Name: ఎస్. జయ

Alternative Text

ఎస్. జయ: కవి, కథకురాలు. చిరకాలం ఎమ్మెల్ పార్టీలో పని చేసిన క్రియాశీలి. ఆ సమయంలో పొర్టీ పత్రిక 'విమోచన'లో, తరువాత 'ఈనాడు'లో, 'నలుపు' పత్రికలో సంపాదక బాధ్యతలు నిర్వహించారు. 'విరసం' లో చురుగ్గా పని చేయడమే గాక, పలు సంవత్సరాలు 'విరసం' జంటనగరాల కన్వీనర్ గా పని చేశారు. 'అన్వేషి' అనే స్వచ్చంద సేవా సంస్థలో కో ఆర్డినేటర్ గా బాధ్యతలు నిర్వహించారు. 'మట్టి పువ్వు' అనే కవితా సంపుటినీ, 'రెక్కలున్న పిల్ల' అనే కథా సంపుటినీ వెలువరించారు. పలు పుస్తకానువాదాలు, విడి అనువాదాలు చేశారు.

నియో లిబరిలిజానికి
అతి పెద్ద సవాలు

ఇప్పుడు ప్రతి ఇల్లు ఒక జైలు. ప్రతి వీధిలో కర్ఫ్వూ. ప్రజల కదలికలపై ఆంక్షలు. దేశాల మధ్య, రాష్ట్రాల మధ్య నిలిచిపోయిన రాకపోకలు. కంటికి కనిపించని కోవిడ్- 19 మహమ్మారితో ఇప్పుడు ప్రపంచం యుద్ధం చేస్తోంది. లక్షల మంది వ్యాధిగ్రస్తులవుతున్నారు. వేల మంది...

చిటపటలాడుతున్న పెనం ఇప్పుడు భూగోళం!

పెనం మీద పేలాలు చిటపటలాడుతూ ఎగిరెగిరిపడుతున్నట్టుగా ఉంది ఇప్పుడు భూగోళం. ఏ దేశంలో ఎప్పుడు నిరసన జ్వాలలు చెలరేగుతాయో తెలియదు. అనేక దేశాల్లో ప్రజలు సమస్యలతో రోడ్ల మీదకు వస్తున్నారు. ఫ్రాన్స్ తో మొదలైన వీధి పోరాటాలు ఇప్పుడు అనేక దేశాలను అతలాకుతలం...

అన్ని కాలుష్యాలపై
పెరుగుతున్న తిరుగుబాట్లు

(పైన ఫోటో ప్రజల చేత ఎన్నుకోబడిన మంచి నాయకుడు, కుట్రలకు బలి యై పదవీచ్యుతుడైన భూమి పుత్రుడు ఇవో మొరాలిస్) భూ వాతావరణాన్ను పరిరక్షించుకోవాల్సిన అత్యవసర పరిస్థితులు ఏర్పడ్డాయని, అన్ని దేశాలు కలిసి తగిన చర్యలు తీసుకోవాలని 11,000 మంది శాస్త్రజ్ఞులు...

నియో లిబరిజానికి
ప్రపంచవ్యాప్త నిరసన

ఏడాది క్రితం ఫ్రాన్స్ లో “ఎల్లో వెస్ట్’’ ల రూపంలో పెల్లుబికిన నిరసన జ్వాలలు ఇప్పుడు ప్రపంచమంతా వ్యాపించాయి.  ప్రభుత్వాలు అనుసరిస్తున్న నియో లిబరల్ విధానాలకు వ్యతిరేకంగా చిలీ, లెబనాన్, ఇరాక్, హైతీ… అనేక దేశాల్లో నిరసన ప్రదర్శనలు. స్పెయిన్...

అందరి చూపు డెట్రాయిట్ వైపు
జి. ఎం. సమ్మె

“మీరు లాభాల్లో ఈదులాడుతున్నారు. ఉద్యోగులకు ఇవ్వాల్సిన బెనిఫిట్స్ ఇవ్వడం లేదు. వారికి అవసమైన సౌకర్యాలు కల్పించడం లేదు. మీరు చేస్తున్న పనులు మాకిష్టం లేదు. మేము వీటిని తిప్పికొడతాం. మాకు కావలసినవి రాబట్టుకుంటాం’’ అమెరికాలో సమ్మె కట్టిన జనరల్...

ప్రమాద ఘంటికలు మోగిస్తున్న
అమెజాన్ కార్చిచ్చు

ఇంటి ముందు ఓ పచ్చని చెట్టు ఉంటే స్వచ్చమైన చల్లని గాలి తగులుతుందని మనకందరికీ తెలుసు. చెట్టు లేని ఊరిని, అడవి లేని దేశాన్ని ఊహించుకోలేం. బొగ్గు, ఆయిల్  పరిశ్రమల నుంచి టన్నుల కొద్ది వెలువడే కార్బన్ ఉద్గారాల (ఎమిషన్స్) వేడెక్కుతున్న భూగోళాన్ని...

పిల్లల ముందు తల్లుల హత్యలు: కొలంబియా

దక్షిణ అమెరికాలోని, కొలంబియాలో, పట్టపగలు, నడివీధిలో, పదేళ్ళ పిల్లాడు చూస్తుండగా, పిల్లాడి తల్లిని గన్ మ్యాన్ దారుణంగా  కాల్చి చంపాడు. అంత వరకు శాంతి కోసం, మానవ హక్కుల కోసం నినదించిన మరియా దెల్ పిలార్ హుర్తదొ (Maria del Pilar Hurtado) నిర్జీవంగా...

పర్యావరణ రక్షణకై
భవిష్యత్తు విజ్ఞాపన

ప్రపంచవ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరిగి భూతాపం పెరుగుతూ భూకంపాలు, కార్చిచ్చులు ( వైల్డ్ ఫైర్స్), తుపాన్లు, వరదలు, టొర్నడోలు   పెరుగుతుంటే, మరోవైపు అత్యధిక దేశాల్లో రైట్ వింగ్ శక్తులు అధికారంలోకి వస్తున్నాయి. తూర్పు దక్షిణ ఆఫ్రికా దేశాలు ‘ఇదాయ్’ తుపాను...

తిరుగబడుతున్న “ఉబర్” కారు!

మనం మెసేజ్ పంపిన నిముషాల్లో కారు మన ఇంటి ముందుకు వచ్చి కారుచౌకగా మనల్ని గమ్యస్థానం చేరుస్తున్న “ఉబర్” సేవలకు ఉబ్బి తబ్బిబవుతుంటాం. కార్ల ధరలే కాదు పెట్రోల్  ధరలు కూడా రోజు రోజుకు విపరీతంగా పెరుగుతున్నాయి అమెరికా ఆయా దేశాలపై విధిస్తున్న ఆర్థిక ఆంక్షల...

పర్యావరణం కోసం ప్రపంచ బాలల సమ్మె

“మన దగ్గర చాలా డబ్బున్నది.  మిలిటరీ కోసం ఖర్చు చేయకుండా వాతావరణ రక్షణ కోసం ఖర్చు పెట్టొచ్చు కదా?”. అని 8 ఏళ్ల అమ్మాయి ప్రశ్నిస్తే, “బుష్ చేసిన యుద్దాలకు డబ్బెక్కడ్నుంచి వచ్చింది?” అని మరో గడసు పిల్ల ప్రశ్నించింది. ఆ అమ్మాయిలు ప్రశ్నించింది...

ఫ్రాన్స్ వీధుల్లో గ్రేట్ డిబేట్!

“ఫ్రాన్స్ వీధుల్లో ‘గ్రేట్ డిబేట్’ జరుగుతోంది’’ అని కొందరంటే, మరి కొందరు ‘’శనివారం విప్లవం చేస్తూ, తెల్లారే సరికి చల్ల బడుతున్నా”రని వెక్కిరిస్తున్నారు. అన్ని దేశాల్లాగే అక్కడి మీడియా కూడా ఈ  వారం వారం ‘’ఎల్లో వెస్ట్” వీధిపోరాటాల్ని...

‘అమెజాన్’ కు అడ్డుకట్ట

ఈ మధ్య హైదరాబాదు వెళ్లినప్పుడు, ‘నవోదయ’లో బుక్స్ కొన్నాక, ఇంగ్లీష్ బుక్ షాపుల అడ్రస్ అడిగాను. అమెజాన్ ధాటికి అవి మూతపడ్డాయని, ఆన్ లైన్లోనే తెప్పించుకోవాలని, తెలుగు బుక్ షాప్ వాళ్లం కూడా ఒక నెట్ వర్క్ లాగా ఏర్పడి ఆన్ లైన్లో ఆర్డర్లు వస్తే...

పర్యావరణ విధ్వంసం మీద పసివాళ్ల తిరుగుబాటు

“మా భవిషత్తును దోచుకుంటున్నారు” అని ప్రపంచ నాయకులను నిలదీసింది స్వీడన్ దేశానికి చెందిన 15 ఏళ్ళ గ్రెటా థున్బెర్గ్,(Greta Thunberg). పోలెండు లో కటొవిస్ లో  జరిగిన 24 వ ఐక్య రాజ్య సమితి ‘క్లైమేట్ సమ్మిట్’  ప్లీనరీలో మాట్లాడుతూ, పర్యావరణ కాలుష్యం...

ఫ్రాన్స్ లో మళ్లీ రెక్క విప్పిన రెవల్యూషన్!

(1968 ఫ్రాన్సులో మొదలైన‍ తిరుగుబాట్లను ఏంజిలా కాట్రోచ్చి “బిగినింగ్‍ అఫ్‍ ది ఎండ్‍’ పేరుతో గొప్ప పొయెటిక్‍ శైలిలో రికార్డు చేశారు. దాన్ని శ్రీశ్రీ ‘రెక్క విప్పిన రెవల్యూషన్‍’ పేరుతో తెలుగు చేశారు. ఈ పుస్తకం...

అమెరికా ఎన్నికలు: రేకెత్తిన కొత్త ఆశలు

పైన ఫోటో  విజయం సాధించిన సోషలిస్టు డెమోక్రాట్లు: షరిస్ డేవిడ్స్ (నేటివ్ అమెరికన్) రషీదా (పాలస్తీనా ముస్లిం), ఇల్హన్ ఓమర్ (సొమాలియా ముస్లిం), డెబ్ర ఎ హాలాండ్ ( నేటివ్ అమెరికన్)     ‘’మీలో ఈ జ్వాల ఎలా రగిలింది? ఎందుకు రగిలింది?’’, గత వారం...

ప్రపంచాన్ని కుదిపేస్తున్న స్త్రీల వుద్యమం: “మీ టూ”

(పైన వున్న ఫొటో: “మీ టూ” ఉద్యమ కారిణీ తరన బర్క్) జడ్జ్ కావినాను సుప్రీం కోర్టు  జస్టీస్ గా నియమించడానికి నిరసనగా…. మహిళల నిరసన మరొక అపూర్వ ఘటన. అమెరికా సుప్రీం కోర్టు ఆవరణలో నిరసనకారులు కనిపిస్తే చాలు అరెస్టులు సాగుతాయి...

నీ దారే నా దారీ!

మధ్యాహ్నం వచ్చాను హైదరాబాదు నుంచి. సూట్ కేసులు హాల్లోనే పెట్టి,  స్నానం చేసి, భోజనం చేసి, కాసేపు కునుకు తీద్దామనుకుంటే, ఏకంగా నాలుగు గంటలు నిద్రపోయాను.  లేచే సరికి సాయంత్రం అయింది. అది కూడా అనన్య స్కూల్ నుంచి వస్తూ ఇంట్లో అడుగుపెట్టిందో లేదో సూట్...

ఆధునిక బానిసత్వం: ఖైదీల పోరు?

“అమెరికాలో బానిసత్వం ఇంకా వుంది, పూర్తిగా రద్దు కాలేదు. ‘ఆధునిక బానిసత్వాన్ని’ ఆపెయ్యాలని, తమకు కూడా కనీస వేతనాలు వర్తింపజేయాలని, మానవీయ పరిస్థితులు కల్పించాలని 17 రాష్ట్రాల్లో 2 లక్షల మంది ఖైదీలు సహాయ నిరాకరణోద్యం నిర్వహిస్తున్నారు. ఈ వ్యాస రచన...

‘ పిల్లల్ని తల్లుల్ని విడదీసే అమానుషం’: అమెరికాలో  హోరెత్తిన నిరసన

  స్కూలుకో, ఆడుకోడానికో వెళ్లిన పిల్లలు ఇంటికి రావడం అరగంట ఆలస్యమైనా, పిల్లలు కనిపించడం లేదని, ఏమైందోనని తల్లడిల్లుతాం. కోడిపిల్లను గద్ద ఎత్తుకెళ్ళడానికి వస్తుంటే, తల్లికోడి పిల్లను కాపాడుకోడానికి గద్దనే తరుముతుంది. కానీ నిస్సహాయులైన తలిదండ్రులు తమ...

తిరిగి వినిపిస్తున్న మార్టిన్ (1968) మాట

  యాభై ఏళ్ళ క్రితం (1968) మార్టిన్ లూథర్ కింగ్ ఇచ్చిన సందేశం అమెరికాలో మళ్లీ వినిపిస్తోంది.  ఆగిపోయిందనుకున్న సివిల్ రైట్స్ ఉద్యమ చరిత్ర కొనసాగుతున్నది. కొత్త చేతుల్లో చరిత్ర నిర్మాణం కొనసాగుతున్నది. రెవరెండ్ డాక్టర్ మార్టిన్ లూథర్ కింగ్...

అమెరికాలో పొంగుతున్న జన సముద్రాలు

“ఈ రోజు నేను పదకొండు అరటి పండ్లు తిన్నాను, దారి పొడుగునా జనం ఇస్తూ వుంటే…” అన్నాడు అరోన్ బేకర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘ యాత్ర (మార్చ్) లో నడుస్తూ. ఈయన 8 వ గ్రేడ్ ( తరగతి) పిల్లలకు అమెరికా చరిత్ర బోధిస్తాడు. ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్న వారిలో తనూ...

వీధులకెక్కుతున్న రైతులు పిల్లలు స్త్రీలు!

ఆకాశంలో నల్లమబ్బు కనిపించగానే ఉరకలు వేసే ఉత్సాహంతో పొలం పనులకు సిద్దమయ్యేవి పల్లెలన్నీ. రైతన్నలు నాగళ్లు సరిచేసుకుంటుంటే, రైతమ్మలు విత్తనాలు శుద్ది చేసేవాళ్లు. వానకు తడిసిన పొలాలు మట్టి వాసనలతో పరిమళించేవి . పొలంలో విత్తనాలు వేయడం ఒక పండుగలా జరిగేది...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.