Name: సొదుం శ్రీకాంత్

Alternative Text

శ్రీకాంత్ సొదుం: పనిచేసేది కంప్యూటర్ పైన అయినా పుస్తకాలతో పెంచుకున్న అనుబంధం తెంచుకోలేక చదవడం, అప్పుడప్పుడు రాయడం చేస్తుంటారు. ఇప్పటి వరకు పర్యావరణం మీద యురేనియం మైనింగ్ ప్రభావం, నోట్లరద్దు, నగదు రహిత సమాజం వెనుక అసలు రహస్యాలు, అమెరికాలో నల్లజాతీయులపై జాతి వివక్ష, పెద్ద వ్యాసాలు, రెండు పుస్తక సమీక్షలు ఇలా మొత్తం ఏడెనిమిది  పరిశోధన వ్యాసాలు వివిధ సామాజిక రాజకీయ మాసపత్రికలలో ప్రచురిచితమైనాయి. కొన్ని కవితలు కూడా ప్రచురితమైనాయి. ప్రస్తుతం ‘పిల్లప్పటి’ పల్లె అనుభవాలను రాయలసీమ యాసలో కతలు పనిలో ఉన్నారు.

జీవిత పరీచ్చ

అది నా డిగ్రీ పూర్తయిన సమత్సరం. సరా మామూలుగానే కరువుతో కటకటలాడిన కాలమది. డిగ్రీ పట్టా అయితే ఎట్లనోకట్ల సంపాయిచ్చి గానీ , ఇంగ అవతల పట్టుకోనీకి యా గట్టూ కాన్రాల్య. మా గరుగు సేన్లో సెనిక్కాయ పైరొచ్చినట్లు నా సదువంతా అరకొరగ మార్కులతోనే ఒడపకచ్చి. ...

ఎర్రి ఎంకన్న

మా ఊరి నుంచి కడపకు పోవాలంటే ముందు యర్రగుంట్లకు పొయ్ ఆన్నుంచి కడప బండి పట్టుకోవాల. నేను ఎగాసగా పడ్యాలకు ఊర్లో బస్సు దాటిపాయ. అట్లైందాన రోడ్డు కాడికి నర్సిపోవాల్సి వచ్చ. బస్సు నిలిపే పాటిమీద నుంచి మెయిన్ రోడ్డుకు పోవాలంటే ఓ మైలు దాక నడకుంటాది. కట్టెల...

దొప్పటాన

ఆ సమత్సరం వానలు సరిగా కుర్సల్య. జులై దాటిపోతన్యా  సుట్టు పక్కల యాన్నేగానీ ఇత్తనం కూడా ఎయ్యల్స. ఎండలకాలమున్యట్లు ఎండలు మండిపోతాండాయి. న్యాల గొంతారి దాని నాలిక పిడసగట్టక పోయుండాది. బీళ్లు నోర్లు తెర్సి ‘వానో రామసెంద్రా’ అంటా ఆకాశానికి మోరెత్తి...

ఎర్జోవ్ కట్ట

సందకాడ బూతిని బాయి బండలకాడికని పోతి. ఆడ ఎవరైనా ఉంటే రోంతసేపట్టా కూచ్చోని యవారాలు చేసొచ్చామని. యాలపొద్దు కానందాన అప్పటికింగా ఆడికి ఎవరూ రాల్య. సరే ఆడ ఒక్కనీ కూచ్చోని కొంగ జపం సెయ్యడం దేనిక ని మల్లా ఇంటికి మల్లుకోని వచ్చాంటి. మా జయరాం పెదనాయన...

పాలెగాడు

మాయ్టాల బాయిబండల కాడ శ్యామన్న, సీనా(శ్రీను), మూలోల్ల రవన్న ఇంగో ఐదారు మంది కూచ్చోని యవారాలు సేచ్చనారు. అటుపక్క మన్నులో  పిల్ల పిసిక్య సేరి గోలుగుండ్లో, సిల్లాకట్టో యాదో ఒకాట ఆడుకుంటా ఎగులేచ్చనారు. ఆపక్క మూలనుండే యాపమాను మీదికి కాకులు, కొంగలు...

సంగటి- పండుమెరగాయ కారెం

ఆ ఏడు (సంవత్సరం) మా కొత్తిమిట్ట సేనికి మట్టి తోలాలనుకుంటిమి. అప్పటికే కలంలో నుంచి కుల్లిన సెనిక్కాయ కట్టెను, ‘వామ’డుగు దుగ్గును, సెత్తా సెదారాన్నంతా వరిమల్ల కాడుండే గుంతకు తోలింటిమి. దానిపైకి ఒక వరస ఇసిక్య తోలి, ఇంగో వరస దిబ్బలో ఉండే ప్యాడ తోలి...

మా ఊరి పప్పు

ఆ పొద్దు మా సిన్నమామ (మాయమ్మ తమ్ముడు) మా ఊరికొచ్చిండ్య.  మా మామ మా ఊరికెప్పుడొచ్చినా యాయో ఒకటి త్యాకుండా ఉత్తసేతల వచ్చింది ల్యా. తోట్లో యాయుంటే అయి మూటెకేసుకుని ‘పిల్లోల్లు తింటారు’ అని వచ్చి ఇచ్చిపోయేటోడు. ఇప్పుడు గూడా సీనాకాయలు, సపోటకాయలు...

గోటూరు గిత్త

ఆ యేడు మా కొత్తిమిట్ట సేండ్లో నీళ్లు పారగట్టి రెండెకరాల డిసెంబరు కాయ పెట్టింటిమి. పంట గూడా అయ్యిండ్య. ఆ ముందు రోజే కట్టె గూడా సుమూరుగా పెరికి సగం సేను ఓదెలేసింటిమి. ఆ పొద్దు కట్టెను సేండ్లో నుంచి కలంలోకి తోలాల్సి ఉండ్య. అసలే దూరాబారం సేను. మార్చి...

రసూల్ మియా సవాసం

పాతింట్లో తలాకిలి కాడ మంచం మీద పండుకోనుండాడు మా కిష్ణాడ్డి తాత. అప్పటికే పదిరోజులాయ తాతకు జరమొచ్చి. పై ఎచ్చగ కాలిపోతాంది. అదీగాక మాంచి ఎండలకాలం. వాకిట్లో నుంచి వచ్చే వడగాలి ఒంట్లోని తడిని ఎగబీర్సి పోతాంది. తాత తలగడన దిండు సరిజేసి నుదిటి మీద...

తిమ్మప్ప పార

దాదాపు ఐదేండ్ల తర్వాత పొద్దుటూరికి పోతి. గాంధీ రోడ్డు కాపక్క ఈపక్క ఉండే పెద్ద షాపుల్ను చూసుకుంటా ‘టౌను శానా మారిపోయిందిబ్బా’ అనుకుంటి మనసులో. పెట్రోలు బంకుకాడికొచ్చాలకు యాన్నో తెలిసిన ముఖం నాకు అదాటు పడ్య. కానీ ఆడ ఎవ్రో తటిక్కెన మతికి రాల్య. ఆయన్న...

మొగదాల మాను

మా ఊరికి పరమట పక్క పూర్వం పెద్ద సెరువుండ్య. ఆ సెరువును  ఎప్పుడో బూడ్చేసి తలా ఇంత సేండ్లు చేసుకుంటిరి. అయినా గానీ సెర్లో ఆడాడ నారవలు బూడిపోకుండా  అట్లనే మిగిలిండ్య. తరాలు మారినా సెర్లో సేండ్లని, సెర్రుకట్టని, కట్టమీద పంపులు ఇట్లా దాంట్ల పేర్ల మాత్రం...

తొలిసూరి పడ్డ

             కట్టకడాకు, దాన్ని మడి కయ్యల కాడ మల్లగొడ్తి. ఇంటిదావ పట్టిచ్చి ‘తక్కె… ఇంటికి పా నీకీపొద్దు ఉంటాది.. బడితెపూజ సేచ్చాపాయే కంచర్ దానా!’ అనుకుంటి మనసులో . దానికి ఉసి తిరక్కుండా ఉషారుగా ఎగదోల్తా ఇంటి మలుపు తిప్పితి. పడ్డ పరిగెత్తా...

‘ఒంటరి’ కానిదెవ్వరు’?!

గ్రామీణ జీవిత నేపథ్యంగా రచనలు సాగిస్తున్న వారిలో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఆయన ఇప్పటికే 7 నవలలు, రెండు కథా సంపుటాలను ప్రచురించినారు. సాహితీ క్షేత్రంలో ఆయన పండించిన మరో పంట ‘ఒంటరి’ నవల.  ఇది ‘తానా’ నవలల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.