అద్దిరి పడు, గుక్క పెట్టు! షీ కాంట్ హెల్ప్ యూ!

“నువ్వు నాకు నచ్చలేదు కాబట్టే నిన్ను చేసుకున్నాను, నచ్చిన దాన్ని చేసుకుంటే దానితో కల్సి తిరగాలనిపిస్తుంది. అలా తిరిగితే వెధవంటారు జనం, అందుకే ఏ మాత్రం నచ్చని నిన్ను చేసుకున్నాను. నిన్నయితే ఎక్కడికైనా పంపొచ్చు. అటు పెళ్ళాం చేత తండ్రికి సేవ చేయిస్తున్నాడనే పేరూ వస్తుంది, ఇటు ఇష్టం వచ్చినట్లు సుఖాలూ అనుభవించవచ్చు” అన్నాడతను. ఆ మాటల్లో ఎంతటి నిర్లజ్జ. ఆ మాటలు భరించలేని ఆమె “నేను వెళ్ళను, నేను వెళ్ళను. ఒక్కసారి చెప్పండి, ఇదంతా అబద్దమని” అంటూ అతని కాళ్ళబడింది. “అంత ఖర్మ నాకేవిటి ? నీకు మొగుడూ, సంసారం కావాలంటే నేనెక్కడికి పంపితే అక్కడ నేనుండమన్నన్ని రోజులు ఉండు. లేకపోతే ఎందులోనన్నా పడి చావు” అనేశాడతను. అతని తండ్రి విజయనగరం జిల్లాలో అలమండలో అనారోగ్యంతో ఉన్నప్పటి సందర్భంలోని సంభాషణది.
ఆ స్త్రీ మరెవరో కాదు. మనందరి మనసులు ఎంతగానో చూరగొన్న “బందిపోట్లు సావిత్రి”. ఆ మగవాడు, పేరేదైతేనేం కేవలం భర్తగా సగర్వమైన అపకీర్తి పాలైన సగటు మగవాడు. ఉహ తెల్సిన నాటి నుండీ బందిపోట్లు సావిత్రంటే-అదొక క్రేజ్. ఎందుక్కలుగుతుందా ఆసక్తి ? ఆమె రాసిన “మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందన్న” వాక్యంలోని ఏ కవిత్వ లక్షణం హృదయాంతరాలలో అలజడి రేపుతుంది ? పాఠం ఒప్పజెప్పని సంధర్భమెప్పుడూ సావిత్రి జీవితంలో ఉండి ఉండదని రూఢిగా చెప్పొచ్చు. అక్షరాల్లో ఆమె కోపం ఎంత కనపడినా, వాటిపట్ల ఆమె ప్రేమ దాచలేనిది. ఆ పదాల వంతెన మీదనుండి ఆమె వాక్యాల పటాలం ఎంత క్రమశిక్షణతో విన్యాసం చేస్తుందో మనకి కళ్ళముందు కనబడిపోతుంది. ఆమెకి వాటిపట్ల, అవి నేర్పిన చదువు పట్ల అంత ఇష్టమూ, భక్తి,ప్రేమా కలిగి ఉంటాయి. ఆ కవిత్వమొక ప్రత్యేక మైన వస్తు ధోరణి కలిగిన గమ్మత్తైన రూపంలో కనిపిస్తుంది.
ఆమె జీవితాన్నీ, కవిత్వాన్నీ వేరు చేసి అస్సలు చూడలేము. చూస్తే వేరుగా ఏమీ కనబడదు కూడా. జీవితాన్ని అక్షరీకరించిన కవిత్వంలో ఏ సాహిత్య లక్షణాలకోసం వెతికినా తప్పేనేమో. అక్కడ జీవితమే కవిత్వమైపోయి మనల్ని ఆ అద్దంలోకి తొంగి చూసేట్టు చేస్తుంది. అలా చూపించగలిగిన తనం ఏ కవితా లక్షణంతో సరిపోల్చి చూడాలో, సావిత్రి కవిత్వం అలానే తోస్తుంది.
సామాజిక చక్ర సిద్దాంత ప్రతిపాదనల్లో సమాజాల్ని సాంస్కృతిక స్వభావాల్ని బట్టి విభజించారు. చింతనాత్మక, వాస్తవిక, ఆదర్శవంతమైన అభివృద్ది చెందుతున్న సమాజాల్లోని సాంస్కృతిక వైరుధ్యం నాగరికతని, యాంత్రికత తన వైపు ఎక్కువ ఆకర్షించబడేట్టు చేయడాన్నీ సోషియాలజిస్టులు చరిత్రలో వివరిస్తారు. అలా ప్రవేశించిన జీవన యాంత్రికతిని సావిత్రి ప్రశ్నిస్తుంది. అసహ్యించుకుంటుంది. ఆఖరుకి ఆ పదాల్ని సైతం “పదాలన్నీ భలేగున్నయ్, భ్రమల్లో పడేస్తున్నాయ్” అని ఏవగించుకున్నతనం కనిపిస్తుంది. “ఇదిగో ఇది ప్రేమ, పరిమళాల పొదల వెనుక భయంకర కాలసర్పం, బుస బుసల్లా– గుస గుసలు. అదిగో – అది అనుబంధం. సగం బిగిసి ఆగిన ఉరి – తన్నేసిన బల్ల కాలికి తగుల్తూనే ఉంటుంది. అవేమో – సంస్కృతీ ప్రగతీ. వొలకబోసి యెత్తుకుంటూ వొరగబెట్టేమంటూ– ” అంటుంది.
అలాగే బలవంతులైన వర్గసమాజంలో మోసపూరిత గుంట నక్కలూ, క్రూరమైన అడవి సింహాలూ ఒకదాని తర్వాత మరొకటి ఒక సైకిల్ గా తిరగడాన్ని బట్టి సామాజికాభివృద్దిని అంచనా వేయడం గమనిస్తుంది. అలాంటి అణచివేత వ్యవస్థల్లో కూడా శ్రమని, రాజకీయ చైతన్యాన్ని, విద్యా వివేచనాన్నీ లింగ బేధం లేకుండా సమానంగా చూడవలసిన అవసరాన్ని సావిత్రి కవిత్వంలో స్పష్టంగా చూపిస్తుంది. ” నైచ్యాన్ని నరకాల్సిన కత్తితో కూరలు తరుగుతున్నా – వేలు తెగింది. దుర్మార్గపు దుమ్ము దులపాల్సిన చేత్తో ఇల్లూడుస్తున్నా- కళ్ళు మండాయి. అసలైన కుళ్ళు కడగాల్సిన నేనే అంట్లు తోముతున్నా- అక్కరకొచ్చే గోళ్ళరిగిపోయాయి. గుండెల్ని గుంజి లేపాల్సిన నేనే – గుడ్డలుతుకుతున్నా, నడ్డి నొప్పెట్టింది.” అంటుంది. అంటే స్త్రీకి కుటుంబంలో మానసికంగా, ఆర్ధికంగా ఎంతటి కఠిన మైన సంకెళ్ళున్నాయో, అవి సామాజిక స్వేచ్చని ఎంత లౌక్యంగా హరిస్తున్నాయో చెప్తుంది. పితృస్వామ్య ఆధిపత్యం యొక్క ప్రామాణికతను ప్రశ్నిస్తుంది.
వాడ్రేవు చిన వీరభద్రుడు గారు “ఆమె తనని తాను మోసం చేసుకోలేకపోయిందని” రాస్తారొకచోట. అలా ఉండగలిగిన స్త్రీల సాహిత్యంలోనే కదా, స్త్రీవాద మేధావితనం నినాదప్రాయంగా కాక, నిజమైన స్పటికంలా మెరుస్తుంది. అసలామెనొక వాదానిక్కూడా పరిమితం చేయడం ఎంత అసహజమో అనిపిస్తుంది. ఆమె కవిత్వాన్నంతా ఆడవాళ్ళ అభ్యున్నతే ఖచ్చితమైన లక్ష్యంగా మాట్లాడినట్టనిపించినా ఆమె అనుభవాలన్నీ శక్తివంతమైన ఎరుకతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అసమానతలని ఎత్తి చూపెట్టేవి. వాటిల్లో
” మీ అన్యాయాలకు మా ఆక్రందనలు – అసూయాద్వేషాలు. మీ అవమానాలకు మా ఆర్తనాదాలు – అమానుష పక్షపాతాలు. మా కష్టాలు చెప్పేందుకు మీ నోళ్ళే తగినవంటారు. మీరు చెక్కే అక్షరాల్లోని విలన్లు మీరే అయినా — ఇంకా ఇంకా నమ్మాలి మేము. అన్నీ మూటగట్టుకున్న ఆషాఢభూతులే ఆవారాలనీ కలుములన్నీ కట్టబెట్టి, కట్టుబట్టల్తో మిగిలిన వాళ్ళు గడుసుముండలనీ, నమ్మేసి విమెన్స్ లిబ్ కూడా మగాళ్ళ ప్రసాదమేనని ఒప్పేసుకుంటే సరి ! గొంతు కోసేసి గొల్లుమనడం – ఇదే మరి” (అవును మరి) అని అనడంలో ఆమె విస్పష్ట భావ ప్రకటనా తత్వం తెలుస్తుంది. లైంగికత లోని రాజకీయకోణాల్ని ఆవిష్కరించడంలో ఎక్కడా తడుముకున్నట్టు తోచదు. తనకి నచ్చని విషయాన్ని, బాధపెట్టిన సందర్భాన్ని నిర్మొహమాటంగా చెప్తుంది.
“దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది” అని వందేమాతరం గీతం రాసి జైలు పాలై, రాజ్యం పెట్టిన హింసతో మరణించిన చెరబండరాజు ను గురించి “కవిగా నువ్వేం రాసినా చెల్లు” (జూలై 2) అంటుంది. గృహిణి అన్న కవితలో “ఉపాధి లేదు, జీతం రాదు, శెలవులు లేవు, సేద దీర్చే నెలవే లేదు. డ్యూటీలున్నాయ్, ఓటీలున్నాయ్, సూటీపోటీ మాటలున్నాయ్. నేనే పనిలేనిదాన్నని భాషేరాని బడుద్దాయిలంటారు” అని భారమెంత వహిస్తున్నా నేనే భార్యనని చెప్తుంది. ఖబడ్దార్ అన్న కవితలోనైతే “దొంగ కవులూ కాచుకోండి, కొంగ కన్నీరు దాచుకోండి” అని హెచ్చరిస్తుంది. అన్నీ చిన్న చిన్న పదాలే. కానీ ఒక్కొక్కటీ ఒక్కో ఆయుధంలా పదునుదేలుతుంది. సినీ నటి సావిత్రి చనిపోయినపుడు “ఇకనైనా పొందుమా వినువీధి విశ్రాంతి” అంటుంది.
ఈ కవిత్వాన్ని ఏ కవిత్వ లక్షణాల గొడుగు కిందకి తీసుకురావాలి ? ఏ అలంకారిక శాస్త్ర ఛాయలో ఏ కాంతితో సరిపోల్చాలి ? ఆ పనికి ఏ తూకపు రాళ్ళూ సరిపోవు. అసలు అలాంటివాటికోసం మనకి వెతకబుద్ది కాదు. చాలా చోట్ల ఇవన్నీ శుద్ద వచన వాక్యాల్లా అనిపిస్తాయి. కానీ వాటినిండా జీవనోద్వేగం నిండిపోయి ఉంటుంది. “తెలియని కొలిమిని అంటించి, ఎంత చంపినా చావని ఆర్ద్రతని కంటిపాపల వెనుక భగ్గున మండించి సుళ్ళు తిరుగుతూ పెల్లుబికేలా చేసినా– స్పృహ తప్పక, గుండె
ఆగక, మతిచలించక బతుకుతున్న నన్ను చూస్తే
ఎవరికైనా కక్షే, అర్ధంకాని అసూయే” (అయ్యో పాపం) అని తన జీవితంలోనే ఉన్న మగవాణ్ణి ఎగతాళి చేస్తుంది. ఆమె వాక్యాల్లో అధిక్షేపం కనిపించింది. కొంత హాస్యచతురత కూడా. అయితే ఆ విప్రతీపత కారణంగానే ఈమె వాచ్యంలోని తీక్షణత చదువరికి బాణంలా గుచ్చుతుంది. ఆ గాయం కిందనే ఏదో చెప్పనలవిగాని సలపరం వేస్తుంది. “ఏమైనా సరే – కవీ పుట్టేసిన నిరపరాధుల్ని ఎలాగైనా జోకొట్టు, ఇంకొక్క క్షణమైనా” (తప్పదు మరి) అంటుంది. ” మా కోర్టులో మంచితనాన్ని బోనెక్కించి కుట్ర కేసు బనాయిస్తారు. మా ఠాణాలు హంతకులకు విందులిస్తాయి. మా కళాత్మక చిత్రాలనిండా బూతు” (వాస్తవం) అంటుంది. పరాధీనత అన్న కవితలోనూ అంతే. శ్లేషలూ, నానార్ధాలూ ఉండవు. దృక్పధంలో మార్పు కోసం నిర్దయతో రాస్తుంది. శరీరానికీ, మనస్సుకీ తర తరాలుగా వివాహ వ్యవస్థ చేస్తున్న అన్యాయం గురించి నేరుగా చెప్పేస్తుంది. దాపరికమూ, అనిర్దుష్టమూ ఏమీ ఉండదు. “అన్యాయంగా చీకటి కొట్టులో బంధించినపుడు నా ఆరాటమంతా విడుదల కోసమే. పైసా చేత లేక అల్లాడిపోతున్నప్పుడు నా ఆలోచనంతా సంపాదన కోసమే” (సంకెళ్ళు) అనేస్తుంది సరళసుందరంగా. పేచీ ఉండదు.
సావిత్రిని ఆమె కవితల్తో మాత్రమే పరిచయం చేసుకోవాలంటే వీలయే పని కాదు. ఆమె పత్రికలకి ఉత్తరాలు రాసినపుడు ‘ప్రభ సావిత్రి’, ప్రసంగాల్ని వినిపించినపుడు ‘రేడియో సావిత్రి’, గోదావరీ తీరాన చాలా కాలం ఉన్నారు కనుక ‘రాజమండ్రి సావిత్రి’. ఆమె 1949 మే నెల్లో ఉండేశ్వరపురం (తూగోజి) లో పుట్టారు. వాళ్ళమ్మంటే చెప్పలేనంత ఇష్టం. తిట్టే నాన్నన్నా, కొట్టే మొగుడన్నా దాచలేనంత ద్వేషం. 1968 లో పెళ్ళి చేసుకుని రాజమండ్రి వచ్చేశారు. అపర్ణ, శిరీషా ఇద్దరు పిల్లలు. భర్తతో విభేదించి కట్టుబట్టల్తో బయటకొచ్చి ‘సమాచారం’ ‘డెక్కన్ క్రానికల్’ (విశాఖ) పత్రికల్లో ఉద్యోగం చేశారు. మార్క్సిజాన్నీ, రంగనాయకమ్మని ఆరాధించారు. ఆజన్మాంతం, కాలంతో సంఘర్షించినా ఏనాడూ తన
స్థైర్యాన్ని వదల్లేదు. “కృతఘ్నుడైన కొడుకును కనిపెంచినందుకీ ఒక్క రోజూ దుక్ఖించి ఏడాదంతా ఎడతెగని పోరు చేస్తాను. నువ్వు కరచాలనం చేసేదాకా కరవాలచాలనం చేస్తూనే ఉంటాను” (మాకీ దినోత్సవం వద్దు) అని ధైర్యంగా నిలబడుతుంది. మనకి ఆమె సూక్ష్మ స్వరాన్ని వింటే ఎందుకో అదో ఇదిగా దుక్ఖం కలుగుతుంది. అలా కలగడమే ఈ కవిత్వలోని గొప్ప లక్షణం. పట్టుమని 23 కవితలున్న పుస్తకమీ ‘సావిత్రి’. ఆమెకు మించి పుస్తకానికి మరో టైటిలేముంటుంది ?1991 లో ఆమె టీబీ తో కాలం చేశాక 1992 లో అరణ్యకృష్ణ సంపాదకత్వంలో వచ్చిందీ కవిత్వ సంపుటి. అప్పటికి ముప్పైదాటని ఆ కుర్ర ఎడిటర్ని మెచ్చుకోకుండా ఎలా ఉండగలం? అంత బాగుంటుందీ పుస్తకం. అతను లేటెస్టుగా “ఆమె అస్తమించలేదని” మళ్ళీ సావిత్రిని మనముందుకు తీసుకొచ్చాడు. గుండె ఎన్ని టన్నుల బరువెక్కించేస్తాడో మాటల్లో చెప్పేస్తే అతనికి దిష్టి తగులుతుంది. ఇలాంటివాళ్ళుండకపోతే ఇంతటి అపురూపమైన పుస్తకాలెలా చదవాలి ?
సావిత్రిదంతా సూక్ష్మమైన వికాస భావ వ్యక్తీరణ. సమాజంలోని రుగ్మతల మూలంగా స్త్రీని చుట్టుముట్టే అనేక సమస్యల్ని ఆమె వాక్యాల్లో మనం గుర్తించవచ్చు. భాషా సౌందర్యం కన్నా భావ తత్వం మనల్ని కట్టిపడేస్తుంది. ఇదంతా అంతటి ప్రయోజనకర బాధ్యతని మోసే కవిత్వం. 1960 చివర్లోని స్త్రీ విమోచనోద్యమమో, సైమన్ డీ బొవోర్ రాసిన “ది సెకండ్ సెక్సో”, మార్గరెట్ మెడ్ రాసిన “మేల్ అండ్ ఫేమేల్” బ్రెట్టీ ఫ్రీడన్ రాసిన ” ది ఫెమినైన్ మిస్టిక్” పుస్తకమో. ఏది ఏదైనా మరి, నా మటుకు నాకు తెలుగువాడిగా సావిత్రి పుస్తకం తోనే దుర్మార్గ సమాజం స్త్రీ గొంతుకోసి గొల్లు మనడం గురించి– నన్ను నేను తెలుసుకున్నాక — Mother, Wife, Sweet heart are the Jailers.
అవున్నిజమే. One is not born, but rather becomes, a woman. బీజ, క్షేత్రాలేవైనా, ఏదీ బయలాజికల్ ట్రయిట్ మాత్రం కానేకాదన్న సత్యం “సావిత్రి” అనుభవంలోకి తెస్తుంది.
లేదంటావా సారీ బ్రదర్, నో బడీ కెన్ హెల్ప్ యూ…అంతే !
సావిత్రి పుస్తకావిష్కర‍ణ నాటి సభ దృశ్యాలు

శ్రీరామ్

శ్రీరామ్: పుట్టింది తెనాలిలో, పెరిగింది విజయవాడలో. వ్యవసాయ శాస్త్రంలో పీజీ చేసి ప్రస్తుతం రాజమండ్రిలో బ్యాంకుజ్జోగం చేసుకుంటున్నారు. కవిత్వమూ, కవిత్వ విశ్లేషణ, సమీక్షా వ్యాసాలు రాస్తున్నారు. కవిసంగమం లో కవితా ఓ కవితా శీర్షిక నిర్వహిస్తున్నారు. అద్వంద్వం తనకి గుర్తింపు తెచ్చిపెట్టిన తొలి కవితా సంపుటి. +91 9963482597 మొబైల్ నంబర్లో అతన్ని పలకరించవచ్చు.

53 comments

 • చాలా గొప్పగా రాసారు శ్రీరాం గారూ! సావిత్రిగారు మిమ్మల్ని ఎంతగా పట్టి, కదిపి, కుదిపెసారో వ్యాసంలోని మీ ప్రతి అక్షరం సాక్ష్యం చెబుతుంది. సావిత్రిగారిని మీరు తాత్వికంగా అర్ధం చేసుకున్న తీరు, పరామర్శించిన తీరు, ప్రెజెంట్ చేసిన తీరు నాకు గొప్పగా తోచింది. నా భాగస్వామ్యం వున్న పుస్తకం అని కాదు కానీ ఈ వ్యాసం ఈ పరంపరలో మీరు రాసిన వాటిల్లో ఇది అగ్రస్థానాన నిలుస్తుందని అనుకుంటున్నాను. ధన్యవాదాలు. అభినందనలు.

  • అరణ్య గారు, మీరు ఈ పుస్తకం తేవడం వల్లే ఈ వ్యసం రాయగలిగాను. ఇంతకన్నా ఏం చెప్పను ?

 • ఇది కదా.. స్పందన అంటే..
  అభిమానం, ఆస్వాదన కలిసి జమిలిగా పెల్లుబికిన సెల్యులాయిడ్ పీస్.. ఇది. ప్రతి మగవాడు తనంజ్ తిట్టుకుంటూ చదువుకోవాల్సిందే..సావిత్రి ని. శ్రీరామ్. బాధ్యతాయుతమైన ప్రయత్నం మీది. పురుషుల పాపం మీవల్ల కొంత అయినా శమిస్తుంది. ఆమె మాట విందాం. భూతకాలం కాకపోయినా వర్తమానం క్షమిస్గుంది మనల్ని.

 • సావిత్రి గారి గురించి అక్కడక్కడ కొద్దిగా దొరికింది చదవటమే కానీ వివరంగా తన పుస్తకం గురించి తెలుసుకోవటం ఇదే మొదటిసారి… తన ఆలోచన, వేదన అంతా మాలోకి కుమ్మరించేసావ్

 • సావిత్రి అంటే బంది పోట్లు
  తప్ప చాలామందికి ఎరుక లేదు
  ఆమె భావ తత్వాన్ని బాగా పట్టుకున్నారు.
  చెప్పాలసింది చెప్పారు.
  మీ మలి చూపుకి అభినందనలు.

 • ఇలాంటి జీవితాలను చదవాల్సిన అవసరం చాలా ఉంది
  మంచి పుస్తకాన్ని సమీక్షించారు

 • అన్న ….సావిత్రి గారిది బందిపోట్లు తప్ప వేరే చదవలేదు..మీ వ్యాసం చదివాక ఆమె గుండెపై చెవిపెట్టి విన్నంతగా అనిపిచ్చింది…అద్భుతమైన వ్యాసం…థాంక్స్ అన్న

 • నేను ఎప్పటినుండో చడవాలనుకుంటున్న పుస్తకం( మీ భాష చెప్పాలంటే జీవితం). చాలా బాగా రాసారు.

  కానీ సావిత్రి గారు పుస్తకంలో రాసిన భాష కన్నా మీ విశ్లేషణలో భాష చాలా కఠినంగా ఉంది.

  • థ్యాంక్యూ శేషు. నీ సూచన ను స్వీకరిస్తున్నాను. భాషని ఇంకాస్త సరళీకరిచేందుకు ట్రై చేస్తాను.

 • మీదైన శైలిలో సావిత్రి ఆత్మను పట్టుకున్నారు

 • బందిపోటు సావిత్రి గారి గురించి అరణ్య కృష్ణ గారి వ్యాసంలో..చదివాను..
  ఆమె పుస్తకం లభ్యత గురించి వారిని అడిగా కూడా..ఇలా మీ నుండి ఉంటుందని కూడా ఊహించా..అయితే ఈ మాసం రావడం యాదృచ్ఛికమేమో..
  సావిత్రి గారి అక్షరాల్లో పూర్తిగా మమేకమయ్యారేమో..ఏవి వ్యాఖ్యలు… కవితా వాక్యాలు అనేది తెలుసుకోవడం కష్టం అనిపించింది..తెలియని కొలిమిని..ఈ వాక్యపు లీడ్..కొనసాగింపు ఆలోచనాత్మకం…ఆమె సంఘర్షణలు.. వ్యక్తిత్వం గురించి దాదాపు సమగ్రం గా చదివాను మొదటిసారిగా..ఈ వ్యాసంలో..
  స్త్రీ వాద మేధావితనం నినాదం ప్రాయం కాక నిజమైన స్పటికంగా మెరుస్తుంది..👌👌ఈ శీర్షికలో మీరు కేవలం కవయిత్రిని..పుస్తకాన్ని పరిచయం చేయడంతో అగడంలేదు.నేపద్యపు వివరణ..రచయిత మనో సంఘర్షణలు కూడా మీ మాటల్లో తెలుపుతూ ఊటంకించే వాక్యాలను జడ్జి చేస్తున్నారు..ఆ నేర్పుకోసం సాంతం మళ్లీ మళ్లీ చదివించిన వ్యాసం…ఎప్పటిలా మీ సమీక్షలకు చాలా ఆసక్తిగా చూసేది ఇందుకోసమే…అభినందనలు సర్..

  • థ్యాంక్స్ రాజేశ్వరి గారు. మీ అబ్జర్వేజన్స్ వల్లే నేను జాగ్రత్తగా రాస్తున్నాను. యు ఆర్ క్రిటికల్ ఇన్ యువర్ రీడింగ్.

 • ఈ మధ్యన సావిత్రి గారి కవిత్వం వినబడుతుంది… ఎవరూ …ఈ సావిత్రి అనుకున్నాను…ఇప్పుడు మీ వ్యాసం చదివినాక క్లారిటీ వచ్చింది తన గురించి, తన కవిత్వం గురించి…. జీవితానుభవమే పెద్ద కవిత్వం అవుతుంటే….కవిత్వ లక్షణాల గురించి వెతకాల్సిన అవసరమే ఉండదనుకుంటా….ధన్యవాదాలు సార్ మంచి కవయిత్రి ని …ఆమె కవిత్వాన్ని పరిచయం చేసినందుకు.

 • Extraordinary essay సర్
  జీవితంలోని సంఘర్షణలను , స్త్రీగా ఎదుర్కొన్న ఆటుపోట్లను ఎంతో అద్భుతంగా ఆలోచనాత్మకంగా కవిత్వీకరించిన సావిత్రమ్మ గారికి పాదాభివందనం!
  One of the best essays written by u sir
  I like it very much and it’s very very useful.

 • Savitri pai mee vyasam chadivaka gunde Dukham tho nindipoyindi.
  Ame vrasina Bandipotu kavitha matrame naaku telusu. Ame rasina prathi kavitha kooda meerannatlu jeevanodvegam tho nindi vunnadani ardhamaindi. Manchu vyasam andinchina meeku dhanyavadamulu.

 • You have immersed so lot in savitri poetry. Expressed your feelings in an unparalel way .wonderful is the only word I know to appreciate you Thank you so much sree ram gaaru

 • మీకు లాగే…1994 ప్రాంతంలో మా బుర్రల్లో
  సావిత్రి – బందిపోట్లు ఒక డైనమేట్.

  మంచి వ్యాసం.
  సావిత్రి గారిలో ఉన్నట్టే మంచి ధిక్కారం తో వ్యాసం పండింది. అభినందనలు.

 • ఒక కాలంలో చదివిన ఫీలింగ్ అలాగే సావిత్రి గారి కవిత విషయంలో ఇప్పుడు కూడా….
  మిత్రమా !మీరు రాసిన చిన్ని రాత యదలో కాసింత దుఃఖపు వర్షాన్ని లిప్త కాలం నన్ను గాయపరించింది.
  సావిత్రి గారి కన్నీళ్ళు నిజంగా ఉప్పగా ఉన్నాయి.
  సామాన్యమైన కన్నీళ్ళకంటే….
  సాంద్రత ఎక్కువతో…..
  ఈ సాయంకాలం నన్ను నన్నుగా మాయం చేసి బాధగా మిగిల్చిన మీ అక్షరానికి….
  రెప్పల తడిని గుట్టుగా మీకు చూయిస్తున్నాను.

  • మీరు చూపిన తడి నాలో భద్రంగా ఊట ఊరుతోంది. తోడున్నందుకు థ్యాంక్సన్నా

 • సావిత్రి గారి గురించి అస్సలు తెల్వదు-ఒక్క బందిపోట్లు అనే పదం తప్ప!
  చాలా చాలా నేర్చుకోవాలి.
  కవిత్వమంటే జీవితమని గుర్తుంచుకోవాలి.

  మీ వ్యాసం వేగంగా చదివించేలా వుంది.మీరు ఉటంకించిన వాక్యాలన్నీ ప్రస్తావించలేనుగానీ చెప్పదల్చుకున్న అంశాన్ని పాఠకుడిలోకి ఇంకిపోయేలా రాస్తున్నారు.సావిత్రి గారి మీద వ్యాసమంటే మీరు తప్పక గుర్తొస్తారు మిత్రమా! అంతలా ఆకట్టూకునేలా రాసారు.

  కొన్ని వ్యాసాలు చదివితే పుస్తకం చదువాలన్న కుతుహలం ఒక్కచోట నిలువనీయక కాలుగాలిన పిల్లి అవతారమెత్తుతది.

  నా దుగ్ధ తీర్చుకుంటాను.

  అభినందనలు
  శనార్తులు.

  • థ్యాంక్సన్నా. నా దుగ్ధ తీరుతోంది. తరువాయి నీది.

 • It is the analysis which reflects depth of poems in such a way that easily understood the pain of writer while pen.

 • Wow its amazing
  మంచి పుస్తకాన్ని మంచి కవిని పరిచయం చేసారు thnq so much

 • Mitrama…Nee vyakyanam aasaantam chadivinchelavundhi…Padhaalanu aeri kurchi pulamalaga chesi bandipotla savitri gariki Aksharanjali aripinchavu… Idhi acham teluguvari savitri (bandipotla) biopic la vundhi … Sahiti abimanulaku marinni vyakhyanalu andhistarani aashishthu …’Sriramu’ni mitrudu..

 • చక్కటి విశ్లేషణ సర్. మొదట సావిత్రి గారు ఎవరా అని ఆలోచించా అరణ్య కృష్ణ గారి వ్యాసం చదివాక అర్ధం అయ్యింది. ఇలాంటి పుస్తకాలు పరిచయం చెయ్యటం ఇంత లోతుగా విశ్లేషించి సమీక్ష చెయ్యటం గొప్ప విషయం. చాలా బాగుంది సర్ మీ సమీక్ష. ధన్యవాదాలు.

 • హృదయాంతరాలలోంచి వచ్చిన నిజమైన స్పందన కట్టిపడేసింది….నీలిమేఘాలులో అమ్మ కవిత్వం చదివాను….జీవితానుభవాలలోంచి వచ్చిన అక్షరవేదన….ఇలా ఎంపిక బాగుంది….

 • “మేం పాలిచ్చి పెంచిన జనంలో సగమే మమ్మల్ని విభజించి పాలిస్తోందన్న” ” నైచ్యాన్ని నరకాల్సిన కత్తితో కూరలు తరుగుతున్నా – వేలు తెగింది. దుర్మార్గపు దుమ్ము దులపాల్సిన చేత్తో ఇల్లూడుస్తున్నా- కళ్ళు మండాయి. అసలైన కుళ్ళు కడగాల్సిన నేనే అంట్లు తోముతున్నా- అక్కరకొచ్చే గోళ్ళరిగిపోయాయి. గుండెల్ని గుంజి లేపాల్సిన నేనే – గుడ్డలుతుకుతున్నా, నడ్డి నొప్పెట్టింది.” అంటుంది. అంటే స్త్రీకి కుటుంబంలో మానసికంగా, ఆర్ధికంగా ఎంతటి కఠిన మైన సంకెళ్ళున్నాయో, అవి సామాజిక స్వేచ్చని ఎంత లౌక్యంగా హరిస్తున్నాయో చెప్తుంది. పితృస్వామ్య ఆధిపత్యం యొక్క ప్రామాణికతను ప్రశ్నిస్తుంది.అలా ఉండగలిగిన స్త్రీల సాహిత్యంలోనే కదా, స్త్రీవాద మేధావితనం నినాదప్రాయంగా కాక, నిజమైన స్పటికంలా మెరుస్తుంది. అసలామెనొక వాదానిక్కూడా పరిమితం చేయడం ఎంత అసహజమో అనిపిస్తుంది. ఆమె కవిత్వాన్నంతా ఆడవాళ్ళ అభ్యున్నతే ఖచ్చితమైన లక్ష్యంగా మాట్లాడినట్టనిపించినా ఆమె అనుభవాలన్నీ శక్తివంతమైన ఎరుకతో తన చుట్టూ ఉన్న ప్రపంచంలోని అసమానతలని ఎత్తి చూపెట్టేవి. వాటిల్లో
  ” మీ అన్యాయాలకు మా ఆక్రందనలు – అసూయాద్వేషాలు. మీ అవమానాలకు మా ఆర్తనాదాలు – అమానుష పక్షపాతాలు. మా కష్టాలు చెప్పేందుకు మీ నోళ్ళే తగినవంటారు. మీరు చెక్కే అక్షరాల్లోని విలన్లు మీరే అయినా — ఇంకా ఇంకా నమ్మాలి మేము. అన్నీ మూటగట్టుకున్న ఆషాఢభూతులే ఆవారాలనీ కలుములన్నీ కట్టబెట్టి, కట్టుబట్టల్తో మిగిలిన వాళ్ళు గడుసుముండలనీ, నమ్మేసి విమెన్స్ లిబ్ కూడా మగాళ్ళ ప్రసాదమేనని ఒప్పేసుకుంటే సరి ! గొంతు కోసేసి గొల్లుమనడం – ఇదే మరి” …ఆమె కవిత్వం నేటి తరం స్ర్తీలు చదవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది.. నేటికీ మహిళ ఆ పరిస్థితులకు భిన్నంగా ఏమీ లేదు.. మీ వ్యాఖ్యానాలు కూడా పదునుగానే ఉన్నాయి. అయితే అక్కడక్కడ సంక్లిష్టమైన పద సంపదను ప్రయోగించారు. అలాగే దిష్టి తగలడం అనే పదం ప్రయోగించి ఉండాల్సింది కాదు. అందులోనూ అరణ్యక్రిష్ణకు అసలు అతకని తత్వం కూడా. మనకూ అంటించుకోకూడని భావజాలమది.. మీ సమీక్ష సమగ్రతతో బాగుంది. అభినందనలు శ్రీరామ్ గారూ..

  • మీ కమెంట్స్ నా ప్రతీ వ్యాసానికీ ఎంతో ఉపయోగపడుతున్నాయ్. నాలో దాక్కున సాప్రదాయవాదిని పట్టుకున్నందుకు థ్యాంక్స్. మీ సూచనని స్వీకరిస్తున్నాను. జాగ్రత్త పడతాను.

 • ఇది నిజానికి విశ్లేషణ మీద విశ్లేషణ కాదు…
  శ్రీరాం గారి రైటప్‌ చదివాక జస్ట్‌ నా రెస్పాన్స్‌.. అది కూడా
  బహుశా జీవితమే కవిత్వంగా, కవిత్వమే తానైన ఒక స్త్రీ మూర్తికి!

  ప్రేమ, అనుబంధం, సంస్కృతీ, ప్రగతీ మీద ఆమె ఎత్తిన ధ్వజం తిరుగురానిది.
  ఆమెది తూకపురాళ్ళు సరిపోని కవిత్వంగా శ్రీరాంగారు అభివర్ణించారు…

  నిజానికి ఏ స్త్రీ అయినా కవిత్వమే అనుకుంటున్నాను!
  వారి వారి పరిస్థితులను బట్టి, చదువునీ విజ్ఞానాన్ని బట్టి, స్పందించే తీరుని బట్టీ ప్రతీ స్త్రీలో కవిత్వ మథనం నిరంతరం జరుగుతూంటుంది.. కొందరు దానిని సంఘర్షణలా తీసుకుంటే, మరికొందరు సావిత్రిలా బయటపెడతారు.

  కానీ, ఇలా భర్తచే నిరాదరణకు గురైతే కవయిత్రులు కాగలరంటే…
  ఎందరు ఆమెని ఆదర్శంగా తీసుకునేవారో అని ఆలోచించాను. అర్థరహితంగా, అర్థాంతరంగా ఎందరో స్త్రీల జీవితాలు అలా ముగిసి ఉండేవి కావేమో!

  సమాజంలోని రుగ్మతల మూలంగా స్త్రీని చుట్టుముట్టే అనేక సమస్యలను కవిత్వంగా మలిచిన గొప్ప స్త్రీ!

 • మీ విశ్లేషణ ఒక ఎత్తైతే,దానిని చదవడానికి మీరు ఎంచుకున్న విధానం అద్భుతంగ ఉంది సార్ .చిన్న వ్యాసంలో ఎన్నో ఎన్నో విశ్లేషించారు.అవన్ని సావిత్రి గారి మీద మరింత అభిమానాన్ని పెంచాయి సార్ .

 • గొప్ప కవిత్వాన్ని గొప్పగా సమీక్ష చేశారు. అభినందనలు

 • Savithri Ma’am s expressions are awesome and the way you holded them and analysed them are simply Excellent Sir
  You owned a different type of keen observation power which was an asset to your analysis
  Your analysis show us the extensive treasure of our literature సర్
  Keep going Sir

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.