June 1-15, 2018

మార్క్సిస్ట్ సినిమా: ఐజెన్ స్టీన్ ప్రయోగాలు

రష్యా విప్లవ శతజయంతి ఉత్సవాలు ఏడాది క్రితమే ముగిశాయి. ఈ సంవత్సరం కార్ల్ మార్క్సు ద్విశత జయంతి. ఈ రెండు సందర్భాలను సినిమాకు అన్వయించుకుంటే, వెంటనే గుర్తొచ్చే పేరు ఐజెన్ స్టీన్. సినీ నిర్మాణంలో మార్క్సు పద్ధతిని ప్రయోగించిన దిట్ట ఆయన. మార్క్సు...

కోదండ రామ్  ఏమనుకుంటున్నారు?!

  తెలంగాణాలో, బహుశా తెలుగు నాట ఒక ముఖ్య పరిణామం కోదండ రామ్ నేతృత్వంలో కొత్త పార్టీ, ‘తెలంగాణా జన  సమితి’ పుట్టుక. దీని గురించి ఎవరి వూహలు, అంచనాలు వారికి వుంటాయి. అసలు బరువు మోయాల్సిన వారిలో అతి ముఖ్యుడు కోదండ్ రామ్ ఏమనుకుంటున్నారు...

నగ్నముని తో ముఖాముఖి

  ఒక్కొక్క కవిది ఒక స్వరం. తనదయిన గొంతు కలిగిన అరుదైన కవులలో నగ్నముని ఒకరు. నేరుగా సూటిగా మనుషుల్లోని హీనత్వాన్ని కాలరు పట్టుకుని నిలేసినట్టుగా అన్యాయమయిపోతున్న వాళ్ళకు ‘ఎదరు తిరుగు భయం లేద’ని భరోసా ఇస్తున్నట్లుగా పలుకుతుంది నగ్నముని...

పచ్చటి కవిత్వం – భిన్న కోణాలు

  కవిత ఒక భద్రమైన శక్తి, ఒక అనధికార ప్రకంపన,  ఓ జీవం, ప్రవాహంలోని సుడి. కవితలు జీవనాన్ని సుస్థిరం చేసే మూల మార్గాలు. కవితలు ప్రకృతి అవశేషాలను పోలిన అక్షరమైన మాటల దార్లు (భద్రమైన శక్తి), అవి పునరావృతమయ్యే ప్రకృతి శక్తి జన్యు వనరులు. ఊహ, భాష కవలల...

త్రీ ఛీర్స్ టు పొయెట్రీ

  నీలోకి దారి తెలియక… నీలోకి చూసే ముందు నాలోకి నన్ను చూసుకోవాలి లోపల్లోపలికి చూసుకున్న కొద్దీ నీ నీలికళ్ళ వలయ లయల్లోకి మంద్రస్వర మార్మిక తుషారాల లోయల్లోకి- నిను స్పృశించే ముందు నా చర్మం పొరల వెనుక జ్వలించిన కాంక్షా సౌగంధ సౌరభాల్ని...

రాత్రిపక్షి కలరవం – శివలెంక రాజేశ్వరీదేవి కవనం

మనఃశరీరాల మధ్య, రేయింబవళ్ళ మధ్య, ఊహావాస్తవాల మధ్య, వాదానుభవాల మధ్య, స్వప్నజాగ్రదవస్థల మధ్య అవిరామ సంఘర్షణలోని సంవేదనతో శివలెంక రాజేశ్వరీదేవి (16.01.1954-25.04.2015) కవి హృదయం శత పద్మంలాగ వికసించింది. జననంతో ప్రాప్తించిన ఏకాకితనంలోంచి, దివాస్వప్నంలో...

అమెరికాలో పొంగుతున్న జన సముద్రాలు

“ఈ రోజు నేను పదకొండు అరటి పండ్లు తిన్నాను, దారి పొడుగునా జనం ఇస్తూ వుంటే…” అన్నాడు అరోన్ బేకర్ అనే ఉపాధ్యాయుడు దీర్ఘ యాత్ర (మార్చ్) లో నడుస్తూ. ఈయన 8 వ గ్రేడ్ ( తరగతి) పిల్లలకు అమెరికా చరిత్ర బోధిస్తాడు. ఇప్పుడు చరిత్ర సృష్టిస్తున్న వారిలో తనూ...

ముగ్గు

జనవరి నెల కావడంతో చలి బాగానే వణికిస్తోంది. దానికి తోడు తెల్లవారుజామున బాగా మంచు కురిసినట్లుంది. మరింత చురుగ్గా పదునుగా శరీరాన్ని తాకిన చల్లని గాలులు వణుకు పుట్టిస్తున్నాయి. ఈ రోజునుంచి తనకు సంక్రాంతి శలవులు అన్న విషయం గుర్తుకు వచ్చిన సంతోషం...

ఎబిసిడి కార్పొరేట్ హాస్పిటల్

ఓరి ఎదవన్నరెదవన్నరెదవా! ఏందిరా అట్టా మిడి గుడ్లేసుకుని చూత్తావు. అమాయకుడికి అక్షింతలిత్తే ఆవలికిబోయి నోట్టో ఏసుకున్నాడంట. జింతాతజితజిత జింతాతతా అనుకుంటా లోకంతో బాటు పోతా ఉండాల గానీ ఇట్టా ఆయుర్వేదం, హోమియోపతీ, సిద్ద వైద్యం, మట్టి తానాలు, సుక ప్రసవోలు...

వెయ్యి సంవత్సరాల ప్రార్థన

ప్రజలు ఎవరైనా అడిగినప్పుడు నేను చైనాలో రాకెట్ శాస్త్రజ్ఞుడిగా పని చేసి రిటైర్ అయ్యాను అంటాడు షి. ప్రజలు అందరూ అతడిని గొప్పగా చూస్తారు. రాకెట్ శాస్త్రజ్ఞుడు అనే పదం తను డెట్రాయిట్ లో ఉండగా ఒక మహిళ ఉపయోగించింది. తన చాలీచాలని ఉద్యోగాన్ని గురించి...

కాకులూ, గంధపు చెట్లూ

పెద్దిభొట్ల సుబ్బరామయ్య కథాశిల్పం గురించి కొన్ని ఆలోచనలు ‘కథలంటే వింతవిషయాలే గదా’ (‘ఆర్ముగం-అనంతలక్ష్మి’కథలో కథకుడు)   పెద్దిభొట్ల సుబ్బరామయ్య (1938-2018) ఆధునిక తెలుగు కథని రెండడుగులు ముందుకు నడిపించిన కథకుడిగా తన జీవితకాలంలోనే గుర్తింపు...

సరళ కవితకు ఆద్యుడు నన్నెచోడుడు

  పాశ్చ్యాత్య సాహిత్య ధోరణుల ప్రేరణ కావచ్చు లేక మారుతున్న కాల ప్రభావం కావచ్చు,  ఆధునిక కవిత్వ సృజన అధిక శాతం వచనంలోనే సాగుతోంది. భావనా శక్తి ఉండాలే గానీ ఛందో బద్ద  పద్యంలోనే కాదు ప్రతీ ఆలోచననూ స్వేచ్చగా సరళమైన వాడుక భాషలో వ్యక్తం చేయవచ్చు. ఇది...

ప్రియ గానమేదే ప్రేయసీ

కేవలం మాటలతో ప్రేక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేయగల మహాశిల్పి పింగళి నాగేంద్రరావు. విజయా సంస్థ విజయ ప్రస్థానంలో ఆయన రచనలు పోషించిన పాత్రఅసామాన్యమైనది, అనితరసాధ్యమైనది. ఎన్నో మధుర ప్రేమ గీతాలు రచించిన ఆయన ఆజన్మబ్రహ్మచారి కావడం ఒక విశేషం. వీరి ప్రణయ...

గానిగిల్లు

నీలగుంట కాడ  చెరకు గానిగ ఆడతా ఉండారట . మా నాగ తాత  బయిదేలతా ఉండాడు. నేనూ పోవాలనుకుంటా ఉండాను. గానిగల కాలం వచ్చిందంటే నెలగానీ రెణ్నెల్లు గానీ మా తాత ఇంటికి రాడు. మా తాతే కాదు, ఏ ముసిలోడూ ఇంట్లో ఉండడు. గానిక్కి పొయ్యికట్టి  వేసేకి ముసిలోల్లే పోయేది...

పాఠకులే విలేకరులు

... ఇప్పుడు న్యూస్ స్వరూపం మారిపోయింది. ‘పేపర్’ కనుమరుగవుతూ ఉంది. మెళ్లిగా పేపర్ లెస్ పరిపాలన, న్యూస్ పేపర్ లెస్ జీవితం మొదలయింది. ఈ దశకు తగ్గట్టు న్యూస్ కూడా అవతారం మార్చుకుంటున్నాయి. పొద్దన లేస్తూనే న్యూస్ పేపర్ పట్టుకోవడానికి బదులు స్మార్ట్ ఫోన్...

ప్రశ్నలూ జవాబులు

  రంగనాయకమ్మ   తెలుగు సాహిత్యంలో అచ్చమైన తిరుగుబాటు బావుటా రంగనాయకమ్మ. మానవ స్వేఛ్చకోసం దీర్ఘకాలికంగా ఏం చేయాలో చెబుతూనే, ఎప్పటికప్పుడు ముందుకొచ్చే చిటిపొటి సమస్యలనూ శోధించి మాట్లాడుతున్నారామె. కేవలం సైద్ధాంతిక సమస్యలే కాదు. కుటుంబాలు...

డిప్రెషన్ ఒక సంక్లిష్టమైన జబ్బు

దేహాల గురించి సందేహాలు ఉంచుకోకుండా మనకు నమ్మకం వున్న క్వాలిఫైడ్ డాక్టరుతో మాట్లాడి ఆయన సలహా పాటించాలి తప్ప సొంత వైద్యానికి లేదా వినికిడి వైద్యానికి చెవుల్నీ దేహాల్నీ ఇచ్చేస్తే మేలు కన్న కీడు చాల ఎక్కువని… మే నెల రస్తాలో డాక్టరు గారు చెప్పారు. దానికి...

‘ఒంటరి’ కానిదెవ్వరు’?!

గ్రామీణ జీవిత నేపథ్యంగా రచనలు సాగిస్తున్న వారిలో సన్నపురెడ్డి వెంకట్రామిరెడ్డి ఒకరు. ఆయన ఇప్పటికే 7 నవలలు, రెండు కథా సంపుటాలను ప్రచురించినారు. సాహితీ క్షేత్రంలో ఆయన పండించిన మరో పంట ‘ఒంటరి’ నవల.  ఇది ‘తానా’ నవలల పోటీలో ద్వితీయ బహుమతి అందుకుంది...

కర్నూలులో కథల సందడి

సాంప్రదాయ సాహిత్య సమావేశాలకూ, పద్య నాటకాలకూ, అవధానాలకూ నెలవైన చోట కథ సామాజిక ప్రయోజనం కోసమే అని నమ్మి ఆధునిక కథను భుజాలకు ఎత్తుకుని మోసిన నిన్నటి కథాసమయం మిత్రులనుండి సాహిత్యాంశంగా  కథకు పెద్ద పీట వేస్తున్న కర్నూలు నగరంలో 2018 ఏప్రిల్ 28, 29న...

సూపర్… చాలా హ్యాప్పీ…

నేను ఇంటికి ఫోన్ చేసినప్పుడల్లా చుట్టాలో, స్నేహితులో ఎవరో ఒకరుంటారు… నాన్న పెద్దవారవడంతో ఇంటి ముందు నించి వెళ్ళే వాళ్ళందరూ ఒక సారి చూసి పలకరించి పోతుంటారు. వాళ్ళని పలకరించమని మా అక్క ఫోన్ ఇస్తూ ఉంటుంది. అటు అత్తయ్య కి ఫోన్ చేసినప్పుడు కూడా...

‘గూఢ చారుల’ వంతెన మీద కాసేపు

కొన్ని నగరాల పేర్లు మనకు పెద్దగా పరిచయం ఉండకపోవచ్చు. వాటి పరిమాణం కూడా చాలా చిన్నది కావచ్చు. అలాగని  వాటి చారిత్రాత్మక ప్రామఖ్యాన్ని తక్కువ అంచనా వెయ్యలేం. అటువంటిదే బెర్లిన్ సరిహద్దులోని పోట్స్డామ్ నగరం. పోట్స్డామ్ (Potsdam) జనాభా రెండు లక్షలకు...

సాగర ఘోష

అక్కడ కొన్ని బతుకు కెరటాలు వున్నట్టుండి విరిగి ఓటి నత్తగుల్లలౌతాయి! కొన్ని సైకత చిత్రాలు నీట మునిగి చెదరిన రేణువులుగా మిగులుతాయి!   అక్కడ కొన్ని దేహాలు ఉప్పులో నానబెట్టిన జల పుష్పాలౌతాయి! కొన్ని రాత్రులు కడలి లోతుల్లో వెలుగు ముత్యాలకై చరించే...

రెండు కథలు ఒక పోలిక

ఇది ‘ప్రాతినిధ్య 2014’ కథల సంపుటిలోని రెండు కథల మీద చిన్న పరామర్శ. ఆ రెండు కథలు: ఒకటి అరిగె రామారావు రాసిన ‘కొత్తనెత్తురు’, రెండోది వేంపల్లి షరీఫ్ రాసిన ‘తలుగు’. ఈ రెండు చదివాక ఈ కథల్లోనూ ఒక అంతర్లీనమైన ఒక పోలిక చాలా ఆలోచనల్ని రేకెత్తించింది. అది...

సంబరం

ఇది కార్ల్ మార్క్స్ ద్విశత జయంతి సంవత్సరం. ఒక వుద్వేగం. ఒక వుత్సాహం. ఆలోచనల చరిత్ర చేసుకుంటున్న సంబరం. వంతెన కింద చాల జలాలు ప్రవహించాయి. ‘అయామ్ డన్ విత్ మార్క్సిజం’ అనడం ఒక ఫ్యాషన్ అయిపోవడం, ఆ ఫ్యాషన్ అర్థరహితమయిపోవడం కూడా జరిగి పోయింది...

Your Header Sidebar area is currently empty. Hurry up and add some widgets.