Name: డాక్టర్ విజయ్ కోగంటి

Alternative Text

విజయ్ కోగంటి పేరుతో 1993 నుండి కవితా వ్యాసంగం. అనేక దిన, వార, మాస, పత్రికలు, ఆన్ లైన్ పత్రికలలో ప్రచురణలు. 2012 లో ‘కూలుతున్న ఇల్లు’ కవితకు నవ్య-నాటా బహుమతి. తెలుగు, ఇంగ్లీషుల్లో కవిత, కథారచనతో పాటు అనువాదాలు, సమీక్షలు, సాహిత్య బోధన ప్రధాన వ్యాసంగాలు. ’ఇలా రువ్వుదామా రంగులు’ (2017) మొదటి కవితా సంపుటి. స్వయం ప్రతిపత్తి గల ప్రభుత్వ మహిళా కళాశాలలో ఆంగ్ల శాఖాధ్యక్షుడు drvijaykoganti@gmail.com M: 8801823244

వై, హౌ అండ్ వెన్

నిన్న పలకరించిన మనుషులు ఈ వేళ ఏరీ మనుషుల మధ్య మాటలు దోచేస్తున్నదెవరు నేల నుంచీ నీరు ఆవిరైపోతున్నట్లు కళ్ళముందే మొగ్గ తొడుగుతున్న పూలు రాలిపడుతున్నట్లు తిరిగి పలకరించకుండా ప్రేమలెటు పోతున్నై సందడితో హోరెత్తిన వీధులు ఎందుకిలా మూగబోతున్నై కన్నులిలా...

తనిఖీ 

‘కళాశాలలో తనిఖీకి ఇంకా రెండు రోజులే ఉంది. ఎక్కడి పనులు అక్కడే ఉన్నాయి. ఇంకా బి.కాం బ్లాకు లో రంగులు పూర్తి కాలేదు. అటెండర్ సరిగా రావడం లేదు. మొత్తం 10 మంది ఉన్నాం. 20  పోస్టులు అలాగే ఖాళీగా ఉన్నాయి. ఎక్కడి చెత్త అక్కడే అలాగే ఉంది. మునిసిపాలిటీ...

గొడుగు

ఎప్పుడూ పైనేవుండి
చేతులు చాచి
వాననుంచీ
ఎండనుంచీ
నీడపట్టే ఈ గొడుగు
ఇవాళెందుకో
నాన్న లాగా కనపడుతోంది.

మంచం మీద కూచుని
పైనుంచీ కిందదాకా
దుప్పటి చుట్టుకు కూచున్న
నాన్నేమో
వానలోంచీ వచ్చి
గోడకానించిన
గొడుగు లాగా
కొత్తగా...

సర్పశిఖి

అతడు ఆ రాజప్రాసాదం నుంచీ బయటకే చూస్తున్నాడు. అన్నీ సగం కట్టి వదిలిన ఇళ్లు సగం తవ్వి వదలిన నేలలు. తలలు లేని వాళ్ళంతా వుత్త మొండేలతో కొడుతున్న జేజేలు. ఒళ్లు ఆనందంతో  గగుర్పొడుస్తోంది. గర్వంతో మీసం దువ్వి తలపై జుట్టు పైకెగదోయ బోయాడు. వెంటనే తనకు...

అసలు రంగు

రంగుల తోరణాల్నీ వెలుగు రవ్వల్నీ పులుముకుంటున్న ఈ రాత్రి అసలు రంగేది ఎగసి పడే చిచ్చుబుడ్డిని మండి రాలిపడుతున్న తారాజువ్వల్నీ దూరంగా నిలుచుని సంభ్రమంతో చూస్తున్న ఆ పేద బాలిక కళ్ళలో మెరుస్తున్న అసలు రంగేది మెరిసి మాయమయే సంతోషానికీ మెరవకకురుస్తుండే...

లోతులున్న నవ్వులు:
మార్క్ ట్వెయిన్

మనమందరం చిన్నతనంలో టామ్ సాయర్  కథలు చదివి వారిలో మనలను వూహించుకుని స్వప్న జగత్తులో విహరించిన వారమే.  వాటన్నిటినీ వ్రాసింది మార్కెట్వెయిన్ అని ఎంతమందికి గుర్తుంది? మార్క్ ట్వెయిన్ గా ప్రసిద్ధి పొందిన శామ్యూల్ లాంగోర్న్ క్లెమెన్స్ 1835 నవంబర్ 30 న...

తల్లీ బయలెల్లినాదే!

పందిట్లో కొలువైన దుర్గమ్మకు పూజలు జోరుగా సాగుతున్నాయి. గూడెం అంతా భక్తిశ్రద్ధలతో పూజిస్తోంది. స్కూలు, ఆస్పత్రి, రోడ్డు, బస్సు అన్నీ రావాలని, అందరూ బాగుండాలని సాగిలబడి కోరుకుంటున్నారు. చిన్నదొర పోయినందుకు సంతాపంగా విగ్రహం పెట్టద్దని, పూజలు చేయొద్దని...

రేపటి నిర్ణయం

రోజూ లాగే ఆ రోజు కూడా లంచ్ టేబుల్ దగ్గర కూర్చున్నాం ఆమే నేనూ. రోజూ గలగలా నవ్వుతూ జీవితం ఇంత త్వరగా గడిచి పోతుందా అనిపించేలా మాటాడే మనిషి  ఈరోజేంటో  చాలా మౌనంగా ఆలోచనలతో వుంది. ‘ఏంటీ రోజు స్పెషల్స్’ అనడిగాను నేను. ‘మామూలే పెరుగన్నం’ అంది. ఈ ఆఫీసులో...

పంజాబ్ మెకానిక్

ఓ రోజు సాయంత్రం సన్నగా వాన మొదలైతే  శంకర్ విలాస్ లో కాఫీ తాగుదామని దూరాను. నా టేబుల్ ముందు కుర్చీ ఖాళీగా వుంది. ఓ సన్నగా పొట్టిగా  వున్న వ్యక్తి   హడావుడిగా వచ్చి కూర్చున్నాడు. బాగా నూనె రాసి జుట్టు వెనక్కి దువ్వి వున్నాడు. రుమాలు తీసి ముఖం...

ఎక్కడరా పాయసం బూరెలూ?

చాలా రోజుల తర్వాత కాదు, సంవత్సరాల తర్వాత ఆ వూరు వెళ్ళాను. నా చిన్న తనం లో తిరిగిన వూరు. మట్టి రోడ్లన్నీ ఇరుకు సిమెంటు రోడ్లయాయి. మందులమ్మిన బాలస్వామి కొట్టయితే అలాగే వుంది. పొడుగు చేతుల తెల్ల చొక్కా , గ్లాక్సో పంచె కట్టుకుని స్కూలు కెళ్ళే పిల్లల్ని...

ట్రాన్స్ ఫర్

తెగని ఆలోచనలు. ట్రాఫిక్ కూడా చాలా ఎక్కువగా వుంది. మెల్లగా బాలన్స్ చేస్తూ బండి నడుపుకొస్తోంది కల్పన. సంవత్సరమైంది ఈ రోజుకి. ఎక్కువ సంపాదన అంటూ వెళ్ళాడు ఢిల్లీకి. వెళ్ళింది మొదలు మాటా మంతీ ఏదీ లేదు. ఎపుడు కాల్ చేసినా ‘బిజీ మళ్ళా మాట్లాడతా’ అనే సమాధానం...

రంగు రెక్కల గుర్రం

రోజూ ఇలాగే ఇక్కడికే ఎందుకో ఎక్కడికో తెలియకుండానే వచ్చేస్తున్నా ఇది నిజమూ కాదనీ కలా కాదనీ కల లాటి నిజమూ కాదనీ తెలుస్తూనే వుంది నిజమైతే కూడా బాగుండని అనిపిస్తూనే వుంది ఏదో తెలియని లోకం రోజూ చూసే మనుషుల్లా లేని మనుషులు కనిపిస్తున్న లోకం ఆకసాన్ని...

లడ్డూ కావాలా?! 

‘మొత్తానికి ఈ పార్టీ దాకా తెచ్చినందుకు హార్టీ కంగ్రాట్స్ రత్నం‘ ముగ్గురూ గొంతులు కలిపి పెద్దగా నవ్వారు. ‘చీర్స్‘ అంటూ తలా ఒక గ్లాస్ అందుకున్నారు. గోల్డెన్ ఫుడ్ హోటళ్ళ స్థాపనలో నాలుగో హొటల్ ప్రారంభ సమావేశం అయాక ఫౌండర్స్...

జొమాన్స్

‘హాయ్ మాటి!’ వాట్సాప్  పలకరింత.  ‘ఏంటి మాటో?’ రిప్లై పెట్టింది శ్వేత.  ‘ఏ ఏరియా?’  ‘శ్యామల నగర్.  యు?’ ‘గోరంట్ల.’ ‘ఎంజాయ్’ ‘యు టూ’  ‘వెన్ మీటింగ్?’ ‘జి. ఓ. కే.’ ఇలా పలకరింతలవగానే బండి స్టార్ట్ చేసింది శ్వేత.  డిగ్రీ అడ్మిషన్ వచ్చేలోపు ఖాళీగా ఉండడం...

కొత్త తరం

స్నానం చేసి పేపర్ చదువుతున్నాను  పొద్దున్నే సలీం ఫోన్  ‘ఇంట్లోనే ఉన్నావా?’  ‘అవును‘  ‘మన శోభన్బాబును హాస్పిటల్లో చేర్చారు. బాగోలేదు.’  ‘అయ్యో అలాగా !ఎక్కడ ?ఏ హాస్పిటల్ ? రమేష్ లోన? నేను ఒక గంట లో...

ఒక్క ఆశ!

‘అయ్యా కాయలన్నీబండికెత్తాను. ఒక్క కాయ ఇయ్యయ్యా. శ్రీకాంత్ వాళ్ళు ఫ్రిజ్ తెచ్చారంట.  ముక్కలు కోసి దానిలో పెట్టుకుని తింటే చల్లగా బాగుంటయ్యంట. ఒక కాయ నానా ప్లీజ్.’ పదోసారి అడుగుతున్నాడు శీనుగాడు శంకరయ్యని. ‘ఒకటే గోల పొద్దుగాల నుంచి. కొన్న యాబై కాయల్లో...

పైనాపిల్ జామ్

‘పైనాపిల్ జామ్ దొరుకుతుందా?’ ‘చూస్తానుండండి’ షాపు లో ని వ్యక్తి వెతుకుతున్నాడు. పైన అరలో ఉన్నట్లుగా ఉంది. తీసి గుడ్డతో తుడిచాడు. ‘అయితే ఇంకా టైం ఉందో లేదో తెలియదు.చాలా రోజులైంది తెప్పించి’ ‘సరిగా చూడండి. వారం నుంచి చాలా షాపులు తిరిగాను.’ ‘మంచిదే...

ఆగని పాట

‘రెండు పారాసెటమాల్ ఇవ్వండి’ అంటుండగా ‘ఆరు టాబ్లెట్లు’ ప్రిస్క్రిప్షన్ ఇస్తూ అడుగుతోంది ఆవిడ. ఎక్కడో బాగా పరిచయమైన గొంతుక! పక్కకి తిరిగి చూశాను. నా చెయ్యి పట్టుకున్న పాపను చూస్తూ నవ్వుతోంది. నెరిసిన చెంపలు. ముడతలు పడ్డ పెద్ద కాటుక కళ్ళు. స్టిక్కర్...

పాఠం

‘రెండు ప్లేట్లు ఆలు సిక్స్టీ ఫైవ్’ అడిగాను నేను. ‘రెండు ప్లేట్లు ఆలు 65 బదులు బేబీ కార్న్ ఒక ప్లేటు ఆలు 65 ఒక ప్లేటు తీసుకోండి. వెరైటీ ఎంజాయ్ చేస్తారు’ అన్నాడు అతను. సన్నగా పొడుగ్గా  నమ్మకంతో చిన్నగా నవ్వుతున్నాడు. వంకీలు తిరిగిన జుట్టు పక్క పాపిడి...

కుంక బొంకుడి గుడ్లు

రైలు ఎక్కడో ఆగింది. ఉక్కపోతగా ఉండడంతో అందరితో పాటు బయటకు దిగాను. ఒక చిన్న ఊరు. చిన్న ప్లాట్ ఫామ్. చాలా ఎత్తుగా ఉంది. దూరంగా ఒక పల్లె. ఇంకా దూరంగా ఓ పట్నం తాలూకు అపార్ట్మెంట్ లైట్లు పెద్ద స్తంభాలకు తళుకులు అంటించినట్లుగా మెరుస్తున్నాయి. చల్లటి గాలి...

పొత్తుల  ప్రేమాయణం

1. నువ్వూ  నేనూ… చెప్పు నువ్వూ నేనూ? ప్రజా ప్రేమికులం కదా, వారి గురించిన మన కలలు ఒకటే గదా, మనం మనం ఒకటి! సరే , ఒకే గూటికింద ఒకే కుంపటి పెట్టి దొరికింది దొరికినట్టు వండుకుతినేద్దాం మనవారి కోసం జీవితాలు పణంగా పెట్టేద్దాం 2. ఎంతదృష్టం నువు నాకు...

అర్ధం కాని నవ్వు !

క్యాష్ కౌంటర్లో బిల్లింగ్ చేస్తూ దూరంగా కస్టమర్ తో మాట్లాడుతూ హరితనే చూస్తున్నాడు ఆనంద్. చాలా చలాకీగా నవ్వుతూ నవ్విస్తూ ఉంటుంది. ఎప్పుడు చూసినా అదే హుషారు. ‘ఇవాళ ఎలాగైనా అడగాల్సిందే’ అనుకున్నాడు. రెండు నెలల క్రితం ఈ హైపర్ మార్కెట్ లో చేరడానికి తానే...

నన్నే వెతుక్కుంటూ

ఈవినింగ్ వాక్ చేసి ఇంటికి వచ్చేసరికి బయట ఆరుగురు మనుషులు. కొంచెం తెలిసీ తెలియనట్లు ఉన్నారు. వీళ్ళ వేషాలు చూస్తుంటే వాళ్ళంతా నా కోసమేవేచి ఉన్నట్లుగా ఉన్నారు. ఖాకీ యూనిఫాం వేసుకున్న ఒక వ్యక్తి అప్పుడే ఆటో ఆపి దిగి నా దగ్గరకు వచ్చాడు. ‘నమస్తే సార్’...

ఎర్ర చారల కలం

ఆమె అడ్రస్  వ్రాస్తున్నంతసేపూ ఆమె చేతిలోని కలాన్నే చూస్తున్నా. ఎర్రచారల కలం. నాకూ అలాటిదే వుండేది. దాదాపు ఇరవై యేళ్ళు వాడాను. చాలా ఇష్టమైనది కూడా. పి.జి కాలేజీలో పనిచేసే రోజుల్లో ఒక స్టూడెంట్ ఇచ్చిన కలమది...

కొండమీది బంగ్లా

దయ్యాలు ఉన్నాయా? చిన్నప్పుడు కథలు వినేటప్పుడు ఉన్నాయి అనిపించేది. ఇప్పుడు అలా అనిపించదు. చీకట్లో గజ్జెల చప్పుడు,కనిపించని అడుగులు పరిగెత్తడం, ఇలాంటివి తలుచుకుంటే ఒళ్లు గగుర్పొడుస్తుంది. కాలేజీ చదివే రోజుల్లో చీకట్లో పది పదిహేనుకిలోమీటర్లు సైకిల్...

ఇస్మార్ట్

‘గిందాకటి కాన్నించీ  సూత్తన్నా ఏందా సూపు ‘ ‘కాదే నిన్ను సూత్తే ఏమీ సమజవడం లే. నువ్వసలు అప్పటి మడిసివేనా అని’ ‘కాక అపుడెందో గిపుడూ అదే . నువ్వూరకే అనుమానిస్తన్నావ్. నాకర్ధమైంది నీకేటైందో’ ‘ఏటైందేటి పిచ్చి లేత్తాంది సంపి ముక్కలు సేత్తామనిపిత్తాంది...

మీటింగ్

‘మధ్యాహ్నం కొత్త ప్రిన్సిపాల్ మీటింగ్ పెడతాట్ట గురూ’ – టీ తాగటానికి కాంటీన్ వైపు నడుస్తున్న అయిదుగురు అధ్యాపకులలో ఒకరు. ‘పొద్దునేగా జాయిన్ అయాడు’ – ‘కొత్త బిచ్చగాడు…’ అర్ధోక్తిగా తన ముక్కు నవ్వు నవ్వి ఆగాడు పండితుడు. ‘ఏం చేస్తాట్ట మీటింగ్...

వూరేగింపు దేవతలు

పొద్దున్నే చింత చెట్టు కింద మంచం మీద ముసుగుతన్ని పడుకున్న  భూషయ్య మీద ఎండ తన్నుకొస్తుంది. వాడి గురక అవతలదూరంగా ఉన్న పూరి ఇంట్లోని కాశవ్వకి వినిపిస్తోంది.  ‘యీడి జిమ్మడ ఇంత బద్దకస్తుడ్ని ఈ భూ ప్రపంచంలో ఎక్కడా చూడలేదు’అనుకుంటూ  కసువూడ్చి...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.