Name: అనిల్ డానీ

Alternative Text

ఆనిల్ డానీ: స్వస్థలం విజయవాడ దగ్గర కొండపల్లి. ప్రస్తుతం విజయవాడలోనే వుంటున్నారు. కవిత్వం, వ్యాసాలు రాస్తుంటారు. మొదట్లో వచ్చిన కవిత్వాన్ని నలుగురు మిత్రులతో కలిసి 'తీరం దాటిన నాలుగు కెరటాలు' పేరుతో ఒక సంకలనం తీసుకు వచ్చారు. 2017  చివర  'ఎనిమిదో రంగు' అనే కవితా సంపుటి వెలువరించారు. ఇటీవల తన కవిత్వానికి పెన్నా సాహిత్య పురస్కారం అందుకున్నారు.

మాది మాలవాడ
ఇంతకీ “మీరేవుట్లూ”

ఇప్పటికి మన సమాజంలో ఎవరి నోటినుంచినయినా ఒక మాట వస్తే నొసలు ముడేస్తుందో ఆ పదం “దళిత” లేదా “దళితులు”. వీళ్లకి అనేక సర్వనామాలు, సమానార్ధక పదాలు, ప్రకృతి , వికృతి పదాలు చాలానే ఉన్నాయి. అసలు ఈ దళితులు ఎవరు అంటే, దళితులేమో తాము...

పేరే ఒక ధిక్కారం

మనుషుల్లో కొందరు చాలా తేడాగా ఉంటారు. ప్రవర్తనలో మాట్లాడే తీరులో మనతో ఉన్నట్టే ఉంటూనే మళ్ళీ మనతో విభేదిస్తూనే ఉంటారు. అలాంటి వారిని చూసి కొన్ని సార్లు నవ్వుకుంటాం, మరికొన్ని సార్లు నొచ్చుకుంటాం. ఇంకా చాలా సందర్భాల్లో మనం వారికి కావాలనే దూరంగా...

అంతరంగం పలవరింత
హైమవతి కవిత

“ఔను నేనెప్పుడు రెండవ పుటనే అప్రాముఖ్య అక్షరాన్నే” ఎత్తుగడతోనే ఉద్వేగ ప్రవాహంతో గొప్పగా చెప్పగలిగిన కవయిత్రి “మందరపు హైమావతి”. స్త్రీలు అనాదిగా తమ తమ మీద మోపబడిన  బరువులను మోస్తూ, అవి తమ మీద రుద్దబడడం గుర్తిస్తూ, వాటిపట్ల...

కవి సమయం ఒక నిపాతం
కవిత్వం హృదయోత్పాతం

“మీరు కాల్చేస్తున్న సబ్ స్క్రైబర్  కవరేజ్ ఏరియాలో లేరు లేదా ప్రస్తుతం స్పందించడము లేదు దయచేసి ఎప్పుడూ కాల్ చేయకండీ “ “మీ కిటికీ తలుపులు ఆకాశంలోకి ఎగిరిపోతాయి మీ ఇంటి గుమ్మాలు తునాతునకలై పేలిపోతాయి మీ శరీరాలు మాంసఖండాలై చెల్లా...

 సవరణ ?

జనం సుడులు తిరిగి పోతుంటారు ఖాళీ పాదాలతో వట్టి చేతులతో సామ్రాజ్యాలనిండా తిండి కోసమే బతుకుతుంటారు ఇది ఎంతకీ అభివృద్ది చెందని దేశ పటం పేరు రాయబడిన గింజలన్నీ రాబందుల కోసమే ఆకలి కనబడని వోటు  వస్తువు ఇది ఖద్దరు వ్యాకరణం సమయాన్ని భుజాన వేసుకుని పోతూ పోతూ...

మరణం అతని చివరి శ్వాస కాదు

తెలంగాణా రాష్ట్రం 12.02.2015 జగిత్యాల అంగడి బజార్లో అంతా కోలాహలం గా ఉంది . అది రాజకీయ సభకాదు, అక్కడకి వచ్చేది ఓట్లు కొనుక్కున నేతలూ కాదు, మరి ఎవరికోసం ఆ జన సందోహం అంటే ఒక కవి కోసం. అభిమానులు ఎంతో ప్రేమగా , అజరామరమైన అక్షర యోధుడికి కానుకగా, ఆయనకి...

క‘వనం’లో కొత్త కోయిల

చిన్నపిల్లలు అల్లరి చేయడం మనకు తెలుసు. కొంత మంది బొమ్మలు గీయడంలో, ఆటలు, క్రీడల్లో ఉంటూ చురుగ్గా వుండడం చూస్తూనే ఉంటాం. మనో సంబంధమైన కవిత్వం జోలికి పిల్లలు అంత త్వరగా పోరు, అది కేవలం భాషకి సంబందించినదనో లేక వారికి అంత లోక పరిజ్ఞానం ఉండదనో భావిస్తూ...

ధిక్కార ‘నాగ’ స్వరం! 

కొన్ని మార్చలేమండి, ఇప్పటివా  ఈ ఆచారాలు వ్యవహారాలు , పెద్దవాళ్లు ఏదీ ఊరికనే పెట్టలేదండీ, అన్నింటికి కొన్ని హద్దులుండాలి , మనుషుల్లో కూడా కొన్ని రకాల వారిని దూరం పెట్టాలి, మనం జన్మతహా చాలా పెద్ద పెద్ద వంశాలలో పుట్టాం అని ఇప్పటికీ బోర విరుచుకు తిరిగే...

స్వప్నాక్షరాలు 

(శివలెంక రాజేశ్వరీ దేవి గురించి మరోసారి)  పశ్చిమ క్రిష్ణా జిల్లా , కృష్ణా నది ఒడ్డున చారిత్రాత్మక గ్రామం జగ్గయ్యపేట, ఎక్కడా సాహిత్య వాసనలు అంతగా తగలని  అప్పటి మారుమూల గ్రామం. అద్భుతం ఎప్పుడూ అంతే తన పని తాను చాలా సాదాసీదాగా చేసుకుంటూ పోతుంది , ఆ...

దగ్ధ కధా స్వరం

మాట ఎంత చెప్పినా తరిగిపోని గని. మనిషికి మాత్రమే ఉన్న ఒకేఒక లక్షణం మాట్లాడడం, ఎదుటివారిని మాట్లాడేలా చేయడం, కొందరు మాటలకి సానుకూలంగా స్పందిస్తారు, మరికొందరు మౌనంగా ఉంటారు , ఇంకా చాలా మంది వాదిస్తారు , మరికొంతమంది పోట్లాడతారు ఎలా అయినా సరే తమ...

ఒక రహస్తంత్రీ నిషాదం

కవిత్వం ఒక తీరని దాహం అన్నాడు శ్రీ శ్రీ . వచన కవిత్వం గ్రాంథిక భాషా సంకెళ్లని తెంపుకుని  సామాన్యుల గుమ్మాలలో నడవడం  మొదలైనాక, తమ అద్భుతమైన శైలి తో కవిత్వం రాసిన శ్రీ శ్రీ , తిలక్ ప్రభ తగ్గిపోకుండా ఉండడం తెలుగు కవిత్వం చేసుకున్న అదృష్టం అని...

నిరుడు విరిసిన కవిత్వం: కవిత -2017

కళ ఒక మాయా వస్తువు. తనని గుర్తించేవారిని అది మైమరిచిపోయేలా చేస్తుంది. ఊరిస్తుంది, లాలిస్తుంది, వెన్ను తడుతుంది, చెంపమీద లాగి పెట్టి కొడుతుంది కూడా. దారి చూపుతుంది, కాని ఆ దారి కావాల్సిన వారికే కనబడుతుంది. కవిత్వం ఒక అభూత కల్పన అనడానికి లేదు...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.