పతంజలి అంటే అందరికీ తెలీదు. కె.ఎన్.వై. పతంజలి అంటే జగమెరిగిన, జనాన్ని కాచి వడబోసిన మహా రచయిత అని ఎందరికో తెలుసు. గోపాత్రుడు, పిలకతిరుగుడు పువ్వు, వీరబొబ్బిలి, ఒక దెయ్యం ఆత్మకథ వంటి వ్యంగ్య సాహితీ విజ్ఞాన సర్వస్వాలు ఆయన తెలుగు...

కాలం సేతిలో సంటోడి పొద్దు

“కార్తీక మాసంలో, గోదాట్లో ములిగే  ఆడోలు తడిసిన బట్టలతోనే ఇల్ల కొత్తారు..అందుకే నొరే.. ఆడోల గుండెలు సెంచలం అన్నోడు సచ్చెదవ” ! (శీతకట్టు) ఏమిటీ వాక్యం ? ఎదో వింతపరిమళాన్ని హృదయంలోపలికి ఒంపుతోంది కదూ ?”కొబ్బరినూని సిక్కగా పేరకపోయి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.