ఎరుక

ఓ పక్క చిరిగిన దిండు, చెదలుపట్టిన కర్రలు
కాలిన దేహాల నుండి రాలిన బూడిద
వాడిన పూలమాలల,కింద శవాల్ని పెట్టుకొని ఉబ్బిన నేల

ఇప్పుడే
నిన్న రాలిపోయన ఇరవై రెండేళ్ల కుర్రాడి శవాన్ని
ఇక్కడి కి తీసుకొచ్చాం
సాయంత్రం నుండి
వాళ్ళ అమ్మ
తుపానుకి వణుకుతున్న చెట్టులా ఉంది
ఊరంతా వైరాగ్యపు గాలి
వాడి జ్ఞాపకాలను చెప్తూ
ఆమె
నీళ్లు లేని పొలం లా మారింది
అప్పుడెప్పుడో
వాళ్ళ నాయన కూడా ఇలా నే వెళ్ళాడు

చివరి స్నానం
ఎండు గడ్డి వేశారు
ఏడు కట్లు కట్టారు
పాడెకి కట్టిన కోడిపిల్ల
బతుకును వ్యాఖ్యానిస్తూ
భయం భయం గా అరుస్తొంది
బ్రహ్మం గారి భక్తులు తత్వాలు పాడుతున్నారు
బాధగా రాలుతున్న పూలు
ఎగిరి పడుతున్న
బొమ్మా బొరుసు
అంతిమ యాత్ర

రేపటి నుండి
ఎవరి మరణం వారికి
ఎరుక లేకపోవడమే జీవితం

సుంకర‍ గోపాలయ్య

సుంకర గోపాలయ్య: కాకినాడ, పిఠాపురం రాజా కళాశాలో తెలుగు శాఖాధిప‍తి. సొంత ఊరు నెల్లూరు. రాధేయ కవిత పురస్కార నిర్వాహకులు. కొన్ని పిల్లల కవితా సంకలనాలకు సంపాదకత్వం వహించారు.

17 comments

 • జీవితసత్యాన్ని నినదించిన సుంకర గోపాలుని ‘ఎరుక’
  జీవితం శాశ్వతమని భ్రమించు జనులకు సున్నిత చురక

 • ఙివితం ఒక ప్రయాణం లో జరిగే సన్నివేశం అని ఈ కవిత తో స్ఫురించారు . అద్భుతం .

 • మరణం.. ఎప్పుడు ఎలా ఎక్కడ వస్తుందో ఎవరికీ తెలియదు..ఈ విషయం తెలుసుకున్నవారు మరణానంతర జీవితం గురించి మదన పడుతూ భూమి మీద మంచి పనులు చేస్తుంటారు..

 • అమ్మ నీ తుఫాన్ కి వణుకు తున్న చెట్టు లా…..
  నీళ్ళు లేని పొలం లా.. … ఆమె బాధ కు తగ్గట్టు గా
  మంచి వర్ణ న

 • తేలికైన మాటలు.. బరువెక్కిన భావాలు..
  ఎండు గడ్డి లాంటి వచనాలు.. ఎరుపుక్కెన కన్నీళ్ళు..
  బతుకు చివరి వ్యాఖ్యానం చేస్తూ.. బ్రహ్మ ఎరుకను చెప్పిన
  మిత్రుడి కవిత చాలా బాగుంది

 • ఎవరి మరణం వారికి బహిరంగ రహస్యమే
  అయితే ఎరుక లేకపోవడమే తాత్విక రహస్యం
  మృత్యువు అంచులమీద మనిషిని నిలబెట్టి వ్యాఖ్యానించడమే నీ కవితా రహస్యం గోపాల్

 • సార్…. జీవితం అంటే లేని బిజీ ని కల్పించుకొని డబ్బు సంపాదన, స్వార్థ చింతనలే పరమావధులుగా భావిస్తూ ప్రశాంతంగా జీవించడం మరిచిపోయిన ప్రతి మనిషికి తాను మనిషినన్న విషయం ఎరుక చేస్తుంది మీ కవిత…..

 • సార్…. జీవితం అంటే లేని బిజీని కల్పించుకొని డబ్బు సంపాదన, స్వార్థ చింతనలే పరమావధులుగా భావిస్తూ…. మానవ విలువలను విస్మరించిన వారికి తాను ఒక మనిషినన్న విషయాన్ని ఎరుక చేస్తుంది మీ కవిత…..

 • Marananthram manshi ilanti bhavalanu ,,,,,,saprsistheee,,,,manshi maranani korukoduuu,,,,,,,,,manshi anthimayarathra a manishi chudlekapovadamm oka anubuthi,,,,,a anubhuthiii avrki arrukaaa sir,,,,,,,,,meeeekaaaaaa???????? Lekaaaaaa nakaaaaaa??????

 • మీ కవిత్వం అద్భుతం….. ఒక మనిషి జీవితమును చాలా చక్కగా వర్ణించారు….. మీ కవిత్వానికీ నా జోహార్లు……….

  మీ అభిమాని
  కృష్ణకాంత్

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.