December 01-15, 2018

వెండి తెర మీద “స్ప్రింగ్, సమ్మర్, ఫాల్, వింటర్ అండ్ స్ప్రింగ్”

పదేళ్ళ క్రితం 14 వ కోల్కతా ఫిల్మ్ ఫెస్టివల్ కిమ్ కి దుక్ అనే అసామాన్య దక్షిణ కొరియా దర్శకుడిని పరిచయం చేసింది. ‘ఆవిష్కరణ’ విభాగంలో చూపిన ఆయన తాజా సినిమాలను సినీ వీక్షకులు పసందైన విందులా ఆస్వాదించారు. స్లోగా సాగుతూనే మనసులో నిలిచేలా, సైలెంటుగా...

ఆఁ..!

“బాగున్నావా?” “హూఁ! భగవంతుడి దయ, బాగానే ఉన్నాం. నువ్వెల్లాగున్నావు?” “అంతా బాగే “చాన్నాళ్ళకి గుర్తుకొచ్చానే” “అలా ఏం కాదు.టైం కుదరక“ “ఇంకా” “ఇంకేం లేదు“ “అదేంటీ...

పఠేల్ మంటున్న ప్రశ్నలు

“భారత దేశ శక్తిసామర్థ్యాలను ప్రశ్నించేవాళ్లందరికీ సమాధానం ఈ విగ్రహం” – మోడీ. నెహ్రూకి వచ్చినంత పేరు ప్రతిష్టలు సర్దార్ పటేల్ కు రాలేదనీ, ఆయన ఖ్యాతిని ప్రపంచానికి చాటాలనీ ఈ విగ్రహాన్ని నిర్మిస్తున్నట్లు మోడి ప్రకటించాడు. ఈ విధంగా పటేల్ పేరు...

దంతెవాడలో ప్రజాకీయం?

(ది వైర్ పత్రిక (08, నవంబర్, 2018) నుంచి అనువాదం. ‘ది వైర్’కు, సుకన్యా శాంతా గారికి కృతజ్ఞతలతో) నీలాయవ (దంతెవాడ, చత్తీస్ ఘర్): ఎండ మండిపోతోంది, 35 మంది బడి పిల్లలు, అందరూ ఆరేండ్లు పదకొండేండ్ల మధ్య వాళ్లు. ఒకే వరుసలో, సైనిక దళంలా నడుస్తున్నారు...

కధా రచనలో మహా మాంత్రికుడు ఓ.హెన్రీ

కథ అనగానే మనకు టాల్స్టాయ్, చెహోవ్, ఎడ్గర్ ఏలన్ పో, ఆస్కార్ వైల్డ్, సాకి, మపాసా, హాన్స్ క్రిస్టియన్ ఆండర్సన్  లాంటి కధకులు గుర్తొస్తారు. కధ లాటి జీవితాన్ని అనుభవించి కొత్త తరహా కధను అందించిన ఓ.హెన్రీ (1862–1910) అసలు పేరు ‘విలియం సిడ్నీ పోర్టర్’ ...

అప్పుడూ ఇప్పుడూ పెద్ద తేడా లేదు!

ఎన్‌.సుభాష్‌, సికింద్రాబాద్‌ ప్రశ్న : ఇప్పటి జనంలో గట్టి వ్యక్తిత్వాలు లేవనీ, పూర్వం రోజుల్లో గట్టి ఆదర్శాలతో వుండేవారనీ, మా మేనమామ అంటాడు. ఒక్కోసారి అది నిజమే అనిపిస్తుంది. అది నిజమే అంటారా? జవాబు: గట్టి వ్యక్తిత్వాలు ఎప్పుడూ వుంటాయి. ఇప్పటి...

కాలం సేతిలో సంటోడి పొద్దు

“కార్తీక మాసంలో, గోదాట్లో ములిగే  ఆడోలు తడిసిన బట్టలతోనే ఇల్ల కొత్తారు..అందుకే నొరే.. ఆడోల గుండెలు సెంచలం అన్నోడు సచ్చెదవ” ! (శీతకట్టు). ఏమిటీ వాక్యం ? ఎదో వింత పరిమళాన్ని హృదయంలోపలికి ఒంపుతోంది కదూ?”కొబ్బరినూని సిక్కగా పేరకపోయి...

పిరమిడ్ మీద ‘నరసింహం’

ప్రపంచ వ్యాప్తంగా ఈజిప్ట్ అంటే మొదట స్ఫురణకు వచ్చేది పిరమిడ్స్, ఆ తరువాతే నైలు నది తదితరాలు. ప్రాచీన ప్రపంచ వింతల్లో ఈజిప్ట్ పిరమిడ్స్ కున్న స్థానం మరే వింత కు లేదు.  కోట్ల మందికి పిరమిడ్స్ చూడటం జీవితం లోని ఒక కల. ఉత్సుకతతో మనం వాటిని చూసిన తరువాత...

రిస్క్

నంబూరు – కాకాని – నంబూరు – కాకాని. ఆటో బస్టాండ్ దగ్గర ఆపి అదే పనిగా అరుస్తున్నాడు కుమార్. ఆటో లన్ని అటుఇటుగా ఆపి తోటి డ్రైవర్లు కూడా అరుస్తున్నారు. వచ్చే పోయే బస్సులు, వాహనాలు- మనుషులు, రద్దీగా ఉంది రోడ్డంతా. ‘దీనెమ్మ జీవితం...

సంకీర్తనల్లో అంతర్లయగా వ్యక్తిత్వ వికాసం! 

వ్యక్తిత్వ వికాసమంటే కేవలం ఒక ఉద్యోగం సంపాదించుకుని, కావలసినంత డబ్బు సంపాదించుకుని జీవితమనే కోరికల ఊరేగింపులో కలసిపోవడం కాదు. లక్ష్య సాధన మీద మనసు లగ్నం చేసి, ఆ కృషిలో విజయ శిఖరాలు చేరుకున్నప్పుడు జీవితం మీ వెంట పరుగెత్తుకుంటూ వస్తుంది.  వెంట మీరు...

విడి విడి ఊహలు

ఎక్కలేని చెట్టు ఆకాశం మీద ఎక్కడో పచ్చగా, అంతెత్తున సూరీడ్ని కొన్ని పసిడి కాంతుల్ని ఇస్తాడేమో అడగాలనిపిస్తుంది చుక్కల్ని మొయ్యలేక ఆకాశం కొన్ని మనుషుల శరీరాల్లోకి తాపడం చేసినట్లుంది స్వేద బిందువులివిగో సూర్య వర ప్రసాదితాలు! జాలర్లు చేపల వలల్ని ఖాళీగా...

డాక్టర్ జివాగో పద్యాలు

బోరిష్ ప్యాస్టర్నాక్ ప్రపంచ ప్రసిద్ధ నవల ‘డాక్టర్ జివాగో’. డాక్టర్ జివాగో రాసినట్టుగా బోరిష్ ప్యాస్టర్నాక్ రాసిన పద్యాల పుస్తకం ‘డాక్టర్ జివాగో కవితలు’. నవలలో సజీవ రీతిలో కలిసిపోయే ఈ కవితలు డాక్టర్ జివాగో ప్రాపంచిక దృక్పధాన్ని ప్రతిబింబిస్తాయి...

ఒక లా గుణింతం…

ఒలేయ్… నా పేలు లవి! నేను నల్చలీ చలువు తున్నా. నాకు మాతలొచ్చు. పాతలు కూలా వొచ్చు. పైతింగులు కూలా వొచ్చని బాబాయి అంతాలు. నాకు లానిదొక్కతే. ‘ల’ (ర) పలకతం!?.. ప్చ్.. అన్నితిలోకి లావొద్దన్నా లా వొచ్చేత్తుంది.. నేను బాగా చిన్నవాలిని కలా? ఏలి పలికినా...

సముద్ర నాచు తొడుక్కున్న మనిషి

రాజు గారు నగరంలో చాటింపు వేయించారు. తన కుమార్తెను వెతికి తెచ్చిన వారెవరికైనా నిలువెత్తు ధనమిస్తాడట. చాటింపు వల్ల ఏ ఫలితం రాలేదు. రాకుమారి ఎక్కడుందో ఎవరికీ తెలీదు. ఆమెను ఎవరో రాత్రికి రాత్రి ఎత్తుకు పోయారు. ఆమె కోసం జగమంతా ఘాలించడం అప్పటికే...

నీళ్ళలో న్యాయమైన వాటా చాలు సీమ సస్యశ్యామలం!

“ రాయలసీమవాసులు నిరంతరం శ్రమజీవులు. అయినా ఎప్పుడూ వారికి కష్టాలు, కన్నీళ్లే తోడు. దీనికి కారణం ప్రభుత్వం సాగునీటి వసతి సరైన రీతిగా కల్పించకపోవడమే.  రాయలసీమ పై ఎటువంటి దయ చూపవలిసిన పని లేదు. న్యాయంగా రావలిసిన నీటి వాటా ఇచ్చి రిజర్వాయర్లు నిర్మిస్తే...

మానవ శరీరాలూ మంచినీళ్ల గ్లాసులూ

  సర్దాగా ఈ సారి సెక్సు సంగతులు మాట్లాడుకుందామా? అడగాలా? ఎవురు కాదంటారు! ఎవురూ కాదనరు గనుకనే అంతటి మానుభావుడు, తెలుగు సాహిత్యంలో సెక్సు స్పెషలిస్టు చెలం సారు మహా ప్రస్థానం పీఠికలో… అదే, గుర్తుంది లెండి, ‘యోగ్యతా పత్రం’లో ‘ఇందులో మిమ్మల్ని...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.