స్త్రీ వాదానికి ఆద్యులు:  బ్రాంటీ సిస్టర్స్

పదకొండవ శతాబ్దం లోని పారిశ్రామికీకరణ ఇంగ్లాండ్ లో పెను మార్పులు తెచ్చింది. ఒకవైపు సంప్రదాయం, మరొకవైపు అభ్యుదయం సంఘర్షణను, సాహిత్యం లో కూడా మార్పును తెచ్చాయి. వేగంలో మార్పుతో పోటీపడలేక మానవుడు అంతర్ముఖుడయ్యాడు. వ్యక్తిగత సంబంధాలు, గృహ సంబంధమైన విలువలు పెంపొందించుకునేందుకు కృషిచేశాడు. వీటికి 18 శతాబ్దంలోనిఎవాంజెలికల్ ఉద్యమంచర్చ్ గురించి కాక ఇల్లు, కుటుంబం గురించిన విలువలపై శ్రద్ధ పెట్టింది. పారిశ్రామికీకరణకు దూరంగాఇంటినే ఒక స్వర్గంగా, నిజాయితీ, పరస్పర అనురాగాల హరివిల్లుగాతీర్చిదిద్దాలనే ప్రయత్నం జరిగింది.

రస్కిన్, కార్లైల్, కాలగర్ వంటి రచయితలు గృహమే స్వర్గంగా, నీతినియమాల పొదరిల్లుగా దాని చుట్టూ పాత్రలను మలచి, విలువలను నేర్పించే పాఠశాలలుగా సమాజానికి అందించారు. విక్టోరియన్ కాలంలో అంశాలను పొదివి పుచ్చుకునినవలా సాహిత్యం’, ఎలైన్ షోవాల్టర్ అన్నట్లుగాస్త్రీ జీవితపు దృక్కోణాన్ని, స్త్రీ అనుభవాల్ని ప్రతిబింబించి చింది’. స్త్రీ ఒక వ్యక్తిగా, రచయితగా, కళాకారిణిగా పితృస్వామ్య సమాజంలో తన స్థానాన్ని వెతుక్కునేందుకు, నిలుపుకునేందుకు యుగంలో ఒక మార్పును సృష్టించింది’. షాలెట్, ఎమిలీ, ఆన్ బ్రాంటేలు వ్యక్తి సంబంధాలు, కుటుంబ వ్యవస్థల గురించి, వ్యక్తుల జీవితాలను ఇవి ఎలా ప్రభావితం చేస్తాయో నిరూపించారు.

ఆంగ్ల సాహిత్యంలో మహిళా రచయిత్రులు గా జేన్ ఆస్టిన్ తర్వాత వర్జీనియా వుల్ఫ్, కేథరీన్ మాన్స్ ఫీల్డ్ సరసన చేరిన నవలా రచయిత్రులు గా పేరు పొందిన వారు షాలెట్, ఎమిలీ, ఆన్ బ్రాంటేలుకలిసిబ్రాంటే సిస్టర్స్’. విక్టోరియన్ సమాజపు కట్టుబాట్లను, సాంప్రదాయక కుటుంబాల నైతిక వ్యవస్థ, మత సంబంధమైన ఆచారవ్యవహారాలతో కూడిన జీవనశైలి, మనుషుల మనస్సులలో దాగిన చీకటి వెలుగులు, మానవ సహజమైన ప్రేమపగ, వైఫల్యాలు, వీటిమధ్య ఎదిగే స్త్రీలు, వారి జీవితంలోని ఒడిదుడుకులను నవలల ఇతివృత్తాలుగా సోదరీమణులు చిత్రించారు.

పారిశ్రామికీకరణ జరుగుతున్న కాలంలో ప్యాట్రిక్ బ్రాంటే, మరియా సంతానంగా షాలెట్ (1816), బ్రాన్ వెల్ (1817), ఎమిలీ (1818), ఆన్ (1820) బ్రాంటే లు జన్మించారు. పాట్రిక్ బ్రాంటే 1820 లో నుంచి తన కుటుంబాన్ని యార్క్ షియర్ నుంచీ హావర్త్ కు తరలించడం, హావర్త్ నైసర్గిక స్థితి, కలుషిత వాతావరణం, నీరు వల్ల స్కార్లెట్ ఫీవర్ కలరాతో ప్యాట్రిక్ కుటుంబం ఇద్దరు పిల్లలను పోగొట్టుకుంది. పిల్లలంతా చిన్నవాళ్లు, మరియా అస్వస్థతకు లోనుకావడంతో ఆమె కుటుంబాన్ని చూసుకోవడానికి ఆమె సోదరి ఎలిజబెత్ ఇంటికి వచ్చింది. అనతికాలంలోనే 1821లో మరియా కాన్సర్ తో కన్నుమూసింది. పాట్రిక్ బ్రాంటే కు చిన్న పిల్లల పట్ల ప్రేమ ఉన్నప్పటికీ వారితో కలిసిమెలిసి ఉండడం కానీ వారి పట్ల ప్రేమను వ్యక్తపరచడం కానీ చేసేవాడు కాదు. ఎప్పుడూ తన చర్చ్ కార్యక్రమాల్లో మునిగి తేలే వాడు.

షాలేట్, ఎమిలీ, ఆన్  బ్రాన్ వెల్ లు తమ పిన్ని సంరక్షణలో పెరిగారు. వారిని ఆడించడానికి పాట్రిక్ తెచ్చిన సైనికుల బొమ్మలు వారిలో వింత ఆలోచనలు రేకెత్తించాయి. వాటితో సృజనాత్మకంగా కథలు అల్లడానికి తోడ్పడ్డాయి. వారు తయారు చేసిన చిన్న చిన్న కథల పుస్తకాలు చూసి పాట్రిక్ ఎప్పుడూ మెచ్చుకునే వాడు కాదు, కానీ వారు మాత్రం వారి కథా రచనలు కొనసాగించారు.

షాలేట్, ఎమిలీ ని తక్కువ రుసుములు కలక్లెర్జీ డాటర్స్ స్కూల్లో చేర్పించాడు పాట్రిక్. కఠోరమైన క్రమశిక్షణ, దుర్భరమైన వసతులు, తిండి భరించలేక వారు ఇంటి ముఖం పట్టారు. ఇంట్లో చదువులు, ఆటపాటలతో వారు భవిష్యత్తులో నవలలు రచించేందుకు కావలసిన పునాది ఏర్పడింది.

వారు పెద్దయాక ఉపాధ్యాయులుగా, పిల్లలను సంరక్షించే గా గవర్నెస్ లుగా పనిచేశారు. వారు ముగ్గురూ కలిసి ఒక పాఠశాలను కూడా ఏర్పాటు చేశారు. కానీ విద్యార్థులను ఆకట్టుకోలేకపోవడంతో ఎమిలీ ఇంగ్లాండ్ కు వెళ్లిపోవడంతో షాలెట్ అక్కడే ఉండిపోయింది. కాన్ స్టాంటిన్ హెగర్ షాలెట్ నవలా రచయిత్రిగా ఎదగడానికి దోహదపడ్డాడు. వారి కాలంలో స్త్రీలకు రచనా స్వేచ్ఛ లేకపోవడంతో వారు పురుషుల మారుపేర్లతో (క్యూరర్, ఎలిస్, ఆక్టన్ బెల్) కవిత్వం రాశారు. పేర్లతోనే రచనలు చేస్తూ సమాజంలో వారి స్థానాన్ని పదిల పరుచుకున్నారు. 1847 లో షాలెట్జేన్ ఐర్ ను, ఆన్ఆగ్నెస్ గ్రే ను, ఎమిలీవుదరింగ్ హైట్స్ను ప్రచురించారు. ఆన్ 1848లో టేనెంట్ ఆఫ్ వైల్డ్ ఫెల్ హాల్ అనే నవల వ్రాసింది.

వారి సోదరుడు జీవితంలో స్థిరపడలేక ఆల్కహాల్ కు బానిసై 1848లో 31 ఏట మరణించాడు. ఎమిలీ కూడా క్షయ వ్యాధితో బాధపడి 1848లో , ఆన్ 1849 లో మరణించింది. షాలెట్ ఆర్ధర్ బిల్ నికోల్స్ ను 1854 లో పెండ్లాడింది, కానీ అనారోగ్యంతో ప్రసవ సమయంలో మార్చి 31 1855లో 38 సంవత్సరాల వయసులో మరణించింది. చిన్న వయసులోనే మరణించినా గొప్ప మహిళా రచయిత్రులుగా సాహితీ ప్రపంచంలో నిలిచి పోయారు. తాను బతికుండగానే తన పిల్లల మరణాన్ని చూసి కుంగిపోతూ 1861 లో 84 సంవత్సరాల వయసులో పాట్రిక్ బ్రాంటే మరణించాడు.

షాలెట్ బ్రాంటే ప్రొఫెసర్ (1857), ‘జేన్ ఐర్ (1847 ), ‘షర్లీ’(1849), ఆన్ఆగ్నెస్ గ్రే’ (1847), ఎమిలీ బ్రాంటేవుదరింగ్ హైట్స్ (1847) వ్రాసారు.

షాలెట్ బ్రాంటే నవలలలో మొదటిగా ప్రచురింపబడి పేరుపొందినదిజేన్ ఐర్’. స్త్రీ జీవితం, విద్య, పాఠశాలల్లోని దుర్భర పరిస్థితులు, ఉపాధ్యాయుల క్రూరత్వం, వైద్య సదుపాయాలు లేకపోవడం, కుటుంబపరమైన సమాజంలో స్త్రీ స్థానం, కళాత్మక దృష్టి, సుఖసంతోషాలకై వెంపర్లాట, ఇవే కాకుండా బ్రిటన్, దాని కాలనీలు, భారత దేశంలో క్రైస్తవ మతం వంటి అంశాలను ప్రస్తావిస్తుంది.

బాల్యంలోనే అనాథగా మారిన 10 సంవత్సరాల జేన్ తన మేనత్త  సారా రీడ్ తో ఉంటుంది. ఆమెను  ఎవరూ అభిమానించక ఆమెనులో వుడ్ స్కూల్కు పంపుతారు. అక్కడ ఎంతో దుర్భరమైన జీవితం గడుపుతున్నా  జేన్ ఇంటికి పోక అక్కడే ఉండేందుకు ఇష్టపడుతుంది. మిస్ టెంపుల్ , హెలెన్ బర్న్స్ అనే వారితో స్నేహం చేసి వారి నుంచి చాలా మంచి లక్షణాలు నేర్చుకుంటుంది. శ్రమించి చదువుకుని ఏడెల్ వార్న్స్ అనే విద్యార్థినికి అధ్యాపకురాలిగా చేరుతుంది. అక్కడ రోచెస్టర్ అనే యువకుడిని ప్రేమిస్తుంది. రోచెస్టర్ బ్లాంష్ అనే ఆమెను పెళ్లాడేందుకు సిద్ధపడతాడు. ఈలోపు అతని పట్ల తన ప్రేమను వ్యక్తం చేస్తుంది. వారిద్దరూ పెళ్లాడ బోయే సమయంలో అతనికి అప్పటికే బెర్తా అనే ఆమెతో పెళ్ళయిందని తెలిస్తుంది.

జేన్ తన దగ్గరున్న కొంత ధనం తో రాత్రికి రాత్రే ఇల్లు విడిచి వెళ్ళిపోతుంది. సెయింట్ జాన్ రివర్స్ అనే చర్చి పూజారి ఆమెకు ఆశ్రయం కల్పిస్తాడు.  తన ప్యారిష్ లో ఉపాధ్యాయురాలిగా చిన్న ఉద్యోగం ఇప్పిస్తాడు. ఇంతలో సెయింట్ జాన్ కు జేన్ కు ఇరవై వేల పౌండ్ల ఆస్తి ఉందని తెలుస్తుంది. దానిలో తాను, తన అక్క చెల్లెళ్ళు భాగస్వాములని కూడా గ్రహిస్తాడు. జేన్ కూడా తన ఆస్తిని పంచడానికి అంగీకరిస్తుంది. లోపు సెయింట్ జాన్ భారతదేశంలో మిషనరీ గా వెళ్లేందుకు నిర్ణయించి తన భార్యగా జేన్ ను రమ్మని వత్తిడి చేస్తాడు. దాదాపు తన ప్రయత్నంలో సఫలీకృతుడయ్యేలోగా గా జేన్ కు రోచెస్టర్ పిలుస్తున్నట్లు అనిపిస్తుంది. వెంటనే ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. రోచెస్టర్ ఫెర్న్ డీన్ లో ఒంటరిగా ఉన్నాడని తెలుసుకుంటుంది. వారిద్దరూ పెండ్లాడి ఒకటవుతారు. కథలోని పాత్రలు కూడా సుఖంగా జీవిస్తాయి.

1849లో ప్రచురింపబడ్డ షర్లీ ఒక స్త్రీ జీవితంలోని ఒడిదుడుకులను, సంఘంలోని ఆర్థిక సంబంధాలను, మానసికమైన సంఘర్షణలను, కెరోలీన్, షర్లీ పాత్రల ద్వారా చూపెడుతుంది. కెరోలీన్ ఒక అనాథ యువతి. ఆమె తన కఠినమైన నిబంధనలను నిర్ణయించే మామ సంరక్షణలో పెరుగుతూ ఉంటుంది. అదే ఊళ్ళో రాబర్ట్ అనే ఒక సా మిల్ యజమాని ని ప్రేమిస్తుంది. అయితే రాబర్ట్ ఆర్థికమైన సంక్షోభంలో ఉండడం వల్ల తన నిస్సహాయతను వ్యక్తం చేస్తాడు. అయితే షర్లీ మధ్య తరగతి కుటుంబం లోని తల్లిదండ్రులను కోల్పోయిన పిల్ల. ప్రయర్ అనే గవర్నెస్ సంరక్షణలో పెరుగుతూ సంతోషంగా తన ఇష్టమొచ్చినట్లు ఉండగల యువతి. షర్లీకి రాబర్ట్ నడిపే సా మిల్ పై ఆసక్తి ఉంటుంది. దాని ద్వారా మరింత డబ్బు సంపాదించవచ్చనే వ్యాపార ఆలోచనలతో ఉంటుంది. రాబర్ట్ ను తరచూ కలిసి మాట్లాడుతూ ఉంటుంది. అందరూ వారిద్దరూ వివాహం చేసుకుంటారని అనుకుంటారు. కెరోలీన్ మిల్ లో ఉద్యోగం చేయాలనుకుంటుంది కానీ తన మామ అంగీకరించడు. షర్లీ కెరోలీన్ ను తన గవర్నెస్ ప్రయర్ కు పరిచయం చేస్తుంది. ప్రయర్ కెరోలీన్ను తన కుమార్తె గా గుర్తిస్తుంది. పెంచలేని నిస్సహాయతతో వదిలి వేసుకున్న విషయాన్ని ఆమెకు చెప్పి బాధపడుతుంది. అయితే కేరోలిన్ తన తల్లిని కలుసుకున్నందుకు చాలా సంతోషిస్తుంది.

లోపు రాబర్ట్ షర్లీకి ఆమె పట్ల గల ప్రేమను తెలియజేస్తాడు. అయితే ఆమె నిర్ద్వంద్వంగా నిరాకరిస్తుంది. అవమానంతో నిరాశతో అతను లండన్ వెళ్ళి పోతాడు.  అతని స్థానంలోకి అతని తమ్ముడు లూయిస్ వస్తాడు. కెరోలీన్ ఇదంతా తన మూలంగానే జరిగిందని భావించి మిన్నకుంటుంది. రాబర్ట్ లండన్ నుంచి తిరిగి వచ్చాక అతని ఉద్యోగులు చుట్టుముడతారు. తిరిగి ఉద్యోగాలు ఇమ్మని ఒత్తిడి చేస్తారు. తన నిస్సహాయతను వ్యక్తపరచినపుడు వారిలో ఒకడు రాబర్ట్ ను కాలుస్తాడు. కెరోలీన్ రాబర్ట్ ను రక్షించే ప్రయత్నం చేస్తుంది. అతను బాగుండాలని ప్రార్థిస్తుంది. అతను తెలివి లోకి వచ్చినప్పుడు అతను షర్లీని ప్రేమిస్తున్నా సరే అతన్నే ప్రేమిస్తున్ననని చెబుతుంది. కానీ అతడు ఆమె ఉద్దేశం సరికాదని తానూ ఆమెనే ప్రేమిస్తున్నానని చెప్తాడు. లూయిస్ ని షర్లీ అంగీకరిస్తుంది. రెండు జంటలు పెళ్లాడడంతో నవల ముగుస్తుంది. ధనిక పేద వర్గాల తారతమ్యాలు, ఇలాంటి సంఘర్షణల నేపధ్యంలో సాగే ప్రేమలు, పేద ధనిక వర్గాల్లో వేర్వేరుగా ఉన్న సాంఘీక కట్టుబాట్లు, సున్నితమైన అంతరంగాలు, మానసిక స్థితిగతులను షాలేట్ నవలలో చిత్రీకరిస్తుంది.

షాలెట్ వ్రాసిన మరొక నవలవిలిట్’ 1853లో ప్రచురింపబడింది. ఇది లూసీ స్నో అనే యువతి చుట్టూ తిరిగే సాహసోపేతమైన ప్రేమ కథ. కుటుంబంలో ఒక దుష్పరిమాణం తర్వాత కథానాయకురాలు లూసీ స్నో ఇంగ్లాండ్ వదిలి ఫ్రాన్స్ లోని ఒక వ్యూహాత్మక విలిట్ నగరానికి ఒక పాఠశాలలో పనిచేసేందుకు వస్తుంది. ఆమె మేడం బెక్ అనే యజమానురాలిని తన ప్రవర్తనతో, ఆంగ్లభాషా నైపుణ్యం తో ఆకట్టుకుంటుంది. డాక్టర్ జాన్ గ్రహం బేటన్ అనే లూసీ చిన్నతనపు స్నేహితుడు కూడా విలెట్ నగరంలో పని చేస్తూ ఉంటాడు. లూసీ కి అక్కడ జినేర్వా ఫాన్షార్ తో స్నేహం ఏర్పడుతుంది. జినేర్వా కు ప్రేమ సందేశాలు పంపేవారిలో డా.జాన్ కూడా ఒకడని తెలుసుకుంటుంది. పాల్ అనే సాహిత్యాన్ని బోధించే ప్రొఫెసర్ లూసీని గమనిస్తూ ఉంటాడు. పాలినా అనే యువతి లూసీ చిన్నప్పటి స్నేహితురాలు. డాక్టర్ జాన్, లూసీ కన్నా వయసులో చాలా చిన్నది పాలీ డా.జాన్ ను ప్రేమిస్తుంది. జినేర్వాను ప్రేమించే డా. జాన్ కూడా పాలీ తో ప్రేమలో పడతాడు. వారిద్దరూ పెళ్లాడతారు. ఇంతకుముందు జాను ప్రేమించిన జినెర్వ పాలీ పట్ల చాలా అసూయపడుతుంది.

లూసీ, పాల్ మంచి స్నేహితులవుతారు.పాల్ ఆమెను క్యాథలిక్ మతం లోకి మార్చాలని చూస్తాడు కానీ ఆమె అంగీకరించదు. అతను గ్రాడలూప్ వెళ్లాలని ఒక ఇంటిని ఆమెకు కొంటాడు. పెళ్లి చేసుకునేందుకు ప్రమాణం చేసుకుని అతను బయలుదేరుతాడు. అనుకోని విధంగా ఒక స్నేహితురాలి ఆస్తిని పొందిన లూసీ తాను స్థాపించిన స్కూలును ఒక పెద్ద బోర్డింగ్ స్కూల్ గా మారుస్తుంది. ఒక నౌకా ప్రమాదం లో మరణించాడని సూచనగా తెలుసుకున్న లూసీ అతని జ్ఞాపకాలలో ఒంటరిగా నివసిస్తూ ఉండిపోతుంది.  

షాలెట్ మొదటగా వ్రాసిన నవల ప్రొఫెసర్ అయితే అది 1857 లో ఆమె మరణం తర్వాత ప్రచురింప పడింది. మిగిలిన నవలలలో కథానాయికల వలే కాక దీనిలో కథానాయకుడు ప్రధాన పాత్ర పోషిస్తాడు. విలియం క్రిమ్స్ వర్త్ చాలా విద్యాధికుడు తెలివైనవాడు. మామయ్య చెప్పినట్లు మత ప్రవక్త కావటం ఇష్టంలేక ధనికుడైన సోదరుడు ఎడ్వర్డ్ ను కలుస్తాడు. అతను క్రీమ్స్ వర్త్ కు ఒక క్లర్క్ ఉద్యోగం ఇస్తాడు. అతని తెలివి తేటలకు అసూయపడి ఎప్పుడు అవమానిస్తూ ఉంటాడు. క్రిమ్స్ వర్త్ బెల్జియం లోని ఒక బాలుర బోర్డింగ్ స్కూల్ లో కొత్తగా వుద్యోగం సంపాదించుకుంటాడు. స్కూల్ నిర్వాహకుడు పెలెట్ చాలా సాదరంగా ఆహ్వానిస్తాడు. ప్రేమతో చూస్తాడు. క్రింస్ వర్త్ గొప్ప బోధనా పటిమ పక్కనే ఉన్న బాలికల స్కూలు ప్రధానోపాధ్యాయురాలు రూటర్ తెలుసుకుని ఆమె పాఠశాలలో ఒక పెద్ద ఉద్యోగం ఇస్తుంది. అతను ఆమె అందచందాలకు ముగ్ధుడై ఆమె పట్ల ఆకర్షితులవుతాదూ. కానీ పెలెట్ రూటర్ పెళ్లి కి సిద్ధమవుతున్నారని గ్రహించి మిన్నకుండిపోతాడు. అక్కడ పనిచేసే ఒక ఉపాధ్యాయిని ఫ్రాన్సెస్ కు కొన్ని నైపుణ్యాలను నేర్పిస్తూ ఆమెను ప్రేమిస్తాడు క్రింస్ వర్త్. రూటర్ అసూయతో ఫ్రాన్సిస్ ను తొలగిస్తుంది. ఆమె చిరునామా కూడా దొరక్కుండా చేస్తుంది. వెతికి కనుక్కుంటాడు. రూటర్ కూడా తనను ప్రేమించిందని అందుకే ప్రాన్సెస్ ను పంపించి వేసిందని గ్రహిస్తాడు. పెలెట్ రూటర్ మధ్య వివాదం లేకుండా ఉండేందుకు స్కూలును వదిలి వేరొక కళాశాలలో ప్రొఫెసర్ గా ఉద్యోగం సంపాదిస్తాడు. ఫ్రాన్సెస్ ను పెండ్లాడి సుఖంగా జీవిస్తాడు. ఆర్థిక స్వాతంత్రం పొందాక ఇంగ్లాండ్ పరిసర ప్రాంతాల్లో ఒక పల్లె లో స్థిరపడతారు.

ఆక్టాన్ బెల్ పేరుతో ఆన్ బ్రాంటే వ్రాసిన రెండు నవలలో మొదటిదిఆగ్నెస్ గ్రేఅనే నవల. నవలలో ఆమె స్త్రీల పట్ల అణచివేత, ఒంటరితనం లోని బాధను, సహానుభూతి ఈయవలసిన, జంతువుల పట్ల ప్రేమను చూపించాల్సిన అవసరాన్ని చూపుతుంది. ఆగ్నెస్ ఒక మత ప్రవక్త కూతురు. కుటుంబం గడవని పరిస్థితి లో ఆమె అలవికాని పిల్లల ఇంట్లో గవర్నెస్ గా వెళ్తుంది. అక్కడ ఒక పిల్లవాడు ఆమె పట్ల దురుసుగా ప్రవర్తిస్టాడు. ఆమె మాట వినడు. పిల్లల తల్లిదండ్రులు పిల్లల్ని ఏమీ అనడానికి కూడా అంగీకరించరు. ఒకరోజు పిల్లవాడు చిన్న పక్షి పిల్లలను హింసిస్తుంటే చూడలేక గూటిని ధ్వంసం చేస్తుంది. దాంతో ఆమె ఉద్యోగం పోతుంది.

తర్వాత ఇద్దరు యువతులున్న కుటుంబంలో గవర్నెస్ గా చేరుతుంది. వారిలో పెద్ద అయిన రోజాలీ యువకులను ఆకర్షించి, వారితో తిరిగి, ప్రేమలో దింపి, తృణీకరించి, వారు మానసిక వ్యాధితో బాధపడుతున్నప్పుడు నిజమైన ఆనందాన్ని పొందుతూ ఉంటుంది. ఆమెకు సర్ది చెప్పడానికి చాలా ప్రయత్నిస్తుంది, కానీ విఫలమవుతుంది. తరుణంలో చర్చి దగ్గర కొత్త క్యూరేట్ గా వచ్చిన వెస్టన్ను కలిస్తుంది. అతని పద్ధతులకు, క్రమశిక్షణకు ఆకర్షితురాలవుతుంది. రోజాలీ కూడా అతని వెంట పడుతుంది. కానీ సఫలం కాదు. ఆగ్నెస్ గురించి అతనికి అబద్దాలు చెప్తుంది.

తండ్రి చనిపోవడంతో అగ్నెస్ ఇంటికి రావాల్సి వస్తుంది. మళ్ళా వెనక్కి వెళ్లకుండా అక్కడే ఒక పాఠశాలను స్థాపించి తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ ఉంటుంది. ఒకసారి రోజాలీ ని కలిసేందుకు వెళ్ళినప్పుడు వెస్టన్ ను చూద్దామనుకుంటుంది. అయితే అతను ఇంకొక చర్చికి వెళ్లి పోయాడని తెలుసుకుంటుంది. ఒకరోజు బీచ్లో నడుస్తున్నప్పుడు తన యజమానురాలి పెంపుడు కుక్క ఆమె దగ్గరకు పరిగెత్తుకొని వస్తుంది. కుక్క వెనక వెస్టన్ కూడా వస్తాడు. వెస్ట్రన్ ను పెళ్లాడమని కోరినపుడు అంగీకరిస్తుంది.

టెనంట్ ఆఫ్ వైల్డ్ ఫెల్ హాల్ ఆన్ బ్రాంటే 1848లో వ్రాసిన రెండవ నవల. హెలెన్ గ్రాహం అనే ఎవరికీ తెలియని వితంతువు తన కుమారుడు, సేవకులతో వైల్డ్ ఫెల్ హాల్ చేరుకుంటుంది. అనేక సంవత్సరాలుగా భవంతి ఖాళీగా ఉంటుంది. చిత్రాలు గీయడం ద్వారా కొంత డబ్బును సంపాదించుకుంటూ జీవితాన్ని గడుపుతూ ఉంటుంది. గిల్బర్ట్ అనే వ్యక్తి ఆమెతో స్నేహం చేస్తాడు. ఆమె భర్త గురించిన వివరాలు ఉన్న డైరీని ఆమె అతనికిస్తుంది. ఉన్నత ధనిక కుటుంబంలో పతనమైన విలువలు ఉన్న ఆమె భర్త గురించి తెలుసుకుంటాడు. ఆమె తన పిల్లవాడిని అతని తండ్రి చెడు ప్రభావంనుంచీ ఎలా కాపాడుకోవాలో ప్రయత్నం చేయడాన్ని తెలుసుకుంటాడు. వివాహ వ్యవస్థలో స్త్రీలు ఎదుర్కొనే ఇబ్బందులు, ఒక వృత్తిలో నిలదొక్కుకునేందుకు స్త్రీ చేసిన ప్రయత్నాలు అన్నిటినీ కళ్ళకు కట్టినట్టు చెబుతుంది నవల.

ఇక ఎమిలీ బ్రాంటే రాసిన, అధిక ప్రజాదరణ పొందిన నవలవుదరింగ్ హైట్స్1847లో ఎలిస్ బెల్ అనే రచయిత పేరుతో ప్రచురితమైంది. నవల రచనా తీరు, విక్టోరియన్ కాలపు సంప్రదాయాలను విభేదించడం, మతానికి సంబంధించిన, నైతికతకు సంబంధించిన, విషయ వ్యతిరేకత, వర్గ వ్యత్యాసాలను ఎదిరించడం, మానవ సంబంధిత ఆశ నిరాశలు, పగ ప్రతీకారాలువీటి వల్ల చాలా గొప్ప పేరు తెచ్చుకుంది.

వుదరింగ్ హైట్స్, త్రష్ క్రాస్ గ్రాండ్ అనే ప్రదేశాల మధ్య ఆధిపత్య పోరాటం చూపెడుతూ నవల పాత్రల అంతర్బహి స్సంఘర్షణలను చూపెడుతుంది. రెండు తరాల కథలనూ 17 భాగాలుగా చెబుతుంది. కవితాత్మకమైన వర్ణనతో ప్రత్యేక శైలిని సంతరించుకుంటుంది. రెండు గొంతుకలు (లాక్ వుడ్, నెల్లి) కథను అల్లుకుంటూ వెళ్తాయి. పాఠకుడు చెవులు రిక్కించి శ్రోత అయిపోతాడు. పాత్రల దృక్కోణం నుంచి కథ చెప్పబడుతుంది. అర్న్ షా అనే యార్క్ షియర్ రైతు లివర్పూల్ నుంచి ఒక అనాధను ఇంటికి వస్తాడు. పిల్లవానికి హీత్క్లిఫ్ అని పేరు పెడతాడు. హిండ్లీ, కాతరీన్ అనే తన పిల్లలతో సమానంగా పెంచుతాడు. కాతరీన్ అతన్ని ప్రేమిస్తుంది కానీ హిండ్లీ తన తండ్రి అభిమానాన్ని పొందుతున్నందుకు అతన్ని ద్వేషిస్తాడు. హీత్ క్లిప్ను బాధ పెట్టెటందుకు హిండ్లీ అన్ని పనులు చేస్తాడు. కానీ ఇవేమీ పట్టించుకోక హీత్ క్లిఫ్ కాతరిన్ లు చెట్లు పుట్టలు గుట్టల నిండా తమ ప్రేమ సామ్రాజ్యాన్ని స్థాపిస్తారు. అయితే లింటన్ కుటుంబాన్ని కలిసే వరకే సంతోషం ఉంటుంది. త్రష్ క్రాస్ గ్రాంజ్ లోని ఎడ్గర్, ఈసబెల్లా కాతరీన్ ను ఆహ్వానిస్తారు కానీ హీత్ క్లిఫ్ ను మాత్రం తిరస్కరిస్తారు. జీవితంలో రెండవసారి తిరస్కరింపబడిన అవమానంతో రగిలిపోతాడు హీత్ క్లిఫ్. దీనికి తోడు కాతరీన్ మొదట్లో హీత్ క్లిఫ్ ను ఎడ్గర్ ను సమానంగా ఆదరించినా రానురాను ఎక్కువ సమయాన్ని ఎడ్గర్ తో గడుపుతుంది. దీంతో హీత్ క్లిఫ్ మరింతగా రెచ్చిపోతాడు. నెల్లీతో కేథరిన్హీత్ క్లిఫ్ ను ఎన్నటికీ పెండ్లాడనుఅన్న మాటలు విని వుదరింగ్ హైట్స్ ను వదిలి వెళ్ళిపోతాడు.

క్యాథరిన్, ఎడ్గర్ ను పెండ్లాడుతుంది కానీ తాను చేసిన తప్పును తెలుసుకుంటుంది. ఎడ్గర్ తాను వేరు వేరు ప్రపంచాలకు చెందినవారమని తన మనసులో ఎప్పటికి తన మనసును అర్థం చేసుకునే వాడు హీత్ క్లిఫ్ మాత్రమేనని గ్రహిస్తుంది. మూడు సంవత్సరాల తర్వాత తిరిగి వచ్చి ఉడరింగ్ హైట్స్ లో ఉంటాడు. ఈసాబెల్లాను పెళ్లి చేసుకుంటాడు. హీత్ క్లిఫ్ త్రష్ క్రాస్ గ్రాంజ్ ను కైవసం చేసుకుంటానని శపధం చేస్తాడు. ప్రయత్నంలో ఎవరిని బాధపెడుతున్నాడో గమనించడు. కాటరిన్ కేటీకి జన్మ నిచ్చి మరణిస్తుంది. 17 సంవత్సరాలు వేచి ఉండి ఎడ్గర్ మరణం తర్వాత  త్రష్ క్రాస్ గ్రాంజ్ ను కైవసం చేసుకుంటాడు. అయితే కాతరీన్ ఆత్మ మాత్రం అతనిని వెంటాడుతూనే ఉంటుంది. తన ప్రాణానికి ప్రాణమైన కాతరీన్ తో మరణానంతరం ఒకటవుతాడు. హీత్ క్లిఫ్ లో ఒక అమర ప్రేమికుడు, ఒక పోరాట యోధుడు మనకు కనిపిస్తాడు. కాని తనకు కావలసిన దేమిటో జీవితంలో దెబ్బతిని తెలుసుకున్న ప్రేయసిగా క్యాథరిన్ నిలిచిపోతుంది. నవల వర్గ తారతమ్యాలు, పగ, అసూయ వారి జీవితాల్లో ఎలాంటి విధ్వంసాన్ని రేపుతుందో చూపుతుంది. మంచి చెడుల మధ్య, నేరముశిక్ష మధ్య, ఉన్మాదంతార్కిక బుద్ధి మధ్య, విప్లవం, ప్రేమ, పగ, స్వార్థం, అన్ని కలగలిపి మానవ జీవితం లోని వ్యధని తెలియ చేస్తుంది

మనం ఈ నవలలను, స్త్రీ పాత్రలను పరిశీలిస్తే వీరు అందరూ అనుకునేలా సాధారణ స్త్రీలు కాదు. స్త్రీని భోగవస్తువుగా, మనసు లేని మర బొమ్మలుగా చూసే పితృస్వామ్య సమాజాన్ని తమ వ్యక్తిత్వంతో, స్వతంత్ర భావాలతో సవాలు చేసి ఆనాటి కాలపు స్త్రీలలా మనసు చంపుకు మనువాడిన వాడితో వుండిపోకుండా వారికి కావలసినవి దక్కించుకునే ప్రయత్నం చేశారు.

ఇంత కాలమయినా ఇప్పటికీ నవలల పట్ల పాఠకుల  ఆసక్తి వాడిపోలేదంటే మాత్రం అతిశయోక్తి లేదు. వారి రచనలలో ఒక అంతుచిక్కని రచనా శక్తి, శైలి ఉన్నాయి. ఆసాంతం చదివించే తీరు వాటికి ప్రత్యేకమైన ఆసక్తినందిస్తుంది. మనుషుల గురించి, ముఖ్యంగా స్త్రీల గురించి చిత్రించడంలో వివరించడంలో  వారుప్రత్యేక దృష్టిని పెట్టారు. స్త్రీ వాదానికి రచనలలో తొలి బీజాలు వేసిన వారీగా ముగ్గురు చిరస్మరణీయులు.  

డాక్టర్ విజయ్ కోగంటి, డాక్టర్ పద్మజ కలపాల

Add comment

Categories

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.