ప్రియమైన అసిఫా!

 

 

జమ్ములోని కాతువ జిల్లాలోని రాసనాలో మీ అమ్మనాన్నల్ని కలిశాము. వాళ్ళు నిన్ను చాలా కోల్పోయారు. వాళ్ళకిలాంటి కష్టతరమైన పరిస్తితి రావడం ఇది రెండవసారి. నీ ఇద్దరి సోదరులు, అక్క రోడ్డు ప్రమాదంలో చనిపోయారని, వాళ్లకి మిగిలిన ఒక్కగానొక్క కుమార్తెవి నువ్వేనని తెలిసి కలత చెందాము.

నీ గురించి అడిగినప్పుడు నీ ఇద్దరన్నలు కళ్ళనీళ్ళపర్యంతమయ్యారు. ఎప్పుడూ నిన్నుఆటపట్టిస్తూ ఉండే నీ చిన్నన్న ఇప్పుడు మాట్లాడ్డమే లేదని మీ ఆమ్మనాన్న చెప్పారు. నువ్వు ‘మామ్మ‘ అని పిలిచే మీ అమ్మ నీ బట్టలు, స్కూల్ బ్యాగ్, చెప్పులు, మాకు చూపించింది. ఆమెను ఓదార్చడానికి మాకు మాటలు చాల లేదు.

నీకు ఆకలైతే తట్టుకోలేవని మాకు మీ అమ్మ చెప్పింది. నిన్ను హత్యచేయడానికి ముందు గుడిలో, పశువులకోష్టంలో ఆహారం ఇవ్వకుండా బంధించారని తెలిసింది. నీ ఎనిమిదేళ్ళ జీవితంలో నీపై జరిగిన దుర్మార్గాన్ని గురించి మాట్లాడుతున్నప్పుడు మీ అమ్మ నిజంగా వణికి పోతోంది.

నువ్వంటే మీ నాన్నకి చాల ఇష్తం . అందుకే ఆయాన ఇప్పుడు తీవ్రమైన డిప్రషన్ లోకి వెళ్ళాడు. ఎక్కువ మోతాదులో యాంటీ డిప్రెషన్ మందుల మీద ఆధారపడి కొనసాగుతున్నాడు. మేము ఆయన మందుల చీటీ చూసాం. కానీ నన్ను నమ్ము , వాళ్ళ హృదయాలను పాలిస్తుంది నువ్వే. నువ్వు వాళ్ళ మధ్య జీవించే ఉన్నావు.

నీకు ఒక విషయం తెలుసా? ఇప్పుడు మా చైతన్యం మరణించింది. కొన్నేండ్ల క్రితం మేము నిర్భాయకు న్యాయం చెయ్యాలని రోడ్లపైకి వచ్చినప్పుడు కొద్దిగా చైతన్యం మిగిలి ఉండేది. కానీ నీకు న్యాయం చేయమని అడగడానికి బదులు చేతిలో జాతీయజండాతో ఆ దుర్మార్గులకు మద్దతుగా వీధుల్లోకోచ్చెంతగా ఇప్పుడు మాచైతన్యం దిగజారింది. ఈ అమానుష చర్య మన నవీన భారతంలో కొత్త సాధారణ విషయాలలో ఒకటిగా పరిగణించబడింది. ఆ భగవంతుడు నీకు స్వర్గంలో అత్యున్నత స్థానాన్ని, మీ కుటుంబానికి బలాన్ని ప్రసాదించుగాక .

ఆమెన్.

(newsclick.in అనే వెబ్ పత్రిక విలేకరి తారిఖ్ అన్వర్ కధనానికి 
వై కరుణాకర్ తెలుగు అనువాదం. 
అసిఫా బొమ్మ: మోషే డయాన్.)

కరుణాకర్

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.