మినీ యూరోప్ – బ్రస్సెల్స్ నగరం

బెర్లిన్ చూసిన తరువాత మేము బెల్జియం  రాజధాని బ్రస్సెల్స్ కు over night రైలు  లో బయలు దేరాము. బెర్లిన్ నుంచి బ్రస్సెల్స్ కు ఖచ్చితంగా మనం ఎక్కడో ఒకచోట ట్రైన్ మారక తప్పదు, మేము కొలోన్ అనే నగరం లో మారాము.

ఒక విధంగా చెప్పాలంటే కొలోన్ జర్మనీ లో పేరెన్నికగన్న సాంస్కృతిక నగరం. అక్కడున్న మ్యూజియం లో ఎన్నో పికాసో చిత్రాలు చూడవచ్చని చెప్పారు. మేము చాలా కొంచం సేపు మాత్రమే అక్కడవుండటం వల్ల అవేవి చూడలేక పోయాం. మేము ఎక్కిన  రైలు మమ్మల్ని ఉదయం ఏడు గంటలకు బ్రస్సెల్స్ నగరం లోని సెంట్రల్ స్టేషన్ లో దించింది. మేము ఉండబోయే అపార్టుమెంట్ బ్రస్సెల్స్ నార్త్ స్టేషన్ కు దగ్గరలో ఉండటం తో మేము మెట్రో లో సెంట్రల్ నుంచి నార్త్ స్టేషన్ కు వెళ్ళాం. యూరోప్ లో హాలండ్ మినహా మిగతా దేశాలలో మెట్రో చాలా పాతవి కావడం తో అంత అందంగా వుండవు. దానికి తోడు చాలా చోట్ల exit ,entrance యంత్రాలు కూడా పనిచేయవు. ఇది పారిస్ మెట్రో కు కూడా వర్తిస్తుంది. మెట్రో స్టేషన్ ల పరిశుభ్రత కూడా సింగపూర్,దుబాయ్ ల లాగ గొప్పగా ఉండదు.

బ్రస్సెల్స్ లో చూడదగ్గ ప్రదేశాలు పదిహేను నుంచి ఇరవై దాకా ఉంటాయి. మ్యూజియంలు , ఆర్ట్ గాలరీలు, చరిత్ర ప్రసిద్ధ భవనాలు, ఫుడ్ అండ్ డ్రింక్స్ టూర్లు ప్రధానంగా చెప్పుకోవచ్చు. ఇక బ్రస్సెల్స్ night life గురించి చెప్పాల్సిన పనే లేదు.

బ్రస్సెల్స్ లో ఇంగ్లీష్ మాట్లాడే వాళ్ళు భారీగానే వున్నా అంతే సంఖ్య లో ఫ్రెంచ్ మాట్లాడే వాళ్ళు వున్నారు. బహుశా ఆఫ్రికా దేశాలను వలస చేసుకోవడం వల్ల పారిస్ లో లాగా భారీ సంఖ్యలోనే నల్ల జాతీయులు కనిపిస్తారు. మేము ఐదు రోజుల పాటు  భారతీయ జనాభా బాగా వున్న ప్రాంతం లో వున్నాం. వీరిలో పంజాబీ లు ఎక్కువగా కనిపించారు. చిన్న షాప్స్ , జాబ్స్ లోను భారతీయులు బాగానే కనిపిస్తారు. అయితే, వారి సంఖ్య నల్ల జాతీయుల కంటే తక్కువే.

గతం లో చెప్పినట్లు… ప్రపంచీకరణ లో భాగంగా చైనా, భారతదేశం, దుబాయ్ లలో లాగా  భారీ ఎత్తున వచ్చిన ఆకాశహర్మ్యాలు యూరోప్ లో కనిపించవు కానీ మధ్య యుగం నాటి కట్టడాలు రాజరిక దర్పాన్ని ప్రదర్శిస్తూ భారీగానే కనిపిస్తాయి. బహుశా అవే అక్కడి ప్రధాన ఆకర్షణలు. అవే ఎక్కువగా పర్యాటక వనరులు చేకూర్చేవి కూడాను.  పారిస్ తరువాత బ్రస్సెల్స్ ఖచ్చితంగా ఆ తరహా కట్టడాలతో మనల్ని ఆకర్షిస్తుంది. యూరోప్ గొప్పదనం కట్టడాలతో కంటే వాటిని కాపాడటం లో వుంది. ప్రతి ఒక్కరు దానిని తమ ఆస్తి లాగే జాగ్రత్త పరుస్తారు. బ్రస్సెల్స్ ప్రభుత్వం సైతం వాటిని కాపాడటం లో భాగంగా చారిత్రాక ప్రదేశాలలో షాపింగ్ మాల్స్ రాకుండా చట్టాల ద్వారా కట్టడి చేసింది. అక్కడి చట్టాల ప్రకారం చారిత్రాక భవనాలు కానీ  ఆ భవనాలున్న నివాస ప్రాంతంలోని ఇళ్ల బయటి భాగాలను గాని మార్చడానికి వీలు లేదు. దాని మూలంగా వంద సంవత్సరాల నాటి ఇళ్లు కూడా కనిపిస్తాయి.

బ్రస్సెల్స్ లో చూడదగ్గ ప్రదేశాలలో ప్రధాన మైనవి ఆటోమియం (automium ) , గ్రాండ్ సిటీ (grand city). ఇక్కడే మనం చారిత్రాత్మక కట్టడాలను చూస్తాం, మన్నెకెన్ పిస్ (manneken pis), మ్యూజియంలు, ఆర్ట్ గేలరీ ల తో పాటు యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయాన్ని ముఖ్యంగా  చెప్పుకోవచ్చు.

ఇందులో మన్నెకెన్ పిస్ స్టాట్యూ  చాలా విచిత్రంగా అంత ప్రాధాన్యత లేనిది అనిపిస్తుంది. అది చిన్నదైనా దానికున్న చారిత్రాత్మక నేపధ్యమే దానిని పర్యాటక ప్రదేశంగా మార్చింది.

యూరోప్ వాతావరణం మనకు చాలా దేశాలలో నడిచి చూడడానికి అనుకూలంగా ఉంటుంది.  విపరీతమైన కాలుష్యం, వేడి మూలంగా చాలా ఆసియా దేశాలలో ఈ తరహా యాత్రలు వీలు పడవు. బ్రస్సెల్స్ పలు రకాలైన ‘వాకింగ్ టూర్స్’ కనిపిస్తాయి. వీటి నిడివి ఐదు గంటల నుంచి  ఎంత సేపైనా ఉండవచ్చు. వుదాహరణకు “brussels night walking tour ” brussels day walkin tour” . ఇవే కాకుండా food based walking tour లు కూడా ఇక్కడ చాలా ప్రసిద్ధం. ఇందులో “chacolate walking tour “, “brussels beer walking tour ” చెప్పుకోదగ్గ ఆకర్షణలు.

బ్రస్సెల్స్ లో మా విడిది ఐదు రోజులు కావడం మూలాన మేము అక్కడ అన్ని ప్రదేశాలను , food సంబంధ walking tours లో ను పాల్గొన్నాము. “చాకొలేట్, బీర్ వాకింగ్ టూర్ లలో మేము దాదాపుగా రెండు డజనుల పైగా వివిధ రకాల చాకొలెట్లను, వివిధ రకాల బీర్లను రుచి చూసాము. మా టూర్ గైడ్ ఫ్రాన్స్ నుంచి వచ్చి బ్రస్సెల్స్ లో స్థిరపడిన కుటుంబం నుంచి వచ్చింది. చక్కటి వాక్చాతుర్యంతో, కలివిడి తనంతో అందరిని బాగా ఆకర్షించింది. మేము చేసిన చాలా చాకొలేట్ హౌసెస్ లో ఆర్డర్ ఇస్తే మన రుచి కి తగినట్లుగా తయారు చేసి ఇస్తారు. బయటితో పోల్చెతే ధర కొంచం ఎక్కువ గాని, రుచి లోనూ ఆమాత్రం వ్యత్యాసం వుంటుంది. యాత్ర లో దాదాపుగా అన్ని ఖండాల నుంచి వచ్చినవారు కనిపిస్తారు. వాకింగ్ టూర్ నిడివి ఐదు గంటలు కావడం వలన పర్యాటకులు  ఎక్కువగా యువతరమే వున్నారు.

బ్రస్సెల్స్ లో యూరోపియన్ యూనియన్ ప్రధాన కార్యాలయం వుంది దానికి అనుబంధంగా ఓ పెద్ద పుస్తకాలయం, ఒక మ్యూజియం కూడా వున్నాయి. యూరోపియన్ పార్లమెంట్ లో ఎక్కువగా బహుళ జాతి సంస్థలకు అనుకూలంగా, కమ్యూనిస్టు లకు వ్యతిరేకంగా పోస్టర్లు, పుస్తకాలు కనిపిస్తాయి. ఒక పెద్ద పోస్టర్ లో “stop communism , it is everybodys duty ” అని వ్రాసి ప్రముఖంగా పెట్టారు.

బ్రస్సెల్స్ ఒక మినియేచర్ యూరోప్ ను  మనకు చూపిస్తుంది. పారిస్ లోని ఈఫిల్ టవర్  లాంటివి ప్రపంచ ప్రాముఖ్యం సంపాదించు కోవడం వల్ల బ్రస్సెల్స్ లోని గ్రాండ్ సిటీ లాంటివి పర్యాటక రంగం లో కొంచెం వెనుక పడ్డాయి. లేక పోతే ఇటలీ తరువాత అలాంటి చారిత్రాత్మక ప్రదేశాలు బ్రస్సెల్స్ చుట్టుపక్కలే వుంటాయి. దానికి తోడు ఫ్రాన్స్ , నెథర్లాండ్స్, లక్సమ్బెర్గ్, జర్మనీ లు బెల్జియం కు  సమాన దూరంలో ఉంటాయి.

జియెల్ నర్సింహా రెడ్డి

తన గురించి తానే  జియెల్ నర్సింహా రెడ్డి: ఆరేళ్ల క్రితం మేము ( నేను, నా భార్య లక్ష్మి ) తక్కువలో తక్కువ గా ప్రపంచం మొత్తంగా చూడటానికి ఎంత ఖర్చువుతుందో బేరీజు వేశాం. ఐదు లక్షలయితే అమెరికా ఖండం తో సహా  యాభయ్ దేశాలను చూడవచ్చని భావించాం. మొదట సింగపూర్, కాంబోడియా, థాయిలాండ్ లతో మొదలైంది మా ప్రయాణం. ఖర్చు మేమనుకున్నంత కన్న చాలా తక్కువే అయ్యింది. ఇప్పటికి మేము ఆసియా, యూరోప్, ఆఫ్రికాలలో ఇరవై పైగా దేశాలు చూశాం. ఇంకా చూస్తాం. ఈ ప్రయాణాల కథ అందరూ వింటానికి బాగుంటుందని ... మా యాత్రానందాన్ని మీతో పంచుకుంటున్నాం.

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.