చెవులకూ ఇంపైన
తెలుగు కవిత

కేసరి మురళీధర్ గారు ఫ్రూట్ జ్యూస్ పేరుతో తెలుగు కవుల కవితలను వారి గొంతులోనే వినిపిస్తూ యూ ట్యూబ్ లో ఒక కార్యక్రమం నిర్వహిస్తున్నారు. చిరకాలంగా జతుగుతున్న ఈ మంచి కృషి లోంచి ఆయా కవుల పరిచయాలు, వారి కవితా పఠనాల యూ ట్యూబ్ లింకులను రస్తా ద్వారా (కూడా) అందించాలనుకుంటున్నాం. ఇదిగో రస్తా మేరకు ఈ సిరీస్ లో మొదటిది మనందరికీ ఇష్టుడైన కవి శివుడితో మొదలెడుతున్నాం…. ఎడిటర్ 

 ఇటీవల ప్రతిష్టాత్మకమైన సరస్వతీ సమ్మాన్ పురస్కారాన్ని పొందిన ప్రముఖ తెలుగు కవి – కె. శివారెడ్డి. తెలుగు కవిత్వం ముద్దుబిడ్డల్లో ఒకరు. సిటీలో నివసిస్తున్నా, సింప్లిసిటీయే ఆయనకు ఆభరణం. ఆగస్ట్ 1, 1967 నుంచి వివేకవర్ధని డిగ్రీ కళాశాల , హైదరాబాద్ లో ఇంగ్లీష్ లెక్చరర్ గా కెరీర్ ప్రారంభించి, 1999లో ప్రిన్సిపల్ గా రిటైర్ అయ్యారు. శివారెడ్డి గారి మొదటి కవితా సంపుటి పేరు..‘రక్తం సూర్యుడు’. మొత్తం 16 కవితా సంపుటాలు వెలువడ్డాయి. 1990లో మోహనా! ఓ మోహనా! కవితా సంపుటికి కేంద్ర సాహిత్య అకాడెమీ అవార్డ్ లభించింది. వివిధ దేశాల్లో మన దేశం తరఫున పాల్గొని, తన కవిత్వాన్ని వినిపించిన శివారెడ్డి గారు, వర్ధమాన కవుల్ని ప్రోత్సహించడంలో, వారికి మార్గదర్శనం చేయడంలో.. ముందు వరసలో ఉంటారు..

కింది లింక్ మీద క్లిక్ చేయండి:

 

మురళీధర్ కేసరి

1 comment

  • భలే భలే…..ఈ శీర్షిక నవ్యమైనది. కంగ్రాట్స్ టూ రస్తా

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.