ఖాళీ

ఎగసిపడి ముంచేసిన అల
ఇప్పుడు వెళ్ళిపోయింది..
ఇందాకటిదాకా
కన్నుల్లో నిండలేని ఉప్పెన
ఇప్పుడు ఏ అంచునా లేదు..
అత్యంత భీకరమైన హోరు
గాలితో వెనక్కి పయనమైంది..
ఊపిరి బిగబట్టిన క్షణం
గతమై మరుగయ్యింది..
రెక్కలొచ్చిన తీరంలోంచి
జ్ఞాపకం విసిరేయబడింది..
ఒంటరి నేల ఒకటి
గుండెను తడుముకుంటుంది..
పీల్చి వదిలిన శ్వాస దేహం
నీటిపొరల కిందకు చేరుకుంటుంది..
నిలవలేకపోయిన జీవితంలో
నీ నిశ్శబ్దం సాక్షిగా
నాలోని నువ్విప్పుడు ఓ ఖాళీ..

స్వేచ్ఛ

స్వేచ్ఛ 'మట్టి పూల గాలి' అనే తొలి కవితా సంపుటితో మంచి పేరు తెచ్చుకున్న యువకవయిత్రి . పేరుకు తగ్గట్టు తన కోసం మంది కోసం స్వేచ్ఛను కోరుకుంటారు. ఉస్మానియాలో చదువుకుని, ప్రస్తుతం టీవీ 9 లో పని చేస్తున్నారు.

3 comments

  • బరువు దింపేసుకున్న హృదయం తీసుకున్న ఊపిరిలా ఉందీ కవిత.. నీ నిశ్శబ్దం సాక్షిగా నా లోన నువ్విపుడు ఓ ఖాళీ.. చాల బావుంది స్వేచ్ఛ

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.