February 16 – 28, 2019

భాగ్యలతా కాలనీ

ఆ మర్నాడే అరుణ విమానమెక్కి వెళ్ళిపోతుంది. ఇంక నాకెప్పటికీ కనపడకుండా. నేను చేసిందే అంతా. మేమిద్దరమూ ఒక జంట అన్న నమ్మకంలో ఆమె ఆస్ట్రేలియాలో ఉద్యోగం చేసుకుంటుంటే, ఇక్కడ నేను ఇంకో అమ్మాయికి దగ్గరయ్యాను. తనతో కలిసాను కూడా. నా వంచన పొడ అరుణకి వెంటనే...

ఎర్ర చారల కలం

ఆమె అడ్రస్  వ్రాస్తున్నంతసేపూ ఆమె చేతిలోని కలాన్నే చూస్తున్నా. ఎర్రచారల కలం. నాకూ అలాటిదే వుండేది. దాదాపు ఇరవై యేళ్ళు వాడాను. చాలా ఇష్టమైనది కూడా. పి.జి కాలేజీలో పనిచేసే రోజుల్లో ఒక స్టూడెంట్ ఇచ్చిన కలమది...

ఉనికి

నా భావాలు రూపాన్ని అద్దుకుని నీవుగా మారి ఎదుట నుంచోడం ఎంత బాగుందో.. అనేకానేక నేనులు బయల్డేరి నీచుట్టు నుంచుంటాం నీ మాట కోసం నీ చూపు కోసం.. కాలం అక్కడే నడకను మర్చిపోతుంది.. నువు పంపే హడవుడి సంక్షిప్త లేఖలు వెన్నెల రోజుల్లో సుదీర్ఘ లేఖలు కృష్ణపక్షంలో...

డోంట్ కాల్ మీ బేబీ ఎనీ మోర్

మాకు చిన్నప్పటి నుంచీ రేడియోలో విన్న పాటలని మాకున్న భాషా పరిఙ్ఞానంతో అర్థం చేసుకుని పాడడం ఇష్టం. మా ఇంట్లో తెలుగు పాటలే కానీ పక్కింటీ మామీ గారింట్లో వాళ్ళ పెద్దబ్బాయి హిందీ తప్ప వినే వాడు కాదు. పక్క పక్కనే గడపలున్న మూడు వాటాల ఇల్లు. ఉన్న రెండేసి...

మరణం అతని చివరి శ్వాస కాదు

తెలంగాణా రాష్ట్రం 12.02.2015 జగిత్యాల అంగడి బజార్లో అంతా కోలాహలం గా ఉంది . అది రాజకీయ సభకాదు, అక్కడకి వచ్చేది ఓట్లు కొనుక్కున నేతలూ కాదు, మరి ఎవరికోసం ఆ జన సందోహం అంటే ఒక కవి కోసం. అభిమానులు ఎంతో ప్రేమగా , అజరామరమైన అక్షర యోధుడికి కానుకగా, ఆయనకి...

గేయసదాశివబ్రహ్మం

(ఈ వ్యాసంలో వ్యక్తమయిన ధర్మాధర్మాలకు, ఆలుమగల విలువలకు ‘రస్తా’ ప్రాతినిధ్యం వహించదు. పాట ఇవాల్టి విలువల రీత్యా మగదురహంకారమనే అనిపించుకుంటుంది. పాట లోని కులం ప్రస్తావన తప్పక అవాంఛనీయం. నిజానికి ఆ మేరకు రామాయణ గాథ సాంతం చర్చనీయాంశమే. అయితే, ‘...

ఒక ఉచిత సలహా…

హాయ్ రా… ఒకసారి ఏమయిందంటే- నాకు జ్వరం వచ్చింది. తల్చుకుంటే ఇప్పుడూ జ్వరం వచ్చేలా వుంది. జ్వరం వచ్చిందని మా మావయ్య నన్ను డాక్టరు దగ్గరకు తీసుకు వెళ్ళాడు. అక్కడ నర్సింగ్ హోం నిండా జనం వున్నారు. సీజనట. అందరూ పెసెంట్లే. డాక్టరు కూడా పెసేంటే...

పొగమంచు

చలికాలం కావడం వలన ఆరు దాటి అరగంటైనా, ఇంకా సూర్యోదయం కాలేదు. గులాబీ రంగు కాంతి ఆకాశానికి అంటుకొని, సముద్రమూ ఆకాశమూ కలిసే చోటంతా పొగమంచుతో నిండి పోయి, ఆ మొత్తం దృశ్యం నీటిలో ప్రతిబింబించి, కళ్లెదురుగా ఉన్నది రోజూ చూసే భూమేనా? లేక  వేరే లోకమా...

నిర్భయం వల్ల జయం నిశ్చయం!

‘ఒకసారి మన మీద మనకు నమ్మకం ఏర్పడితే మనలోని కుతూహలాన్ని, ఆశ్చర్యాన్ని, తక్షణ ఆనందాన్ని, ఆ మాటకొస్తే మనిషిలోని అంతర్గత శక్తిని మేల్కొలిపే ఏ అనుభవాన్నైనా తిరస్కరించవచ్చు.’ -ఇ.ఇ.కమ్మింగ్స్ ఎన్నో ఏళ్ళుగా నా కలల్ని నిజం చేసుకోవడానికి...

పర్సూట్ ఆఫ్ హ్యాపీనెస్ – కాపిటలిస్ట్ కోణం

కొంతకాలం క్రితం పర్సనాలిటీ డెవలప్మెంట్ అనే సెల్ఫ్ హెల్ప్ పుస్తకాలు ఇబ్బడిముబ్బడిగా మార్కెట్లో దర్శనమిచ్చాయి. తెలుగు లో కూడా వీటి హల్చల్ కొంతకాలం కనబడింది. ఈ పుస్తకాలు గత వందేళ్ళుగా అమెరికన్ మార్కెట్ లో అడపదడపా కనిపిస్తున్నా 1970 నుండి మొదలుకొని 2000...

పోయేదేమీ లేదు!

ఆకాశంలో నున్న వేదాంతిని బతుకు పాయల నడుస్తున్న సంసారినీ నడి బజారు కి రప్పించి తుదకి వోటరు గా మార్చి పింఛనీ యిప్పిస్తోంది ప్రతిభ గల ప్రభుత్వం రండి మనుషులారా ఓటరు కండి పోయేదేమీ లేదు రేపటి బతుకు తప్ప! పొయ్యి దగ్గర చతికిలబడిన ఆశయం చరిత్ర ని మంట పెట్టి...

మహాకవి హుళక్కి భాస్కరుడు

"నన్నయ భట్టు తిక్కకవి నాయకులన్న హుళక్కి భస్కరుండన్నను జిమ్మపూడి యమరాధిపుడన్నను సత్కవీశ్వరుల్
నెన్నుదుటన్ కరాంజలుల నింతురు చేయని రావితాపాటి తిప్పన్నయు నంతవాడె తగునా యిటు దోసపుమాట లాడగన్"

వచనకవితలో బతుకు పాట

కవిత్వమంటే ఒక పరిధిలో గీసుకున్న చిత్రం కాదని, దాని హద్దు అనంత విశ్వమనీ అంటూనే తన దైనందిన జీవనంలోని ప్రతి ఆర్ద్రమైన సందర్భాన్ని కవిత్వం లోకి నడిపించాడీ కొత్త కవి.గుప్పెడు అక్షరాలు మోసుకుంటూ విరామమెరుగక తిరిగుతాడు. మగాడి నన్న ఆహంకారపు చొక్కా విప్పి...

చదరంగం

రోజులు వారాలు నెలలు సంవత్సరాల నుండి యుగాల్లో కి లాక్కోబడిన కాలం పునరావాసం దొరకక కూలిన మానవత్వపు పునాదులపై చిరునామా వెతుక్కుంటోంది హక్కులు అరాచకాలపై తిరగబడిన ఎర్రని రంగు తడి ఇంకా ఆరనే లేదు గుండెలలిసేలా పరుగులు తీసిన సమానత్వం అవినీతి గండ్ర గొడ్డళ్ల...

యాత్ర

చాల కాలం తరువాత ఒక సినిమా చూస్తూ నన్ను నేను ఆపుకోలేనంతగా ఏడ్చాను. పబ్లిక్ థియేటర్. పక్కన ఎవరో చూస్తారని సందేహించకుండా ఏడ్చాను. సంతలో షావుకారు మొన్న ఇరవై రూపాయలకు అమ్మిన టొమాటో పళ్ళను ఇవాళ రూపాయిన్నరకు అడిగినప్పుడు, ‘ఆటో  కిరాయి కూడా కట్టలేం నాన్నా’...

ఆదివాసుల గుండె చప్పుడు ఫాదర్ స్టాన్ స్వామి

ఆగస్టు 28, 2018 ఉదయం: సామాజిక, మానవహక్కుల కార్యకర్తల మీదా, ప్రొఫెసర్లూ, జర్నలిస్టుల మీదా దేశవ్యాప్తంగా తెల్లవారు ఝామున్నే జరిగిన దాడులతో ఉలికిపడి మేల్కొంది భారతదేశం. ‘నరేంద్ర మోదీ మీద హత్యాప్రయత్న’ ప్రణాళిక  అంటూ పోలీసులు సృష్టించిన ఉత్తరం ఆధారంగా...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.